Telugu govt jobs   »   SSC CPO 2024 నోటిఫికేషన్   »   SSC CPO preparation Tips

How to Prepare for SI posts in Central Police Forces | కేంద్ర పోలీసు బలగాల్లో SI పోస్టులకు సన్నధం అవ్వడం ఎలా?

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నిరుద్యోగులు మరియు యువత ఎక్కువమంది ఆసక్తి చూపే కొలువుల్లో పోలీస్ పోస్టులే ఎక్కువ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ కావాలి అని కోరుకునే అభ్యర్థులకు సువర్ణావకాశం, కేంద్రంలో SI ఉద్యోగం సాధించే అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాలైన BSF, CRPD, SSB, CISF లతోపాటు దిల్లీ పోలీస్‌ విభాగంలో SI పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది. SSC BSF, CISF, ఢిల్లీ పోలీస్, CRPF, ITBP మరియు SSB వంటి వివిధ దళాలలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం 4187 ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 09, 10 మరియు 13 మే 2024 తేదీలలో జరిగే SSC CPO పరీక్షకు 20 – 25 సంవత్సరాలు మరియు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు పోటీ పడొచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్ 1), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్ 2), వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.  SSC CPO లో ఉద్యోగం సాదించిన మొదటి నెల నుంచే రూ.60 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

SSC నోటిఫికేషన్

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF)లతోపాటు ఢిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) దాదాపు ఏటా నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBPF), సశస్త్ర సీమాబల్‌ (SSB), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF)ల్లో ఎందులోనైనా, దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించవచ్చు. అయితే ఢిల్లీ పోలీస్‌ విభాగంలో SI గా ఎంపిక అభ్యర్థులు ఢిల్లీ పరిధిలోనే కొనసాగవచ్చు.

 

SSC CPO 2023 నోటిఫికేషన్ విడుదల, డౌన్‌లోడ్ 1876 ఖాళీల నోటిఫికేషన్ 2023 PDF_30.1

Adda247 APP

పోలీస్‌ కొలువల జీతాలు మరియు ఉద్యోగ హోదా

SSC విడుదల చేసిన పోలీస్‌ పోస్టుల కోసం ఏ విభాగంలో ఉద్యోగం సాదించిన వచ్చినప్పటికీ వేతనం, ప్రోత్సాహకాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వీరికి లెవెల్‌-6 జీతం అందుతుంది. అంటే వేతనం రూ.35,400 మరియు ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అన్నీ కలిపి నెలకు రూ.60 వేలకు పైగా జీతం పొందవచ్చు. 10-15 ఏళ్ల సర్వీస్‌తో ఇన్‌స్పెక్టర్‌ హోదాకు, అనంతరం అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్‌ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, సీనియర్‌ కమాండెంట్‌ స్థాయికి చేరుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ లో భాగంగా, ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాదించిన అభ్యర్ధులకు దేహదార్ఢ్య పరీక్షలు ఉంటాయి. వీటిలో ఉత్తీర్ణులైనవారికి పేపర్‌-2 పరీక్ష ఉంటుంది.పేపర్‌-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్ధులకు వారు ఎంచుకున్న ప్రాధాన్యం ప్రకారం సంబంధిత విభాగాల్లో శిక్షణకు తీసుకుంటారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు విధుల్లో కొనసాగుతారు.

SSC CPO పరీక్ష విధానం

  • SSC CPO పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, పరీక్ష వ్యవధి 2 గంటలు
  • CPO పరీక్ష యొక్క పేపర్ 1 4 విభాగాలను కలిగి ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి, సెక్షన్ల వారీ కటాఫ్‌ ఉంది.
  • పేపర్‌ 2 లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు ఉంటాయి.
  • రెండు పేపర్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్‌లోనూ  మార్కులు పొందాలి.
  • కేటగిరీ వారీగా కనీస అర్హత మార్కులు ఉంటాయి. జనరల్‌ అభ్యర్థులు 30 శాతం, OBC, EWS 25 శాతం, SC, STలు 20 శాతం మార్కులు రావాలి.
  • NCC C సర్టిఫికెట్‌ ఉంటే 10, B ఉన్నవారు 6 అదనంగా పొందవచ్చు.

SSC CPO కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ?

  • మొదటి సారి SSC CPO రాస్తున్నవారు ప్రాథమికాంశాల నుంచి తమ ప్రీపరేషన్ మొదలు పెట్టాలి. ప్రతి విభాగం నుంచీ రోజూ ఒక్కో అంశాన్ని చదివి, అందులో వీలైనన్ని  ప్రశ్నలు సాధన చేయాలి.
  • ముందుగా సిలబస్‌ పై పూర్తి అవగాహన పొందాలి, ఎందుకంటే ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తాయి.
  • గత సంవత్సరం ప్రశ్న పత్రాలను పరిష్కరించడం అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా ఏ అంశం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేది తెలుసుకుని ఆ అంశాలపై శ్రద్ధ వహించాలి.
  • సంవత్సరం ప్రశ్న పత్రాలను పరిష్కరించడం వలన  ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, మీ ప్రీపరేషన్ ఎలా ఉండాలి, ఏ అంశాపై ఎక్కువ దృష్టి పెట్టాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలో అర్దం అవుతుంది.
  •  సెక్షన్లవారీ కటాఫ్‌లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు పొందడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రిపేర్ అయ్యేప్పుడే కష్టమైన విభాగాలకు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలి.
  • SSC CPO లో ఎంపిక ప్రక్రియలో మొదట పేపర్‌-1 ఉంటుంది కాబట్టి, మొదట ప్రాధాన్యత పేపర్‌-1 కు ఇవ్వాలి.
  • పేపర్‌-2 మొత్తం ఆంగ్ల విభాగం నుంచే ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు ఆధారంగా మెరిట్ జాబితా నిర్ణయిస్తాయి. అందువల్ల పేపర్‌-2 కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పట్టు పెంచుకోవాలి.
  • నెగెటివ్ మార్కింగ్ ఉన్నందున తెలియని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడమే మంచిది.
  •  పరీక్షకు ముందు 6- 7 నెలల వరకు ఉన్న కరెంట్ అఫ్ఫైర్స్ ను అంశాల వారీగా నోట్స్ రాసుకోవాలి, వాటిని ప్రతీ రోజు రివైజ్ చేసుకోవాలి.
  • ఎక్కవ పుస్తకాలను చదవుతూ గందరగోళంకి గురి కాకుండా, ప్రతి విభాగానికీ ఒకటి చొప్పున ఏదైనా మంచి పుస్తకాన్ని తీసుకుని, దాన్నే బాగా సాధన చేయాలి.

SSC CPO పరీక్ష తేదీ 2024 విడుదల, పేపర్ 1 షెడ్యూల్‌ను తనిఖీ చేయండి_40.1

Sharing is caring!