IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష తేదీ 2023
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా తేదీని అధికారిక వెబ్సైట్ @idbibank.inలో విడుదల చేసింది. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ లో 600 ఖాళీలను విడుదల చేసింది. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్షా తేదీ కోసం ఎదురుచూస్తుంటారు. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా 20 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించనున్నారు. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా షెడ్యూల్ ఈ కధనంలో తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష తేదీ అవలోకనం
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా 20 అక్టోబర్ 2023 తేదీన ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష తేదీ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష తేదీ అవలోకనం | |
సంస్థ | ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పోస్ట్ | జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ |
వర్గం | పరీక్షా తేదీ |
ఖాళీ | 600 |
IDBI పరీక్షా తేదీ | 20 అక్టోబర్ 2023 |
ఎంపిక పక్రియ | ఆన్ లైన్ వ్రాత పరీక్షా & ఇంటర్వ్యూ |
పరీక్షా విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | idbibank.in |
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా షెడ్యూల్
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష 2023 యొక్క తాత్కాలిక తేదీ 20 అక్టోబర్ 2023న నిర్వహించబడుతుంది. ఈ అధికారిక తేదీ నోటిఫికేషన్ PDFతో విడుదల చేయబడింది. అంతేకాకుండా, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023తో విడుదల చేయబడతాయి. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా షెడ్యూల్ దిగువ పట్టికలో తనిఖీ చేయండి.
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా షెడ్యూల్ | |
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ | త్వరలో |
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా తేదీ | 20 అక్టోబర్ 2023 |
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 2023 ఎంపిక ప్రక్రియ
IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2023 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా అనుసరించాల్సిన నిర్దిష్ట ఎంపిక ప్రక్రియను కలిగి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ ఇవ్వగలరు. ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 2023 పరీక్షా సరళి
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి మరియు అభ్యర్థులు పరీక్షను ముగించడానికి 2 గంటల సమయం ఉంటుంది. మేము ఈ క్రింది పరీక్ష యొక్క పరీక్షా సరళిని దిగువ పట్టిక ద్వారా అందించాము.
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | వ్యవధి |
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ | 60 | 60 | 120 నిమిషాలు |
ఆంగ్ల భాష | 40 | 40 | |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 | |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ | 60 | 60 | |
మొత్తం | 200 | 200 |
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సిలబస్ 2023
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ AP & TS పరీక్షా కేంద్రాలు
అభ్యర్థులు IDBI ద్వారా జాబితా చేయబడిన కేంద్రాలలో ఒకదానిని ఎంచుకోవడానికి ప్రాప్యతను కలిగి ఉంటారు. దరఖాస్తును నింపేటప్పుడు అభ్యర్థి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థులు తమ సౌలభ్యం మేరకు కేంద్రాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరీక్షా కేంద్రాలు వివరాలు దిగువన అందించాము.
ఆంధ్రప్రదేశ్ పరీక్షా కేంద్రాలు
- చీరాల
- చిత్తూరు
- ఏలూరు
- గుంటూరు
- కడప
- కాకినాడ
- కర్నూలు
- నెల్లూరు
- ఒంగోలు
- రాజమండ్రి
- శ్రీకాకుళం
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
- విజయనగరం
తెలంగాణ పరీక్షా కేంద్రాలు
- హైదరాబాద్
- కరీంనగర్
- ఖమ్మం
- వరంగల్
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023 పరీక్షకు వారం ముందు అధికారిక వెబ్సైట్ @idbibank.inలో విడుదల చేస్తారు. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా 20 అక్టోబర్ 2023 తేదీన ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023 లో పరీక్షా సమయం, పరీక్షా కేంద్రం వివరాలు, అభ్యర్ధి పేరు తదితర వివరాలు ఉంటాయి. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023 ని డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ 2023 లింక్ (ఇన్ ఆక్టివ్)
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2023
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |