Telugu govt jobs   »   TSPSC Group 2   »   Important Points to Remember for TSPSC...
Top Performing

Important Points to Remember for TSPSC Group 2 Success | TSPSC గ్రూప్ 2 విజయం కోసం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు

TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 ఆగస్టు 7 మరియు 8 తేదీలలో నిర్వహించబడుతుంది, అయిదు లక్షల మందికి పైగా పోటీ పడే ఈ  పరీక్షలో విజయం సాదించాలి అంటే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుంది. తహశీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ACTO (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్), సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమీషనర్ Gr-III, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మొదలైన గెజిటెడ్ ఉద్యోగం  సాదించాలి అని ప్రతి ఒక్కరి కల. లక్షల మంది తమ కలల కొలువు దక్కించుకునేందుకు ఎంతో కాలంగా అకుంఠిత దీక్షతో గ్రూప్ 2కు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. తెలంగాణలో TSPSC గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ను మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇంకా రెండు నెలల సమాయమయే ఉంది. ఈ నేపథ్యంలో.. TSPSC గ్రూప్ 2 పరీక్షలో విజయం కోసం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు మేము ఇక్కడ పేర్కొన్నాము.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

సరైన వ్యూహంతో అడుగులు వేస్తే విజయం మీ సొంతం

తెలంగాణలో మొత్తం 783 పోస్ట్ లకు గాను, 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే.. ఒక్కో పోస్ట్ కు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ స్థాయి పోటీలో నెగ్గాలంటే.. అభ్యర్థులు చక్కటి ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. TSPSC గ్రూప్ 2 లో మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటాయి. TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 ఆగస్టు 7 మరియు 8 తేదీలలో జరుగుతుంది అంటే.. ఇప్పటి నుంచి సరిగ్గా 61 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఎంతో విలువైన ఈ సమయంని పక్కా ప్రణాళికతో ప్లాన్ చేస్తే విజయం సాదించవచ్చు.

TSPSC గ్రూప్ 2 విజయం కోసం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు

సిలబస్ పై పట్టు

TSPSC గ్రూప్ 2 అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో.. ఇప్పటివరకు చదివిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.  సిలబస్ కుసరిపోయే పరిమిత పుస్తకాలను మాత్రమే చదవాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలున్న 1 లేదా రెండు పుస్తకాలను ఎంచుకోవడం మేలు. అదే విధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవడం చాలా అవసరం, ఎందుకంటే అకాడమీ పుస్తకాల నుండి డైరెక్ట్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

విశ్లేషణాత్మక స్టడీ

TSPSC గ్రూప్ 2 లో విజయానికి విశ్లేషణాత్మక స్టడీ చాలా ముఖ్యం. TSPSC గ్రూప్ 2 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ లోని కొన్ని అంశాల ఇంకో పాపర్ లో కొన్ని అంశాలతో ముడిపడి ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు, కాబట్టి అందరూ అన్నీ ప్రశ్నలను ప్రయత్నింస్తారు, కాని అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగేలా అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే మంచిది. కాబట్టి ప్రస్తుత సమయంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ.. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి.

కామన్ టాపిక్స్

గ్రూప్ 2 పరీక్ష లో నాలుగు పేపర్లు ఉన్నాయి. మొదటి పేపర్ లో ని అంశాలు మిగిలిన మూడు పేపర్ లో కామన్ గా ఉంటాయి.  అభ్యర్థులు  కామన్ టాపిక్స్ ను ఒకే సమయంలో చదివేలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్ష సిలబస్ అనుగుణంగా ఆయా సబ్జెక్ట్ లోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ  చదువుకుంటే, మీకు సమయం కలిసి వస్తుంది.

సొంత నోట్స్

అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్ లోని ముఖ్యమైన అంశాలను సొంత నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి, మీరు రాసుకున్న సొంత నోట్సు రివిజన్ సమయంలో చాలా మేలు చేస్తుంది. ముఖ్యమైన అంశాలను పాయింట్లతో, గ్రాఫ్ ల మీరు అర్దం అయ్యేలా రాసుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. మీరు రాసుకున్న నోట్సు ను పదే పదే చదువుతూ ఉండాలి.

How To Prepare N1otes For TSPSC Group 2 2024 Exam?

పోటీ పరీక్షలో ప్రతి అంశం ముఖ్యమైందే

అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రిపరేషన న్ను పూర్తి చేసే క్రమంలో ఏమైనా టాపిక్స్ వదిలేస్తే వాటిపై మిగిలిన సమయం లో ఒక ప్రణాళికా వేసుకుని వాటిని పూర్తి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే టాపిక్స్ పై గట్టి పట్టు సాదించాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్తా పథకాలు వంటి అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.

కష్టమైన వాటి కోసం తప్పదు సమయం

అభ్యర్థులు వారి ప్రిపరేషన్ సమయంలో కష్టంగా భావించి కొన్ని టాపిక్స్ ను చదవకుండా పక్కనపెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైన అంశాలు కూడా ఉంటాయి. విజయానికి చేరువ చేసే ఈ అంశం ని వదిలిపెట్టకూడదు,కష్టంగా భావించి కొన్ని అంశాలకు ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇంగ్లిష్, రీజనింగ్ కు సంబంధించి ఎక్కవ ప్రాక్టీస్ చేయాలి.

రివిజన్

ఎన్ని నెలలు కృషి చేసినా.. ఎన్ని పుస్తకాలు చదివినా.. రివిజన్ ఏ మీ విజయాన్ని నిర్ధారిస్తుంది, అవును.  పరీక్షకు ముందు నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు రివిజన్ సక్సెస్ కీలకంగా మారుతుంది. మీ ప్రీపరేషన్ లో రివిజన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమయంలో రివిజన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఇప్పటి వరకు తాము చదివిన అంశాల అవలోకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయా అంశాలకు నిర్దిష్టంగా సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మీరు రాసుకున్న నోట్సు ను పదే పదే చదువుతూ ఉండాలి

ప్రాక్టీస్ టెస్ట్ లు, మునపటి సంవత్సరం ప్రశ్న పత్రాల సాదన ముఖ్యం

మీకు ఉన్న ఈ సమయంలో అభ్యర్థులు TSPSC గ్రూప్ 2 ప్రాక్టీస్ టెస్ట్ లు, మోడల్ టెస్ట్ లు మరియు మునపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను క్రమం తప్పకుండా ప్రయత్నింస్తూ ఉండాలి. దీనివల్ల ఆయా సబ్జెక్ట్ లో తమకు ఇప్పటి వరకు మీరు ఎంత చదివారు, మీకు ఎంత గుర్తుంది, మీ బలాలు మరియు బలహీనతలపై అవగాహన వస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

pdpCourseImg

TSPSC Group 2
TSPSC Group 2 Notification 2024 TSPSC Group 2 Apply Online
TSPSC Group 2 Syllabus TSPSC Group 2 Previous Year Cut Off
TSPSC Group 2 Vacancies 2024 TSPSC Group 2 Exam Pattern
TSPSC Group 2 Selection Process TSPSC Group 2 Eligibility Criteria
TSPSC Group 2 Salary Best Books for TSPSC Group 2
How To Prepare For TSPSC Group 2- Preparation Strategy, Tips
How To Prepare Notes For TSPSC Group 2 2024 Exam?
How To Prepare For TSPSC Group 2 And Group 3 Exams Simultaneously? TSPSC GROUP 2 Exam Date 2024

Sharing is caring!

Important Points to Remember for TSPSC Group 2 Success_5.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!