IBPS RRB PO పరీక్షా విధానం :ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్(IBPS) దాని అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో PO పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే IBPS RRB PO పరీక్ష కోసం సిద్ధపడే అభ్యర్థులు మొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని, పరీక్షా విధానాన్ని మరియు సిలబస్ తెలుసుకోవడం. కావున మేము ఈ కథనం ద్వారా IBPS RRB క్లర్క్ పరీక్ష విధానం ని అందజేస్తున్నాము. IBPS క్యాలెండర్ ప్రకారం, IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష 7 ,13 ఆగస్టు 2022న షెడ్యూల్ చేయబడిన విషయం తెలిసిందే . IBPS RRB PO గురించి మరిన్ని తాజా ప్రకటనల కోసం adda 247 తెలుగును సందర్శించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
IBPS RRB PO అవలోకనం
దిగువ ఇవ్వబడిన పట్టికలో IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తనిఖీ చేయండి.
సంస్థ పేరు | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) |
పోస్ట్ పేరు | ఆఫీసర్ స్కేల్ I (PO) |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | జూన్ 2022 |
అప్లికేషన్ ముగింపు తేదీ | – |
పరీక్ష స్థాయి | జాతీయ |
పరీక్ష అర్హత | గ్రాడ్యుయేట్ |
IBPS RRB పరీక్ష దశలు | ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ |
IBPS RRB పరీక్ష వ్యవధి |
|
IBPS RRB PO ప్రిలిమినరీ పరీక్ష తేదీ | 7,13 ఆగస్టు 2022 |
IBPS RRB PO మెయిన్స్ పరీక్ష తేదీ | 24 సెప్టెంబర్ 2022 |
IBPS RRB తుది ఫలితాలు 2022 | జనవరి 2023 |
IBPS RRB PO ఎంపిక విధానము
IBPS RRB PO కోసం, పరీక్షలో మూడు దశలు ఉంటాయి: అవి
- ప్రిలిమ్స్
- మెయిన్స్
- ఇంటర్వ్యూ
అభ్యర్థులు IBPS RRB PO పోస్టుకు విజయవంతమైన ఎంపిక కోసం పరీక్ష యొక్క ప్రతి దశను క్లియర్ చేయాలి.
Also check: IBPS RRB Clerk exam pattern and syllabus
IBPS RRB PO పరీక్షా విధానం
IBPS RRB PO పోస్టుకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది, అయితే మూడు దశల పరీక్షకు పరీక్ష సరళి భిన్నంగా ఉంటుంది. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు మరియు మెయిన్స్ పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది.
IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్షా సరళి
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 40 | మిశ్రమ సమయం 45 నిమిషాలు |
2 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 | |
మొత్తం | 80 | 80 |
గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.
IBPS RRB PO మెయిన్స్ పరీక్షా సరళి
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 50 | మిశ్రమ సమయం 2 గంటలు |
2 | జనరల్ అవేర్‌నెస్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్ | 40 | 40 | |
3 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 50 | |
4 | ఇంగ్లీష్/హిందీ | 40 | 40 | |
5 | కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 20 | |
మొత్తం | 200 | 200 |
గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.
Also Check: TS Police Constable exam pattern
IBPS RRB PO ఇంటర్వ్యూ
- IBPS RRB PO పరీక్ష కోసం మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అర్హులు.
- IBPS RRB ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు 40% (రిజర్వ్ అభ్యర్థులకు 35%).
- మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ యొక్క 80:20 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులను తాత్కాలిక కేటాయింపు ప్రక్రియకు ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ తర్వాత, మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో పొందిన మార్కుల మొత్తంతో కలిపి మొత్తం స్కోర్ రూపొందించబడుతుంది.
IBPS RRB PO పరీక్షా విధానం – తరచుగా అడిగే ప్రశ్నలు
Q1.IBPS RRB PO పరీక్ష 2022 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ. ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ ,మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ మూడు దశల్లో ఉంటుంది.
Q2. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?
జ. 45 నిమిషాలు.
Q3. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?
జ. 2 గంటలు.
Q4. IBPS RRB PO పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?
జ. అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
Also read: IBPS RRB Clerk Notification 2022
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
