Telugu govt jobs   »   TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా?...

High Court rejects postponement of TSPSC Group 1 Prelims Exam | TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా? హైకోర్టు ఏమి తీర్పు ఇచ్చింది

జూన్‌ 9, 2024 న జరగనున్న TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయాలని కొంత మంది హైకోర్టు లో పిటిషన్ వేశారు, ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధులలో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేసి.. తమకు న్యాయం చేయాలని TSPSC చైర్మన్, సెక్రటరీలను TSPSC గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. అయితే గ్రూపు 1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే  TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు పేర్కొంది.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పై హైకోర్టు తీర్పు

జూన్‌ 9, 2024 న IB ACIO గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉన్నందున TSPSC గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ను మరో తేదీకి మార్చాలని M.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు  జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. TSPSC తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో రెండు IB ACIO పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని,TSPSC గ్రూప్ 1కు 4 లక్షలకుపైగా ఆభ్యర్ధులు పోటీపడుతున్నారని తెలిపారు. కొంత మంది కోసం ఇన్ని లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించారు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

ఎన్నికల విధులు.. ప్రిపరేషన్ ఎలా?

తెలంగాణలో జరగబోయే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలని RS ప్రవీణ్ కుమార్‌ అన్నారు. కొత్త TSPSC గ్రూప్ 1  విడుదల అయిన వెంటనే, లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ లో MLC ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల విధులకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు, దీంతో గ్రూప్‌-1 కోసం దరఖాస్తులు చేసుకొన్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్‌ సర్వీసు ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు, వారికి ప్రిపరేషన్ కు సమయం లేదని, అలానే జూన్‌ 9, 2024 న IB ACIO గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష, అలాగే జూన్ 16, 2024న UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కూడా జరగనుంది ఇలా అన్ని పరీక్షలు వెంటవెంటనే ఉన్నందున అభ్యర్థులకు గందరగోళంగా ఉందని, ప్రిపరేషన్ కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2024 విడుదల

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా? హైకోర్టు ఏమి తీర్పు ఇచ్చింది_5.1