Telugu govt jobs   »   APPSC   »   How to Ace APPSC Group 1&...

How to Ace APPSC Group 1& Group 2 Exams | APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షల్లో విజయం సాధించడం ఎలా?

APPSC నిర్వహించే గ్రూప్స్ పరీక్షలకు నియామక ప్రక్రియ మొదలైంది గ్రూప్‌-1 మరియు గ్రూప్ 2 సర్వీసుల  కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్1లో 81 పోస్టులతో, గ్రూప్‌-2 లో 897 పోస్టులతో APPSC విడుదల చేసింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూప్‌-2 ప్రిలిమినరీ, మార్చి 17, 2024న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పరీక్షా సమయం తక్కువ ఉన్నందున ప్రిపరేషన్ ప్రణాళిక లో కొన్ని మెళకువలు పాటిస్తే పరీక్ష లో విజయం సాధించవచ్చు. ఈ పరీక్షల్లో విజయానికి ఉపకరించే మెలకువలు ఈ కధనం లో తెలుసుకోండి.

గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లో ఏదైనా ఒక పరీక్ష రాసే అభ్యర్ధులు ఒకే పరీక్షకి ప్రిపేర్ అయితే తక్కువ సమయాన్ని ఉపయోగించుకుని విజయాన్ని సాధించవచ్చు. కానీ రెండు పరీక్షలూ ఎదుర్కోవాలన్న అభ్యర్థులు మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1, 2 ప్రిలిమినరీ పరీక్షలను ఎదుర్కొనేందుకు వివిధ రకాల సంభావ్యతలను పరిశీలిద్దాం.

RBI గ్రేడ్ B మెయిన్స్ ఫలితాలు 2023 విడుదల, ఫేజ్ 2 ఫలితాల లింక్‌ని తనిఖీ చేయండి_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్1 పరీక్షలో ఎలా విజయం సాధించాలి?

  • పోస్టులు తక్కువగా ఉన్నందునా ప్రిలిమినరీ పరీక్షకి చాలా గట్టి పోటీఉంటుంది, కావున మీరు బలాలూ బలహీనతలూ అంచనా వేసుకుని సమయ నిర్వహణను మెరుగుపరుచుకోవాలి.
  • ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి వాటికి అనుగుణంగా సిలబస్‌ లో ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై ముందుగా పట్టు సాధించాలి. విభాగాల వారీగా మార్కులను అంచనా వేసి  అంశాలను గుర్తించి ప్రణాళిక తయారు చేసుకోవాలి.
  • పేపర్‌ 2లో కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి పరీక్షా తేదీ నుండి దాదాపు ఒక సంవత్సరం క్రితం వరకు తప్పనిసరిగా చదవాలి. అందువల్ల సంబంధిత అంశాలపై నోట్స్ తయారుచేసుకోవాలి.
  • సరైన ప్రాక్టీస్‌ కోసం ప్రాక్టీస్ టెస్ట్ లు తప్పనిసరిగా చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్ లు చేస్తే మంచి స్కోరు సాధించవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ప్రశ్నల శైలికి అనుగుణంగా క్లిష్ట మైన ప్రశ్నలను కూడా సాధన చేయాలి
  • పేపర్1 మరియు పేపర్ 2 లోని అంశాలపై పట్టు సాధించాక మిగతా వెనుకబడిన విభాగాల్లోని వివిధ అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాడానికి ప్రయత్నించండి. ప్రాథమిక అవగాహన ద్వారా కూడా మార్కులు సాధించవచ్చు కాబట్టి ప్రాధమిక అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు.
  • ప్రిలిమినరీ పరీక్షా ప్రిపరేషన్ అంచనా వేసుకుని తగిన సమయం ఉంటే మెయిన్స్‌పై కూడా దృష్టి పెట్టి సిద్ధమయవ్వాలి. వీలైనంత ఎక్కువగా మాక్ టెస్ట్ లు ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేయాలి
  • మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్‌ పరీక్షకు సమయం కేటాయిస్తూనే మెయిన్స్‌లోని ఒకటి రెండు పేపర్లపై కూడా దృష్టి పెడితే తర్వాత మెయిన్స్‌లో రాణించే అవకాశం ఎక్కువ. మెయిన్స్‌లో గరిష్ఠ మార్కులు పొందేందుకు అవగాహన కీలకం. దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ద్వారానే అది మెరుగవుతుంది.
  • ప్రిలిమ్స్ పరీక్షకి సన్నద్దమయ్యేడప్పుడే మైన్స్ పరీక్ష పై దృష్టి పెట్టి రోజులో కొంత సమయం ప్రశ్నలకు జవాబులు రాయడం అలవాటు చేసుకోవాలి తద్వారా మైన్స్ డిస్క్రిప్టివ్ పరీక్ష క్లిష్టంగా అనిపించదు.

APPSC Group 2 Free Notes PDF Download (Adda247 Studymate Notes)

APPSC గ్రూప్2 పరీక్షలో ఎలా విజయం సాధించాలి?

  • APPSC లో దాదాపు 900 పోస్ట్లు ఉన్నందున దీనికి తీవ్రమైన పోటీ ఉంటుంది. మొదటి నుంచి ప్రిలిమ్స్ మరియు మైన్స్ కు సన్నద్దమవ్వాలి. ప్రిలిమ్స్ అర్హత పరీక్ష కాబట్టి మైన్స్ కు ముందునుంచి ఒక ప్రణాళిక రచించుకోవాలి. ఎలాగైనా పరీక్ష రాసి క్వాలిఫై అవుతాము అనే ధీమా నుండి బయటకు రావాలి.
  • సిలబస్ లోని అన్నీ అంశాలకు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే చదవాలి లేదా తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి సమగ్ర నోట్స్ తయారుచేసుకోవాలి. స్టడీ నోట్స్ వలన అంశాల పై స్పష్టత మరియు రివిజన్ సమయంలో సమయం ఆదా అవుతుంది.
  •  సిలబస్ లోని అన్నీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి పెట్టి, కరెంట్ అఫ్ఫైర్స్ వంటి అంశాలపై సమగ్ర నోట్స్ తయారుచేసుకోవాలి. తద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు.
  •  సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రాక్టీస్ బిట్లు మరియు రివిజన్ కి కూడా సమయం కేటాయించాలి.
  • పరీక్ష క్లిష్టత స్థాయిని అంచనా వేసేలా ప్రశ్నలు ఉన్న మాక్ టెస్ట్లు తప్పనిసరిగా చేయాలి.
  •  మీరు కొత్తగా APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధి అయినా దీర్ఘకాలంగా గ్రూప్‌-2 కోసం సిద్ధమవుతున్నవారు అయినా సరే ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌తో పాటు మెయిన్స్‌ సిలబస్‌కు కూడా ప్రాధాన్యతనిస్తూ ముందునుంచి రెండింటికీ సమయం కేటాయించాలి అప్పుడే విజయవకాశాలు అధికంగా ఉంటాయి.
  • సిలబస్ లోని అన్నీ అంశాల పై విభాగాల వారీగా మాక్ టెస్ట్లు తప్పనిసరిగా చేయాలి. తక్కువ సమయంలో పుస్తకాలను తిరగేసె కన్నా మీ సాధన స్థాయిని అంచనా వేసుకుని లోపాలను సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. స్టడీ నోట్స్ అందుబాటులో ఉంటే వాటిపై దృష్టి పెడితే ఆశించిన ఫలితం వస్తుంది.

Unlock Success with Adda’s STUDYMATE: Your Ultimate Companion for APPSC GROUP-2 Prelims 2024

APPSC గ్రూప్1 మరియు గ్రూప్ 2 పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసేవారికి గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ సులభమని చెప్పవచ్చు. భారతీయ సమాజం అనే అంశం తప్ప మిగిలిన సిలబస్ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కూడా ఉంది ఇది మీ ప్రిపరేషన్ లో ఎంతో ఉపయోగపడుతుంది. సిలబస్ అధ్యయనం చేసి ప్రతిరోజూ కొంత సమయం భారతీయ సమాజానికి కేటాయిస్తే రెండు పరీక్షలకి ఒకే సారి సన్నద్దమవ్వచ్చు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు మాత్రమే సన్నద్దమయ్యే అభ్యర్ధులు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష క్లిష్టంగా అనిపిస్తుంది.
  • రెండు పరీక్షల్లో ప్రశ్నల శైలి కాస్త భిన్నంగా ఉన్నందున రెండు పరీక్షలకు విడిగా మాక్ టెస్ట్లు చేయాలి. మాక్ టెస్ట్ లో ని ప్రశ్నల తీరు తెలుసుకుని వాటికి తగ్గట్టుగా ప్రిపరేషన్ లో మార్పులు చేసుకోవాలి.
  • గ్రూప్‌-2 అభ్యర్థులు ‘రాత’ పరీక్షకి వారి బలాలు బలహీనతలు అంచనా వేసుకుని,గ్రూప్ 1 ‘డిస్క్రిప్టివ్‌’ పరీక్ష కి విడిగా సన్నద్దమవ్వలి.
  • ఏ పరీక్షకైనా అభ్యర్ధి శక్తి సమర్ధ్యాలు అంచనా వేసుకుని వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధించగలరు

మరిన్ని కధనాలు చదవండి:

List of APPSC Group 2 Exam Books (New Syllabus) Decoding APPSC Group-II 2023, Download PDF
Unlock Success with Adda’s APPSC GROUP-2 STUDYMATE APPSC Group 1, 2023 Decoding PDF
How to prepare for APPSC Group-I & Group-II simultaneously Adda’s Study Mate APPSC Group 2 Prelims

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!