Telugu govt jobs   »   Exam Strategy   »   బ్యాంకు పరీక్షలలో ఆందోళనను అధిగమించి ఎలా విజయం...

బ్యాంకు పరీక్షలలో ఆందోళనను అధిగమించి ఎలా విజయం సాధించాలి

బ్యాంకు పరీక్షలలో ఆందోళనను అధిగమించి ఎలా విజయం సాధించాలి

బ్యాంకు పరీక్షలలో ఆందోళనను అధిగమించి ఎలా విజయం సాధించాలి

బ్యాంక్ పరీక్షల ప్రయాణాన్ని ప్రారంభించడం తరచుగా అంతర్లీన ఆందోళనతో పాటు ఉంటుంది, ఇది మీ విజయానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ కొన్ని సార్లు ఇది హానికరం. ఒక నిర్దిష్ట స్థాయి ఆందోళన మిమ్మల్ని మెరుగ్గా చేసేలా చేయగలదు, ఆందోళన పెరిగి అధిక భయం మరియు ఒత్తిడి మీ మానసిక క్షేమాన్ని దెబ్బతీస్తాయి. పరీక్షల్లో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ఆందోళనను తగ్గించడానికి మరియు విజయానికి మార్గం సుగమం చేయడానికి వ్యూహాలతో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఈ కథనం ఆందోళనను అధిగమించడానికి మరియు బ్యాంక్ పరీక్షలలో వృద్ధి చెందడానికి ఆచరణాత్మక చిట్కాలు మరియు పద్ధతులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సూచనలను అమలు చేయడం ద్వారా, మీరు ఒత్తిడిని జయించడానికి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు మీ సరైన స్థాయిలో పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ అమూల్యమైన అంతర్దృష్టులను పరిశీలించి ఆందోళనను విజయానికి ఒక మెట్టుగా మార్చుకొండి.

 

 పరీక్షకి ముందునుంచే ప్రణాళికా:

పరీక్ష రోజున ఒత్తిడి లేకుండా ఉండేందుకు పరీక్షకి సన్నద్దమయ్యేడప్పుడే కొన్ని పద్దతులు పాటిష్టే మీరు మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలుగుతారు. పరీక్షకి సంభందించిన సిలబస్, కావాల్సిన స్టడీ మాటేరియల్స్ మరియు మొక్క టెస్ట్స్లు  వంటి అన్నింటినీ మీ వద్ద ఉంచుకోండి. మీ స్టడీ టేబల్ ను మంచిగా కావాల్సిన పుస్తకాలతో నింపుకోండి అనవసరమైన పుస్తకాలు, మొబైలు ఫోన్ మరియు మీ ఏకాగ్రతను చెడగొట్టే వాటిని దూరంగా ఉంచండి. పరీక్షకి ఒక వారం ముందునుంచి సరైన నిద్ర, ఆహారం,నీళ్ళు తీసుకోండి. మీ అధ్యయన షెడ్యూల్ కు ప్రాధాన్యత ఇవ్వండి, దానిని నిర్వహించదగిన రోజువారీ, వారపు మరియు నెలవారీ లక్ష్యాలుగా విభజించండి. ఈ విధానం మీరు ఆందోళనను దూరంగా ఉంచుతూ సిలబస్ను కవర్ చేసేలా చేస్తుంది.

 

ప్రశాంతమైన నిద్ర

కొంత మంది రాత్రుళ్లు ఎక్కువగా చదువుతారు అది అన్నివేళలా మంచిది కాదు బదులుగా, మీ మనస్సు మరియు శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి ఆరోగ్యకరమైన నిద్ర దినచర్యను పెంపొందించుకోండి.  ముఖ్యంగా పరీక్ష సమయం దాగర పడేకొద్ది రాత్రుళ్లు నిద్రపోవడం అలవాటుచేసుకోండి.  రాత్రివేలలో తగినంత నిద్ర ఉండటం శరీరానికి అవసరం కొన్ని నెలలు రాత్రుళ్లు నిద్రపోవడం మేస్తే అది మెదడు  మరియు మీ పనితనం పై ప్రభావం చూపిస్తుంది. పరీక్షా సమయం దగ్గరపడే కొద్ది మీ మనస్సుని చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంచడానికి తగినంత నిద్ర, ఆహారం అవసరం.

 

విరామం

ప్రిపరేషన్ సమయంలో గంటల తరబడి కూర్చుని చదవం కొన్ని సార్లు కుదరదు కాబట్టి ఒక ప్రణాళికా వేసుకుని మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ చదివితే మీకు తగినంత ఉపశమనం లభిస్తుంది. గంటల తరబడి చదవడం అత్యంత అంకితభావం కలిగిన విద్యార్థులను కూడా ముంచెత్తుతుంది మీరు వేసుకున్న టైమ్ టేబల్ లేద పరీక్ష ప్రణాళిక కి ఇబ్బంది కలగకుండా చదువుకోండి. కనీసం 1గంటకి  ఒక 10ని” విరామం అవసరం అది మీ మెదడు ని ఒత్తిడి పెట్టకుండా ఉంటుంది తద్వారా మీరు మీ ఆందోళనకు గురికాకుండా ఉంటారు.

Also Read:  Complete Static GK 2022 in Telugu (latest to Past)

పానీయాలు

కాఫీ మరియు టీ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అధిక కెఫిన్ ఆందోళన స్థాయిలను పెంచుతుంది. బదులుగా గ్రీన్ టీ, హైడ్రేటింగ్ పండ్ల రసాలు లేదా పాలను ఎంచుకోండి. కాఫీకి పదులు గ్రీన్ టీ, పాలు, లేద పళ్ల రసాలు సేవించండి. తగినంత మంచి నీళ్ళు తాగండి ఇది మీ బ్రైన్ పనీతిరుకి అవసరం. మీ పక్కనే ఎప్పుడూ ఒక మంచినీళ్ళ బాటిల్ ఉంచుకోండి.

 

శారీరక వ్యాయామం

శారీరక వ్యాయామం, ఆటలు ఆడటం, నడక, జాగింగ్,  వంటివి చేయండి ఇవి మీ శరీరానికే కాదు మెడదుకి ఒత్తిడిని తగ్గిస్తాయి. సరదాగా కాసేపు పార్కులో, బయట గడపడం వలన మీకు విశ్రాంతి లభిస్తుంది, మీ మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. ప్రిపరేషన్ లో తప్పనిసరిగా తగినట శారీరక శ్రమ అవసరం కాబట్టి మీకు బోర్ కొట్టినప్పుడు, ఒత్తిడికి గురైనపుడు, మనస్సు సరిగ్గా లగ్నం చేయలేనప్పుడు కాస్త విరామం తీసుకోండి.

 

ఆలోచన మరియు ఆచరణ

బ్యాంకు పరీక్షలో రాణించేందుకు మంచి ఆచరన ఉంటే సరిపోదు ఆలోచన కూడా ఉండాలి. మీరు పరీక్ష రాసేదప్పుడు మీ ప్రవర్తన చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటే మీరు ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. పరీక్షలో మీకు తెలియని ప్రశ్నలు కనిపించినపుడు వాటికి సమాధానం కనిపెట్టే  పని పెట్టుకుంటే మీ పని అయిపోతుంది. పరీక్షలో సమయపాలన ఉండాలి అది మీ ఆలోచనలో కాదు ఆచరణలో కనిపించాలి. రాని ప్రశ్నలను వదిలేసి వాటి గురించి ఆలోచించకుండా వచ్చిన వాటిని మాత్రం సమాధాన చేసి ముందుకి సాగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది.

 

స్వీయ విశ్లేషణ

మనం పరీక్షకి ఎంత బాగా ప్రిపేర్ అయిన కొన్ని సార్లు ఏదో తెలియని ఆందోళన ఉంటుంది దానిని తగ్గించుకోవడానికి తగినంత సమయం మీకోసం మీరు కేటాయించుకోండి. మీరు ఏ పనులు చేస్తే ఒత్తిడి, ఆందోళనకి గురవ్వడం లేద సంభవించడం జరుగుతుందో తెలుసుకోండి. ఎక్కువ సేపు కూర్చుని చదివితే ఆందోళన వస్తే కాస్త విరామం తీసుకుని చదవండి, సరైన సమయంలో ప్రశ్నకి జవాబు చేయనపుడు వస్తే దానిని సరిదిద్దుకొండి. స్వీయ విశ్లేషణ ద్వారా మీ గురించి మీరు బాగా తెలుసుకోగలరు తద్వారా ఆందోళనను దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకోగలుగుతారు.

 

పరీక్షా కోణం లో ఆలోచించండి

తరచుగా పరీక్షల్ని దృశతిలో ఉంచుకుని మనం ప్రణాళిక సిద్దం చేసుకుంటాం కొన్ని అనివార్య సంధారభాలలో పరీక్ష వాయిదా అవ్వడం లేద రద్దు అవ్వడం జరుగుతుంది అటువంటప్పుడు ఆందోళన చెందకుండా ఒత్తిడికి గురవ్వకుండా మీ ప్రణాళికను పరీక్ష కి అనుగుణంగా మార్చుకోండి. ఒకే సారి 2 లేద 3 పరీక్షలకి మించి ప్రిపేర్ అవ్వకండి అది మిమ్మల్ని మరింత ఆందోళనకి గురి చేస్తుంది. మీ ఆశలు అన్నీ ఒకే పరీక్ష పై పెట్టుకోకండి. పరీక్షలు మాత్రమే మీ భవిష్యత్తు ని నిర్ణయించలేవు. మీ వంతు కృషి చేయండి విజయం తప్పక వరిస్తుంది. పరీక్ష బాగా రాయకపోయిన మీరు మళ్ళీ ప్రిపేర్ అయి బాగా రాయవచ్చు అని గుర్తించుకోండి.

విద్యార్థినీవిధ్యార్ధులకు, ఆందోళనను జయించడం మరియు బ్యాంక్ పరీక్షల్లో రాణించడం కోసం ఈ  అమూల్యమైన వ్యూహాలతో సాయుధమై, మీ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయండి. మీ సామర్థ్యాలను విశ్వసించండి మరియు ప్రతి పరీక్షను అచంచల విశ్వాసంతో ఎదుర్కోండి. గుర్తుంచుకోండి, విజయం కేవలం ఒక గమ్యం కాదు-ఇది జీవితకాల సాహసం. థ్రిల్‌ని ఆలింగనం చేసుకోండి, వృద్ధిని ఆస్వాదించండి మరియు మీ కలలను ఎగరనివ్వండి. విజయ మార్గం మీ కోసం వేచి ఉంది-అడుగు ముందుకు వేసి దానిని సొంతం చేసుకోండి!

IBPS RRB (PO & Clerk) Prelims + Mains 2023 Batch | Telugu | Online Live Classes By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!