General Studies MCQS Questions And Answers in Telugu: General Studies is an important topic in every competitive exam. here we are giving the General Studies Section which provides you with the best compilation of General Studies. General Studies is a major part of the exams like APPSC, TSPSC, IBPS, SBI, RBI, SSC, Railway, UPSC & Other Competitive exams, etc. Many aspirants for government exams have benefited from our website now it’s your turn.
This is the best site to find recent updates on General Studies not only for competitive exams but also for interviews.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
General Studies MCQs Questions And Answers in Telugu (తెలుగులో)

Q1. ఆంధ్రదేశంలో మొదటి సహాయ నిరాకరణవాదిగా ఎవరిని పేర్కొంటారు?
- కొండా వెంకటప్పయ్య
- గులాం మొహియుద్దీన్
- అయ్యదేవర కాళేశ్వరరావు
- గొల్లపూడి సీతారామశాస్త్రి
Q2. టంగుటూరి ప్రకాశం కి ఆంధ్రకేసరి బిరుదు ఏ ఉద్యమ కాలంలో వచ్చింది.?
- సైమన్ కమిషన్
- హోం రూల్
- ఉప్పు సత్యాగ్రహం
- పైవేవి కాదు.
Q3. ఆంధ్ర శివాజీగా పేరొందిన వ్యక్తి ఎవరు?
- కన్నెగంటి హనుమంతు
- ఉన్నవ లక్ష్మీనారాయణ
- పర్వతనేని వీరయ్య చౌదరి
- టంగుటూరి ప్రకాశం పంతులు
Q4. వాంఛూ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసారు?
- ఎస్.కె. థార్
- కైలాసనాథ్
- సర్దార్ వల్లభాయ్ పటేల్
- పట్టాభి సీతారామయ్య
Q5. ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ ఎవరు?
- నీలం సంజీవరెడ్డి
- చందూలాల్ మాధవ్ త్రివేది
- ఎన్.వెంకటరమణయ్య.
- పైవేవి కావు.
Q6. భారతదేశంలో అభ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
- 2
- 3
- 1
- 4
Q7. ఆంధ్రప్రదేశ్ లో ధార్వార్ శిలలు ఏ జిల్లాలలో ఉన్నాయి?
- నెల్లూరు
- అనంతపురం
- చిత్తూరు
- పైన ఉన్నవన్నీ
Q8. ఆంధ్ర రాష్ట్రంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి?
- చిత్తూరు, ప్రకాశం
- అనంతపురం, నెల్లూరు
- కర్నూలు, శ్రీకాకుళం
- విశాఖపట్నం, విజయనగరం
- తూర్పుగోదావరి, కడప
- 1,2మరియు 3
- 2,3 మరియు 4
- 2,3 మరియు 5
- 1,2 మరియు 4
Q9. నైరుతి ఋతుపవన కాలానికి మరొక పేరు ఏమిటి కనుగొనండి?
- శీతాకాలం
- వేసవికాలం
- వర్షాకాలం
- ఈ శాన్య ఋతుపవనకాలం
Q10.గోదావరి నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది అయితే ఈ క్రింది వాటిలో వాటిని గుర్తించండి?
- గౌతమీ
- వశిష్ట
- కౌశిక
- పైవన్నీ
Solutions:
S1.Ans(c)
Sol. ఆంధ్రదేశంలో మొదటి సహాయ నిరాకరణవాదిగా అయ్యదేవరను పేర్కొంటారు
S2. Ans(a)
Sol. 1928 ఫిబ్రవరి 26న మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వంలో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా నిరసన ఉద్యమం జరిగింది.
S3. Ans(c)
Sol. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్ర శివాజీగా పేరొందిన పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో జరిగింది. ఈయన శాంతిసేన వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్ పార్లమెంట్‌లో కూడా ఈ ఉద్యమం చర్చకు వచ్చింది.
S4. Ans(b)
Sol. కేంద్ర ప్రభుత్వం 1952లో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్ వాంఛూ అధ్యక్షతన ఒక కమిటీని నియమించగా, కమిటీ 1953, మార్చి 23న నివేదిక ఇచ్చింది.
S5. Ans(c)
Sol. ప్రకాశం ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా, చందూలాల్ మాధవ్ త్రివేది గవర్నర్‌గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ ఎన్.వెంకటరమణయ్య.
S6.ANS.(C)
Sol. భారతదేశంలో అభ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, సున్నపురాయి నిల్వలలో మూడింట ఒక వంతు కలిగి ఉంది. తుమ్మలపల్లె యురేనియం గనిలో 49000 టన్నుల ముడి ధాతువు వున్నట్లు ధ్రువీకరించబడింది. దీనికంటె మూడు రెట్లు ఎక్కువ నిల్వలను కలిగి ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. మెటల్ గ్రేడ్ బాక్సైట్ నిక్షేపాలు విశాఖపట్నం నౌకాశ్రయానికి సమీపంలో 700 మిలియన్ టన్నులు ఉన్నాయి.
S7. ANS. (D)
Sol. నెల్లూరు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ధార్వార్ శిలలు ఉన్నాయి. నెల్లూరులో ఉన్న ఈ శిలల నుంచి అభ్రకం , రాగి, ఖనిజాలు లభిస్తాయి.చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఈ శిలల్లో బంగారం లభించే క్వార్ట్జ్ శిలలు ఉన్నాయి.ఈ శిలలలో గ్రానైట్ శిలా సముదాయాలు కనిపిస్తాయి.
S8.ANS.(D)
Sol. ఆంద్ర రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు. ఇవి చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా మరియు తూర్పుగోదావరి, కడప, కర్నూలు, శ్రీకాకుళం , కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి తక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇవి గ్రానైట్ రాళ్ళ నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి.
S9.ANS.(C).
Sol .భారత వాతావరణ శాఖ సంవత్సర కాలాన్ని 4 భాగాలుగా విభజించింది అయితే అందులో శీతాకాలం జనవరి నుండి ఫిబ్రవరి వరకు వేసవికాలం మార్చ్ నుండి జూన్ మధ్య వరకు, వర్షాకాలం / నైరుతి ఋతుపవనకాలం జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు, ఈ శాన్య ఋతుపవనకాలం / తిరోగమన నైరుతి ఋతుపవనకాలం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది.
S10.ANS(d)
Sol. గోదావరి నది ఏడు పాయలు గౌతమీ, వశిష్ట, వైనతేయ, కౌశిక,ఆత్రేయ, తుల్య, భరద్వాజ.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |