ఏపీలోని గుంటూరు సర్వజనాసుపత్రి డిజిటలైజేషన్‌లో దేశంలోనే రెండో స్థానం సాధించింది
ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన రోగుల వివరాలను డిజిటలైజ్ చేయడంలో గుంటూరు సర్వజనాసుపత్రి దేశ వ్యాప్తంగా రెండో ర్యాంక్ సాధించింది. జూలై 29 న సాయంత్రం, ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా, 1,053 మంది రోగుల వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జీజీహెచ్ 1,038 మంది పేర్లు నమోదు చేసి రెండో స్థానం, విజయవాడ ఆసుపత్రిలో 533 మంది వివరాలు నమోదు చేసినందున 7వ స్థానంలో నిలిచాయి.
ఈ ఘనత ఫలితంగా ప్రతి రోగికి రూ.20 వంతున ప్రోత్సాహక నగదును కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి మంజూరు చేస్తుందని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రయత్నంలో మొదటి స్థానం సాధించేందుకు తమ ప్రయత్నాలను కొనసాగించాలని ఆసుపత్రి యంత్రాంగం నిశ్చయించుకుంది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************