Telugu govt jobs   »   Article   »   How to Prepare for RRB ALP...

How to Prepare for RRB ALP 2024 | RRB ALP 2024 కోసం ఎలా సన్నద్ధమవ్వాలి

RRB ALP పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులు ఇప్పటికే వారి ప్రిపరేషన్ ప్రణాళికని సిద్దం చేసుకుని ఉంటారు, పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని నిపుణుల ప్రిపరేషన్ చిట్కాలను తెలుసుకోవడం మంచిది. RRB ALP ప్రిపరేషన్ చిట్కాలను తెలుసుకుని ప్రణాళిక చేసుకుంటే పరీక్షలో విజయం సాధించడం సులభమవుతుంది. మొదటి ప్రయత్నంలోనే RRB ALP పరీక్షలో ఉత్తీర్ణత సాధించి భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలి అనే కలను సొంతం చేసుకోండి. మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువు కాదు. కానీ కొన్ని ఉత్తమ RRB ALP ప్రిపరేషన్ చిట్కాలను తెలుసుకుని మీ ప్రిపరేషన్ని మెరుగుపరచుకోండి.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

RRB ALP పరీక్షా శైలి

RRB ALP పరీక్షను 3 దశల్లో నిర్వహిస్తారు. CBT-1, CBT-2 దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే CBT-3 సైకో ఆప్టిట్యూడ్ టెస్ట్ ని నిర్వహిస్తారు.
RRB ALP దశల వారీగా ప్రిపరేషన్ చిట్కాలు, పరీక్ష విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి ఈ కధనాన్ని చదవండి.

RRB ALP CBT I కోసం తయారీ చిట్కాలు:

RRB ALP CBT 1 పరీక్షా శైలి 

సబ్జెక్ట్స్/సెక్షన్ లు  ప్రశ్నల సంఖ్య  సమయ వ్యవధి
గణితం 20 60 నిమిషాలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25
జనరల్ సైన్స్ 20
కరెంట్ అఫైర్స్‌ &  జనరల్ అవేర్‌నెస్ 10
మొత్తం  75

RRB ALP CBT I (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – స్టేజ్ 1)లో విజయం సాధించడానికి, బాగా నిర్మాణాత్మకమైన ప్రిపరేషన్ వ్యూహాన్ని రచించుకోవాలి. ప్రిపరేషన్ లో మొదటి భాగం RRB ALP సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఈ దశలో గణితం, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ మరియు కరెంట్ అఫైర్స్ సిలబస్ ద్వారా ఏ అంశాల పై పట్టు సాధించాలి ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి అనే అవగాహన వస్తుంది. మీ RRB ALP CBT I తయారీ కోసం ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి:

రిఫరెన్స్ పుస్తకాలు:
ప్రతి సబ్జెక్ట్ కోసం సంబంధిత RRB ALP స్టడీ మెటీరీయల్ ని ఎంచుకోవడం వలన మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించండి. సిలబస్ లోని అంశాల పై బలమైన పునాదిని ఏర్పడటం మరియు ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి దీని వలన మీ CBT-2 కూడా సులువు అవుతుంది .

గత సంవత్సరం ప్రశ్నపత్రాలు:
గత సంవత్సర ప్రశ్నలను సమాధానం చేయడం వలన పరీక్షలో అడిగే ప్రశ్నల శైలి మరియు క్లిష్టత స్థాయిపై అవగాహన వస్తుంది. మునుపటి ప్రశ్న పత్రాలు లేదా మాక్ టెస్ట్ లు పరిష్కరించడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ పత్రాలను మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రామాణికమైన చోటనుండి తీసుకోండి.

స్టడీ నోట్స్ తయారుచేసుకోండి:
రివిజన్‌లో సహాయం చేయడానికి టాపిక్ వారీగా RRB ALP షార్ట్ నోట్స్‌ను రూపొందించుకోండి. ఈ సంక్షిప్త గమనికలు చివరి నిమిషంలో సమీక్షలకు విలువైనవిగా ఉంటాయి, కాబట్టి అవి స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండేలా చూసుకోండి.

మాక్ టెస్టులు:
మీ సిలబస్ లేదా నిర్దిష్ట అధ్యాయాలను పూర్తి చేసిన తర్వాత, RRB ALP మాక్ టెస్ట్‌లను ప్రయత్నించండి. మీ ప్రిపరేషన్ పురోగతిని అంచనా వేయడానికి మరియు RRB ALP ఆన్సర్ కీని ఉపయోగించి మీ సమాధానాలను సరిపోల్చడానికి మాక్ పరీక్షలు ఒక ప్రభావవంతమైన మార్గం.

RRB ALP CBT II కోసం తయారీ చిట్కాలు:

RRB ALP CBT 2 పరీక్షా శైలి 

RRB ALP CBT 2 పరీక్షా సరళి 2024

సబ్జెక్ట్స్/సెక్షన్ లు  ప్రశ్నల సంఖ్య  సమయ వ్యవధి
                                                                                    పార్ట్ A
కరెంట్ అఫైర్స్‌ &  జనరల్ అవేర్‌నెస్ 10 90 నిమిషాలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25
గణితం 25
ప్రాథమిక సైన్స్ మరియు ఇంజనీరింగ్ 40
మొత్తం  100
పార్ట్ B
ట్రేడ్ టెస్ట్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 60 నిమిషాలు
మొత్తం  175 ప్రశ్నలు 

RRB ALP CBT II (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – స్టేజ్ 2)లో కటాఫ్‌ల కంటే ఎక్కువ స్కోర్ చేయాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థుల కోసం, అనుసరించాల్సిన టాపిక్ వారీ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

గణితం:
గణితం కోసం NCERT పాఠ్యపుస్తకాలు లేదా డైలీ విభాగాల వారీగా టెస్ట్ లు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అవి సబ్జెక్ట్ యొక్క సిలబస్‌ను సమగ్రంగా కవర్ చేస్తాయి. సంఖ్యా వ్యవస్థలు, సమయం మరియు పని, శాతాలు, సమయం మరియు దూరం మరియు సమ్మేళనం వంటి అంశాలకు సంబంధించిన నమూనా ప్రశ్నలను రోజు ప్రాక్టీస్ చేయండి. CBT-1 లో మీ ప్రణాళిక బలంగా ఉంటే CBT 2 లో సులువవుతుంది మరియు మిగిలిన విభాగాల పై ఎక్కువ సమయం కేటాయించవచ్చు.

జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్:

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సిలబస్ మరియు ప్రాథమిక అంశాలపై అప్‌డేట్‌గా ఉండాలి. వేగం మరియు ఖచ్చితత్వంపై దృష్టి కేంద్రీకరించేటప్పుడు సిలోజిజం, డేటా ఇంటర్‌ప్రెటేషన్, నిర్ణయం తీసుకోవడం, విశ్లేషణాత్మక తార్కికం మరియు మరిన్నింటిలో మీ అభ్యాసాన్ని పెంచుకోండి.

జనరల్ సైన్స్:

RRB ALP జనరల్ సైన్స్ సిలబస్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు వృక్ష శాస్త్రం వంటి ప్రామాణిక అంశాలు కవర్ చేయాలి, NCERT పాఠ్యపుస్తకాలను చదవడం లేదా ప్రామాణికమైన స్టడీ మెటీరీయల్ లో  సాధన చేయాలి. సమగ్ర తయారీ కోసం 9 మరియు 8 తరగతుల పుస్తకాలను కూడా చదవండి.

జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్:
ఈ విభాగం ఇతరులతో పోలిస్తే తక్కువ మార్కులు కలిగి ఉన్నందున ఇటీవలి కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టండి. స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాల పై రోజువారీ వార్తల కోసం వార్తాపత్రికలను చదవడం లేదా రోజువారీ కరెంట్ అఫ్ఫైర్స్ ని చదవండి.

CBAT కోసం RRB ALP పరీక్షా సరళి 2024

ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు పరీక్షలో ప్రతి భాగంలో కనీసం 42 మార్కులు పొందాలి. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కోసం టాప్ అభ్యర్థుల జాబితా ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారి నుండి తయారు చేయబడుతుంది. ఈ జాబితా రెండవ దశ CBT యొక్క పార్ట్ A నుండి 70% మార్కులను మరియు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 30% మార్కులను పరిగణనలోకి తీసుకుంటుంది.

RRB ALP CBT 3 పరీక్షా శైలి 

విభాగాలు వివరాలు
కనీస అర్హత మార్కులు ప్రతి టెస్ట్ బ్యాటరీలో 42 మార్కులు
భాష ఇంగ్లీష్ మరియు హిందీ
ప్రతికూల మార్కింగ్ నెగెటివ్ మార్కింగ్ లేదు
మెరిట్ జాబితా
  • CBT 2లో పార్ట్ A మార్కులకు 70% వెయిటేజీ
  • CBAT మార్కులకు 30% వెయిటేజీ

RRB ALP CBT III కోసం తయారీ చిట్కాలు:

RRB ALP CBT III సైకోమెట్రీ టెస్ట్ కోసం సిద్ధం కావడానికి, ఈ పరీక్షపై విడిగా దృష్టి పెట్టండి:

మెమరీ టెస్ట్:
వేగం కంటే ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రశ్నలు మెమరీ ఆధారితమైనవి కాబట్టి కనీసం 60% ప్రశ్నలను 100% ఖచ్చితత్వంతో ప్రయత్నించండి.

సామర్థ్యం:
మెమరీ టెస్ట్ లాగానే, ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. 100% ఖచ్చితత్వంతో కనీసం 7 ప్రశ్నలను ప్రయత్నించండి మరియు మీకు కష్టమైన ప్రశ్న అనిపిస్తే వదిలేసి మరొక ప్రశ్న ను సమాధానం చేయండి.

డెప్త్ పర్సెప్షన్ టెస్ట్:
ఈ పరీక్ష కోసం, ఖచ్చితత్వం మరియు వేగాన్ని సమతుల్యం చేయడం అలవరచుకోండి. నిర్ణీత సమయంలో కనీసం 40 ప్రశ్నలను ఖచ్చితత్వంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం వెచ్చించకండి.

ఏకాగ్రత పరీక్ష:
ఈ పరీక్షకు వేగం మరియు ఖచ్చితత్వం అవసరం. సమయ పరిమితిలో కనీసం 60/85 ప్రశ్నలను ఖచ్చితంగా ప్రయత్నించండి.

గ్రహణ స్పీడ్ టెస్ట్:
ఈ పరీక్ష కోసం వేగంపై మాత్రమే దృష్టి పెట్టండి. సమయ వ్యవధిలో 72/96 ప్రశ్నలను ప్రయత్నించండి.

Mission RPF 2024 | Railways RPF, Group D & ALP Complete Foundation Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!