Telugu govt jobs   »   Indian Army signs MoU with HPCL...

Indian Army signs MoU with HPCL & NIEDO for Ladakh Ignited Minds project | లడఖ్ ఇగ్నైటేడ్ మైండ్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి HPCL & NIEDO తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్న భారత ఆర్మీ

లడఖ్ ఇగ్నైటేడ్ మైండ్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి HPCL & NIEDO తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్న భారత ఆర్మీ

Indian Army signs MoU with HPCL & NIEDO for Ladakh Ignited Minds project | లడఖ్ ఇగ్నైటేడ్ మైండ్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి HPCL & NIEDO తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్న భారత ఆర్మీ_2.1

ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఆధ్వర్యంలో లడఖ్  యూత్ ఆర్మీ కార్పొరేట్ భాగస్వామి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) మరియు లెహ్ లో 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయంగా కలిగిన  ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నేషనల్ ఇంటెగ్రిటీ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (నీడో)తో   లడఖ్ ఇగ్నైటేడ్  మైండ్స్ ప్రాజెక్టు కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రాజెక్ట్ వివరాలు :

  • కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ యొక్క యువతకు మంచి భవిష్యత్తును కల్పించడానికి లడఖ్ ఇగ్నిటెడ్ మైండ్స్: ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ వెల్నెస్ అనే కార్యక్రమం రూపొందించబడింది.
  • భారత సైన్యం యొక్క ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్జిఓ అయిన నేషనల్ ఇంటెగ్రిటీ & ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఇడిఓ) నిర్వహిస్తుంది.
  • హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ద్వారా అవసరమైన నిధుల సహకారంతో నిర్వహణ మరియు లాజిస్టిక్‌లను ఏర్పాటు చేసే  కార్యకలాపాలను సైన్యం పర్యవేక్షిస్తుంది.
  • నైపుణ్యం అభివృద్ధికి మాత్రమే కాకుండా, లడఖ్‌లోని నిరుపేద మరియు వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా సైన్యం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రముఖులు పేర్కొన్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

లడఖ్ గవర్నర్లు & నిర్వాహకులు: రాధా కృష్ణ మాథుర్.

 

Sharing is caring!