Telugu govt jobs   »   Article   »   Horizontal Reservation For Women Candidates in...

Horizontal Reservation For Women Candidates in TSPSC Exams | TSPSC పరీక్షల్లో మహిళా అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్

తెలంగాణా రాష్ట్రంలో TSPSC ద్వారా భర్తీ చేయనున్న అన్ని పరీక్షలు గ్రూప్ 1, 2 మరియు TSPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE), TSPSC AE, TSPSC TPBO (టౌన్ ప్లానింగ్ ఆఫీసర్) మరియు ఇతర పోస్టుల నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

రాజేష్ కుమార్ దరియా Vs రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ [2007(8) SCC785] కేసులో గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలంది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఏవిధమైన అభ్యంతరం లేదని, అయితే, అవి కాకుండా మహిళలకు విడిగా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. TSPSC గ్రూప్-1 నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు తెలిపిందని, ఆ మేరకు ఇంజినీరింగ్ పోస్టుల్లోనూ పాటించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు న్యాయస్థానానికి విన్నవించారు.

TSPSC Horizontal Resrvation WEB-NOTE 

TSPSC పరీక్షల్లో మహిళా అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్

రిజర్వేషన్లపై TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కు సమాంతరంగా మహిళలకు పోస్టులు కేటాయిస్తామని TSPSC వెబ్ నోట్ విడుదల చేసింది. ప్రతి నోటిఫికేషన్ కు ఈ విధానాన్ని అమలు చేస్తామని వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపింది. రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అన్ని కేటగిరీల్లో మహిళా అభ్యర్థులకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. హైకోర్టు తీర్పు ప్రకారమే తుది ఫలితాలు ఉంటాయని TSPSC తెలిపింది.

 

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

వర్టికల్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య వ్యత్యాసం

భారత రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా, దేశంలో ప్రభుత్వ విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. 1. వర్టికల్ /సోషల్. 2. హారిజాంటల్ /ప్రత్యేక రిజర్వేషన్లు.

వర్టికల్ రిజర్వేషన్లు అంటే ఏమిటి?

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను నిలువు రిజర్వేషన్ అంటారు. చట్టంలో పేర్కొన్న ప్రతి సమూహానికి ఇది విడిగా వర్తిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(ఎ)లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వర్టికల్ రిజర్వేషన్‌లో వస్తారు.

హారిజాంటల్ రిజర్వేషన్

హారిజాంటల్ రిజర్వేషన్‌లో, స్త్రీ, NCC , స్పోర్ట్స్ కోటా, ఎక్స్-సర్వీస్ మెన్ రిజర్వేషన్ అభ్యర్థులు వస్తారు.

మహిళలు, అనుభవజ్ఞులు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, వికలాంగులు వంటి ఇతర కేటగిరీల లబ్ధిదారులకు వర్టికల్ కేటగిరీలను మినహాయించి సమాన అవకాశాలను కల్పిస్తోంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) కిందకు వస్తుంది.

వికలాంగుల రిజర్వేషన్లను కూడా నిలువుగా లెక్కించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కోటా కింద మహిళా రిజర్వేషన్లను నిలువునా అమలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించింది.

అసలు కేసు ఏమిటి?

గతంలో జరిగిన TSPSC గ్రూప్-1 ఉద్యోగాల నియామకాల్లో మహిళా రిజర్వేషను వర్టికల్ గా కాకుండా హారిజంటల్ గా వర్తింపజేయాలని TSPSCని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి 503 పోస్టులతో TSPSC గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా మహిళా కోటాకు సంబంధించి విడిగా రిజర్వేషన్ ఇవ్వడం సరికాదని. హారిజంటల్ రిజర్వేషన్ (ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా మహిళల విభజన) విధానాన్నే పాటించేలా TSPSCకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన కొడేపాక రోహితో పాటు మరికొందరు గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

అన్నీ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకుని వచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ని సవరించి మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు GO విడుదల చేసింది మరియు దానికి లో కొన్ని మార్పులు చేస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగాల భర్తీ సమయంలో గతంలో నిర్దేశించిన అభ్యర్ధులు లేకపోతే వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం)ని రద్దు చేసింది తద్వారా ఎప్పటి పోస్ట్లు అప్పటికి అన్నీ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ సవరణకి సంభందించిన తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. విభాగాల వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తూ మహిళలకి ప్రత్యేకంగా కేటాయించిన స్థానాల్లో అభ్యర్ధులు లేకపోతే వాటిని ఆ విభాగంలో/ కమ్యూనిటి లో ఉన్న పురుష అభ్యర్ధులతో భర్తీ చేసేందుకు అనుమటించింది, తద్వారా నోటిఫికేషన్ లో పొందుపరచిన ఖాళీలు అన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరపున రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి GOMS.35ని జారీ చేశారు. ఈ చర్యతో TSPSC తో పాటు రాబోయే అన్నీ నోటిఫికేషన్ లో నిర్దేశించిన ఖాళీలను ప్రభత్వం తప్పనిసరిగా భర్తీ అయ్యేలా చూస్తుంది.

అదేసమయంలో మహిళలకు పొందుపరచిన 33.3% రెజర్వేషన్ లో వారికోసం కేటాయించిన ఖాళీలు వారికి కాకుండా పురుషులకి కూడా దక్కుతాయి కాబట్టి వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే భావన కూడా కనిపిస్తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!