Telugu govt jobs   »   Current Affairs   »   కేంద్ర సమాచార హ‌క్కు కమిషన్ చీఫ్ కమిషనర్‌

Hiralal Samaria has taken charge as the Central Right to Information Chief Commissioner | కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు చేపట్టారు

Hiralal Samaria has taken charge as the Central Right to Information Chief Commissioner | కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు చేపట్టారు

కేంద్ర సమాచార హ‌క్కు కమిషన్ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ స‌మారియా భాధ్యతలు స్వీకరించారు.  సోమవారం ఉదయం ఆయ‌న‌తో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కూడా పాల్గొన్నారు.

కేంద్ర స‌మాచార క‌మిష‌న్ (సీఐసీ) ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన తొలి ద‌ళితుడు హీరాలాల్ స‌మారియా. 1985- బ్యాచ్ తెలంగాణ క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ స‌మారియా కేంద్ర కార్మిక ఉపాధి క‌ల్ప‌నాశాఖలో ప‌ని చేస్తూ రిటైర్ అయ్యారు. 2020 న‌వంబ‌ర్ ఏడో తేదీన కేంద్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్‌గా నియమితులయ్యారు. ఆయన 2025 సెప్టెంబరు 13 వరకూ ఈ పదవిలో ఉంటారు.

కేంద్ర స‌మాచార హ‌క్కు ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా హీరాలాల్ స‌మారియా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత కేంద్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్లుగా ఆనంది రామ‌లింగం, వినోద్ కుమార్ తివారీల‌తో ఆయ‌న ప్ర‌మాణం చేయించారు. కేంద్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు ఆనందీ రామ‌లింగం, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ సీఎండీగా ప‌ని చేశారు. వినోద్ కుమార్ తివారీ, 1986-హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్‌) అధికారిగా ప‌ని చేశారు. కేంద్ర స‌మాచార హ‌క్కు ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌, క‌మిష‌న‌ర్లు త‌మ‌కు 65 సంవత్సరాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కూ ఆ ప‌ద‌విలో కొన‌సాగుతారు.

T-Works celebrates grand finale of Byte Bending Championship-2023_70.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!