Telugu govt jobs   »   తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి పై శ్వేత...

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం లోని ముఖ్యమైన అంశాలు పార్ట్ – 1, TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు 2 ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఈ పేపర్‌లో ‘బడ్జెటె వర్సెస్ తెలంగాణ వాస్తవ వ్యయం’, ‘అత్యుత్తమ రుణ పోకడలు’, ‘పెరుగుతున్న రుణ సేవల భారం’, ‘విద్య & ఆరోగ్యంపై వ్యయం’ సహా 11 అంశాలపై వివరాలు ఉన్నాయి. ఈ కథనంలో తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రం లోని కొన్ని అంశాలు పార్ట్ 1 గా మేము పేర్కొన్నాము. మిగిలిన సమాచారం కోసం ఈ పేజీ ని బుక్ మార్క్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రంలో ఉన్న అంశాలు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ , TSPSC గ్రూప్ 2 మరియు TSPSC గ్రూప్ 3 మరియు ఇతర తెలంగాణ పరీక్షలకు చాలా ముఖ్యమైనది

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి పై శ్వేత పత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్టమొదటి బడ్జెట్ ను 2014 నవంబర్లో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరిందనే ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ప్రధానంగా నీళ్లు, నియామకాలతో పాటు “నిధులు” ప్రాతిపదిక. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థను బాధ్యతాయుతంగా, క్రమ పద్ధతిలో నడుపుతారని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు.

ఉమ్మడి రాష్ట్ర ఆస్తులు మరియు కార్పొరేషన్ల విభజన అంశాలలో అనిశ్చితి మరియు పెండింగ్లో ఉన్నప్పటికీ, తెలంగాణ ఆర్థిక రంగం బలమైన పునాదులతో ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాలలో రెవెన్యూ మిగులుతో పాటు, ఆర్ధిక బాధ్యత, మరియు బడ్జెట్ నిర్వహణ నిబంధనలు పాటించబడ్డాయి.

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ బగీరథ వంటి మెగా ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చాలా సమూలంగా మారింది. ఈ మెగా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్లను చేపట్టడానికి అవసరమైన వనరులను సమీకరించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVలు) సృష్టించబడ్డాయి

ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ను 2020 లో సవరించబడింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీల పరిమాణం రెవెన్యూ రాబడిలో 90% నుండి 200%కి పెంచబడింది. బడ్జెటేతర (ఆఫ్ బడ్జెట్) రుణాలను పెద్ద ఎత్తున సమీకరించడం మరియు SPVలకు రాబడులు లేకపోవడం వల్ల ప్రభుత్వ హామీ రుణాలు బడ్జెట్ వనరుల నుండి ప్రభుత్వమే చెల్లింపు చేస్తుంది. దీని వలన రాష్ట్ర రుణాల చెల్లింపులలో పెరుగుదల కారణంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలకు మరియు అభివృద్ధి పనులకు నిధుల లభ్యత తగ్గింది.

గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల తరువాత, రాష్ట్రం యొక్క బడ్జెట్ మరియు బడ్జెటేతర రుణాల భారం అపారంగా పెరిగింది. ఇది ఆర్థిక రంగంలో సంక్షోభాన్ని సృష్టించింది. ప్రస్తుత శ్వేతపత్రం డిసెంబర్ 2023 నాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి యొక్క వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం-అంశాలు:

ముందుగా, వాస్తవ అంచనాల ఆధారంగా బడ్జెట్ తయారు చేసే పధ్ధతి యొక్క నాణ్యత విశ్లేషించబడింది. రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడంలో బడ్జెట్ రూపకల్పన జరుగలేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 నుండి తెలంగాణ ప్రాంతంలో చేసిన ఖర్చులను సవివరంగా అందిస్తూ, ఖర్చు చేసిన ఈ వనరుల నుండి సృష్టించబడిన ఆస్తుల జాబితా కూడా ఈ విశ్లేషణలో తెలుపడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ వృద్ధికి ఆదాయ వనరులు మరియు రాష్ట్ర రుణ స్థితిని ఇతర రాష్ట్రాలతో పోల్చుతూ సవివరంగా విశ్లేషించబడింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రుణం మరియు ప్రభుత్వం హామీల ఆధారంగా SPVలు మరియు ఇతర సంస్థలు సేకరించిన రుణాల వివరాలు పేర్కొనడం జరిగింది. రుణభారం విపరీతంగా పెరిగినందున, రాష్ట్రం చెల్లించె అసలు మరియు వడ్డీ చెల్లింపులు కూడా విపరీతంగా పెరిగాయి. భారీ మూలధన వ్యయంతో ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా పనుల వివరాలు, ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, చెయాల్సిన చెల్లింపులను వివరించడం జరిగింది.

ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాల, ఫించను వ్యయాలను సవివరంగా పేర్కొనబడింది. వనరుల లభ్యత మరియు వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం కారణంగా రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ స్వల్ప కాలిక రుణాలపై ఏ విధంగా ఆధారపడుతుందో వివరించడం జరిగింది.

రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు విషయాలలో రాష్ట్ర పనితీరు, విద్య మరియు ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలపై వ్యయ వివరాలను వివరిస్తూ చివరగా డిసెంబర్ 2023 నాటికి తెలంగాణ ఆర్థిక స్థితి యొక్క వాస్తవ పరిస్థితులను ఈ శ్వేతపత్రంలో తెలుపడమైనది.

ప్రస్తుత ప్రభుత్వం వారసత్వంగా పొందిన రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, సులభంగా అర్ధమయ్యే భాషలో తెలియజేయడం ఈ శ్వేత పత్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వాస్తవాలను ప్రజలకు తెలయబరిచి బహిరంగ చర్చను ప్రోత్సహించడం ద్వారా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు బాధ్యతాయుతంగా మరియు వివేకంతో నిర్వహించబడడం ఈ శ్వేత పత్రం యొక్క లక్ష్యం.

TSPSC Group 1 Prelims 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం లో ముఖ్యమైన అంశాలు పార్ట్ - 1, TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు 2 ప్రత్యేకం_5.1