గవర్నర్ TSPSC చైర్మన్ మరియు బోర్డు సభ్యుల రాజీనామా ను ఆమోదించారు: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి సమర్పించిన రాజీనామాలను గవర్నర్ తమిళిసై బుధవారం ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులు సమర్పించిన రాజీనామాలను ఆమోదించడంలో ఎలాంటి జాప్యం జరగలేదని గవర్నర్ స్పష్టం చేశారు. TSPSC నిర్వహించిన కొన్ని పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజి లో భాగంగా ఛైర్మన్ మరియు ఇతర సభ్యుల రాజీనామా జరిగింది. ప్రశ్నా పత్రాల లీకేజి పై SIT దర్యాప్తు చేసి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలి అని గవర్నర్ సూచించారు.
అయితే, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి తప్పనిసరి అయిన మరో ఐదుగురు సభ్యులు ఇంకా రాజీనామాలు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ప్రభుత్వం రిక్రూట్ మెంట్లను పునఃప్రారంభించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయగలదు. “ఈ ప్రక్రియలో నిరుద్యోగ యువత ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సాధారణంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు ప్రత్యేకించి నిరుద్యోగ యువతకు రాజ్ భవన్ హామీ ఇస్తుంది మరియు గవర్నర్ ఆదేశాలను నిలబెట్టడానికి కట్టుబడి ఉన్నారు అని తెలిపింది .
త్వరలో ఏర్పాటు కానున్న కొత్త బోర్డు
గవర్నర్ TSPSC బోర్డు సభ్యుల రాజీనామాని ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. చైర్మన్ సహ ఇతర బోర్డు సభ్యులను నియమించాలని నూతన ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్ సహ ఇతర సభ్యులను నియమించనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో TSPSC తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు గతంలో పట్టుబట్టారు. నూతన సర్కారు ఏర్పడటంతో కమిషన్ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం నిర్ణయించారు. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది దీనికై మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారులతో కలిసి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
భారంఅంతా కొత్త కమిషన్ పైనే
TSPSC నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గత గ్రూప్-2 నోటిఫికేషన్ పరీక్షా తేదీలు మొదలుకొని కొత్త నియమకాలను చేపట్టేందుకు బోర్డు తప్పనిసరి. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు, సర్వీసు నిబంధనలు, పొరపాట్లు.. ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు.TSPSC బోర్డులో ఛైర్మన్తో పాటు 11 మంది సభ్యులు అవసరం ఈ మేరకు కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. చైర్మన్ పదవి ఖాళీ అయింది. అభ్యర్ధులు కూడా కొత్త బోర్డుని ఏర్పాటు చేసి తొందరగా నియామక నోటిఫికేషన్ లను భర్తీ చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |