IDBI SO అధికారిక నోటిఫికేషన్ 2023 విడుదల
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in లో IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను 05 డిసెంబర్ 2023న PDF ఫార్మాట్‌లో విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి వివిధ పోస్ట్ లకు 86 ఖాళీలను విడుదల చేసింది. IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 09 డిసెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు అభ్యర్థులు 25 డిసెంబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. IDBI SO రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, నోటిఫికేషన్ గురించిన అర్హత ప్రమాణాలు, పరీక్షా విధానం, జీతం వంటి మొత్తం సమాచారాన్ని ఈ కధనంలో తెలుసుకోండి.
APPSC/TSPSC Sure shot Selection Group
IDBI SO 2023 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ PDF
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF 05 డిసెంబర్ 2023న విడుదలైంది మరియు బ్యాంకింగ్‌లోని వివిధ నిర్దిష్ట రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అభ్యర్థులు ఒక పోస్ట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఔత్సాహికులు IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 యొక్క వివరణాత్మక నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఇందులో ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం మొదలైనవి ఉన్నాయి.
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF
IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023: అవలోకనం
86 ఖాళీల కోసం IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత ప్రమాణాలను పూర్తి చేసే అభ్యర్థులు దిగువ చర్చించబడిన ఓవర్‌వ్యూ టేబుల్‌లోని ముఖ్యమైన వివరాలను చూడవచ్చు. ఈ IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023 ఓవర్‌వ్యూ టేబుల్ మీకు ఖచ్చితమైన వివరాలతో అవగాహన కల్పిస్తుంది.
IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023: అవలోకనం |
|
సంస్థ | ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) |
పరీక్ష పేరు | స్పెషలిస్ట్ ఆఫీసర్ |
ఖాళీలు | 86 |
కేటగిరి | బ్యాంక్ జాబ్ |
IDBI SO 2023 అధికారిక నోటిఫికేషన్ | 05 డిసెంబర్ 2023 |
పరీక్షా విధానం | ప్రాధమిక పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ |
అప్లికేషన్ | ఆన్లైన్ |
తేదీలు | డిసెంబర్ 09, 2023 |
అధికారిక వెబ్సైట్ | www.idbibank.in |
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్: ముఖ్యమైన తేదీలు
IDBI SO అధికారిక నోటిఫికేషన్ లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను తెలిపారు. అభ్యర్ధుల కోసం ఈ దిగువన పట్టికలో IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలను అందించాము.
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్: ముఖ్యమైన తేదీలు | |
వివరాలు | ముఖ్యమైన తేదీలు |
IDBI SO ధరఖాస్తు నోటిఫికేషన్ | 05 డిసెంబర్ 2023 |
IDBI SO ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం | 09 డిసెంబర్ 2023 |
IDBI SO ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 25 డిసెంబర్ 2023 |
IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ అప్లికేషన్ లింకు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అర్హులైన అభ్యర్థుల నుంచి మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ లో మాత్రమే అప్లికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. IDBI SO అప్లికేషన్ లింక్ 09 డిసెంబర్ 2023న యాక్టివేట్ చేయబడుతుంది మరియు ఇది 25 డిసెంబర్ 2023 వరకు ఆక్టివ్ గా ఉంటుంది. IDBI SO 2023కి దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ క్రింద అందించాము. అప్లికేషన్ లింకు ఇంకా ఆక్టివేట్ అవ్వలేదు.
IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ అప్లికేషన్ లింకు (In Active)
IDBI SO ఖాళీలు 2023
IDBI SO నోటిఫికేషన్ 2023 లో మొత్తం 86 ఖాళీలు ప్రకటించింది. కేటగిరీ మరియు విభాగం వారీగా IDBI SO ఖాళీలు 2023 తనిఖీ చేయండి.
IDBI SO ఖాళీలు 2023 |
||||||
పోస్ట్ | జనరల్ (UR) | SC | ST | OBC | EWS | Total Vacancy |
Deputy General Manager (DGM) – Grade D | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
Assistant General Manager (AGM) – Grade C | 16 | 4 | 5 | 10 | 4 | 39 |
Manager – Grade B | 19 | 8 | 3 | 12 | 4 | 46 |
మొత్తం | 36 | 12 | 8 | 22 | 8 | 86 |
IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించే ముందు పేర్కొన్న కట్-ఆఫ్ తేదీ నాటికి తగిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా భారత ప్రభుత్వం ఆమోదించిన సంస్థల నుండి పొందిన గ్రాడ్యుయేషన్ డిగ్రి కలిగి ఉండాలి. అర్హత ప్రమాణాల కోసం కటాఫ్ తేదీ అంటే వయస్సు, అర్హత మరియు పోస్ట్‌లకు అనుభవం కలిగి ఉండాల్సిన తేదీ నవంబర్ 01, 2023.
IDBI SO 2023 విద్యార్హత
పోస్టుకోడ్ ను బట్టి మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు విద్యార్హత మారుతుంది. IDBI SO రిక్రూట్మెంట్ 2023కు కనీస అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ పీడీఎఫ్ చూడొచ్చు.
IDBI SO 2023 వయో పరిమితి
IDBI SO పోస్టులకు కనిష్ట మరియు గరిష్ట వయో పరిమితి వరుసగా 25 మరియు 45. ఈ దిగువ పట్టిక తనిఖీ చేయండి.
IDBI SO 2023 వయో పరిమితి |
||
పోస్ట్ | కనిష్ట వయస్సు | గరిష్ట వయస్సు |
Deputy General Manager | 35 years | 45 years |
Assistant General Manager | 28 years | 40 years |
Manager | 25 years | 35 years |
IDBI SO 2023 దరఖాస్తు రుసుము
అభ్యర్థులు కేటగిరీ వారీగా IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము గురించి తెలుసుకోండి
IDBI SO 2023 దరఖాస్తు రుసుము | |
వర్గం | దరఖాస్తు రుసుము |
GEN/ OBC/EWS | 1000 |
SC/ST | 200 |
IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక విధానం
IDBI SO రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది. ప్రతి దశకు అర్హత సాధించిన అభ్యర్ధులు IDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్లుగా ఎంపిక చేయబడతారు.
- ప్రిలిమినరీ స్క్రీనింగ్
- గ్రూప్ డిస్కషన్
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్ జీతం
స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థానానికి ఎంపికైన అభ్యర్థులకు IDBI SO 2023 రిక్రూట్‌మెంట్ జీతం క్రింది పట్టికలో ఇవ్వబడింది. ప్రాథమిక వేతనం కాకుండా, వారి సంబంధిత గ్రేడ్ ప్రకారం అలవెన్సులు మరియు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
IDBI SO 2023 రిక్రూట్‌మెంట్ జీతం | ||
పోస్ట్ | పే స్కేలు | జీతం |
Deputy General Manager (Grade D) | ₹76010-2220(4)-84890-2500(2)-89890 (7 years). | Rs.1,55,000/- per month (approx.) |
Assistant General Manager (Grade C) | ₹63840-1990(5)-73790-2220(2)-78230 (8 years) | Rs.1,55,000/- per month (approx.) |
Manager (Grade B) | ₹48170-1740(1)-49910-1990(10)-69810 (12 years) | Rs.98,000/- per month (approx.) |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |