Telugu govt jobs   »   Article   »   పరీక్షలు వాయిదా పడినప్పుడు ఏకాగ్రత మరియు ప్రేరణ...

పరీక్షలు వాయిదా పడినప్పుడు ఏకాగ్రత మరియు ప్రేరణ పొందడం ఎలా

పరీక్షలు వాయిదా పడినప్పుడు ఏకాగ్రత మరియు ప్రేరణ పొందడం ఎలా
తాజాగా TSPSC పరీక్షలను వాయిదా వేసింది ఇది గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కష్టకాలం  అని చెప్పవచ్చు ఎందుకంటే పరీక్ష కి సన్నద్దమవ్వడం అనేది ఏకాగ్రత, సమాయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక వంటి ఎన్నో అంశాలను ఏకతాటిపైకి తేవడంలో వారు చేసిన కృషికి తగిన ఫలితం దక్కకపోవడం. అభ్యర్ధి చేతులలో లేని కొన్ని సంఘటనలు వీటిని ఎంతో ప్రభావితం చేస్తాయి. అటువంటి సందర్భంలో చదవడానికి కొంత సమయం దొరికినా మళ్ళీ ప్రిపరేషన్ ప్రణాళిక ను సిద్దం చేసుకుని ఏకాగ్రత పరీక్ష పై తీవ్రతని పెంపొందించుకోవడానికి చాలా సమయం పడుతుంది మరియు ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.
రివిజన్ సమయాన్ని దయనీయంగా మార్చడానికి ముఖ్యంగా రెండు ప్రధాన సూత్రదారులు ఉన్నాయి అవి: పరీక్షలను సమీపించే ఒత్తిడి, మరియు గడిచిపోతున్న కాలం. రెండవది విసుగు; వచ్చే వారం, లేదా నెల, కొన్ని రోజులు పూర్తిగా చదువుపై మనసుని లగ్నం చేసి అధిక సిలబస్ మరియు పరీక్ష సరిగ్గా రాయలేము అన్న భావన లేదా కొన్ని అనివార్య సంఘటనల వలన పరీక్షలు వాయిదా పడటం. వీటివలన అభ్యర్ధులు తీవ్రమైన ఒత్తిడి మరియు మనస్తాపంకి గురవుతారు.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

వాస్తవానికి, APPSC, TSPSC గ్రూప్స్ పరీక్షల రివిజన్ చాలా ప్రాణాళికతో మరియు ఒత్తిడితో కూడుకున్న విషయం. కొన్ని సార్లు ఆనందంగా సిలబస్ అంతా పూర్తి చేసే రోజులు ఉంటాయి మరికొన్ని సార్లు భిన్నంగా ఏమి చదవని రోజులూ ఉంటాయి. మీరు ప్రతిరోజూ చదువుతూ ఉంటే, సిలబస్ లో ఉన్న అంశాలు వివిధ భాగాలను ఒకచోట చేర్చి, చివరకు అర్ధంకాని విషయాలను అర్థం చేసుకోవడంకోసం కొంత సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. కానీ అందరికీ పరీక్ష వాయిదా పడటంతో గడ్డు రోజులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో పురోగతి నెమ్మదిగా ఉంటుంది లేదా పరీక్ష పై దృష్టి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇటువంటి సమయంలో కొత్త స్టడీ చిట్కాలు కొంతవరకు మీ ప్రిపరేషన్ను వెనుకబడకుండా చేస్తుంది:

చిట్కాలు మీ ప్రణాళికని పూర్తిగా మెరుగుపరచవు కానీ మీ ప్రణాళిక దెబ్బతినకుండా మీరు ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో వెనుకబడకుండా చేస్తుంది. పోటీ పరీక్షలు యుద్దంతో సమానం ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనమే ఓటమి పాలవుతాము కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం తప్పక వరిస్తుంది. కొత్త విషయాలను ప్రయత్నించడం కాస్త ఇబ్బందిపెట్టిన, ముఖ్యంగా ఇటువంటి క్లిష్ట సమయంలో కొత్తదనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

APPSC group 2 Prelims Free Live Batch | Online Live Classes by Adda 247

మీ అధ్యయన షెడ్యూల్ ను మార్చుకోండి

పరీక్ష వాయిదాల సమయంలో ప్రధాన సవాళ్లలో ఒకటి మీ అధ్యయన ప్రణాళికను మార్చుకోవడం. మీ ఏకాగ్రతను కాపాడుకోవడానికి, కొత్త పరీక్ష తేదీకి అనుగుణంగా మీ షెడ్యూల్ను సవరించండి. మీ సిలబస్ ను నిర్వహించదగిన భాగాలుగా విభజించండి మరియు మీ అధ్యయన దినచర్యకు శ్రద్ధగా కట్టుబడి ఉండండి.

ఓటమి-విజయం

ఓటమి విజయం ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి, మనం చూసే దృష్టితో మన పయనం ఎటువెళ్తోందో తెలుస్తుంది. ప్రతి చర్యకి దాని ప్రయోజనాలు మరియు నష్టాలు ఉంటాయి. విజయం ఎప్పుడు వినూత్నంగా పరీక్షని ఎదుర్కునేవారికే లభిస్తుంది. సమయం ఇంకా ఉంది అని సేదతీరకుండా మీరు దానిని ఎలా తీసుకుంటారు అనేది ముఖ్యం. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇలా ఎందరో నీరుత్సాహపరిచే మాటలు మాట్లాడొచ్చు అది మీలో విజయవకాశాలను తగ్గించకుండా నిరాశకి లోనవ్వకుండా దృఢంగా నిలబడే మనస్తత్వాన్ని ఏర్పరచుకోండి.

ఆత్మవిశ్వాసం

పరీక్ష వాయిదా పడ్డ సంఘటన మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి మరియు మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలా అడ్డంకులు మరియు సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆందోళనచెందకుండా, మీకు కావలసినంత సమయం ప్రిపరేషన్ కి కేటాయించాలి అనే మనస్తత్వం అలవరచుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు ఆత్మవిశ్వాసంతో ఉండండి ఇదే మీ విజయరహస్యం అని భావించండి.

మానసిక ఒత్తిడి

పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీ ప్రయత్నంతో పాటు పరీక్షా ప్రణాళిక, సిలబస్, పోటీ ఇలా చాలా అంశాలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి చాలా కృషి మరియు అంకితభావం అవసరం. విద్యార్థులపై ఒత్తిడి పరీక్ష రోజు దగ్గరపడే కొద్ది ఉంటుంది మరియు పరీక్ష వాయిదా పడ్డా ఉంటుంది. ఒకేసారి వీటిని ఎదుర్కోవడం అందరికీ కష్టమే కానీ దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. అక్కడితో ఒత్తిడిని జయించి మిమ్మల్ని మీరు పోటీలో నిలదొక్కుకునేల చేసుకోగలుగుతారు. మీ అధ్యయనంపై వ్యక్తులు మరియు వారి అభిప్రాయాలపై కాకుండా కేవలం మీ ప్రిపరేషన్ పై దృష్టి పెట్టి పరీక్ష ని ఛేదించండి.

అవకాశావాదిలా ఉండండి

విరామం తీసుకుంటే అనేక అవకాశాలను కోల్పోతామని విధ్యార్ధిగా ఆలోచించకండి. పరీక్ష వాయిదాని  ఎప్పుడూ విరామంగా తీసుకోవద్దు. పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు, అన్వేషిస్తున్నారు కాబట్టి, ఏదైనా చేయడానికి భయపడవద్దు. కనీసం వాయిదా పడ్డ సమయం సరిగ్గా ప్రణాళికా చేస్తే మీరు పరీక్షని సులువుగా సమాధానం చేయవచ్చు అని నమ్మండి. అవకాశావాది ఎప్పుడు అవకాశం కోసం చూసినట్టు మీరుకూడా పరీక్ష వాయిదా సమయాన్ని అవకాశంగా మలచుకొండి.

పురోగతిని గుర్తు చేసుకోండి

పరిపూర్ణత కోసం వెంబడించడం కంటే మీ పురోగతిపై దృష్టి పెట్టండి. మీరు మీ అభ్యాస ప్రయాణాన్ని ఎక్కడ నుండి ప్రారంభించారో గుర్తు చేసుకోండి, ఆపై మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అంచనా వేయండి. ఇలా చేయడం వలన మీరు చేరాల్సిన గమ్యాన్ని గుర్తించడంలో సఫలమవుతారు. మీ అంకితభావాన్ని గుర్తించడానికి మీకు అవకాశం దొరుకుతుంది, తద్వారా మీరు పరీక్షా పోటినుంచి తప్పుకోలేదు అని గుర్తుంటుంది.

మీ సమయాన్ని కొలుచుకోండి

మీరు చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నదంతా మర్చిపోవడం సులభం. సహజంగానే, మీరు మీ పనులను తగినంతగా నిర్వహించడం లేదని మీరు భావిస్తారు. రోజువారీ టాస్క్ లాగ్‌లో మీ సమయాన్ని ట్రాక్ చేయడం వలన మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో అంచనా వేయడంలో మీకు సహాయం చేయడమే కాకుండా, మీరు పూర్తి చేసిన అన్ని టాస్క్‌ల గణన లభిస్తుంది.

APPSC Group 1 Prelims Live Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

పరీక్షలు వాయిదా పడినప్పుడు ఏకాగ్రత మరియు ప్రేరణ పొందడం ఎలా_6.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. Having appeared for exams like APPSC Group2 Mains, IBPS, SBI Clerk Mains, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.