General Awareness MCQS Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
General Awareness MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
General Awareness MCQs Questions And Answers in Telugu
Q1. వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించినది ఎవరు?
- రఘుపతి వెంకటరత్నం నాయుడు
- గురజాడ అప్పారావు
- గిడుగు వెంకట రామమూర్తి
- కందుకూరి వీరేశలింగం
Q2. ఈ క్రింది వారిలో ‘రావు బహదూర్’ అనే బిరుదు ఎవరికీ ప్రధానం చేసారు?
- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- రఘుపతి వెంకటరత్నం నాయుడు
- గురజాడ అప్పారావు
- కందుకూరి వీరేశలింగం
Q3. వీరేశలింగాన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిగా అభివర్ణించినది ఎవరు?
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్
- మహాదేవ గోవిందరనడే
- చంద్రార్కర్
- గురజాడ అప్పారావు
Q4. 1922 నాటి రాంపా తిరుగుబాటు ద్వారా ఏ చట్టంను వ్యతిరేకించారు?
- మద్రాస్ అడవులచట్టం, 1852
- మద్రాస్ అడవులచట్టం, 1882
- మద్రాస్అడవుల చట్టం, 1862
- మద్రాస్అడవుల చట్టం, 1872
Q5. గుంటూరు జిల్లాలోని చిరాలా మరియు పేరాల్లో పన్ను కు సంభందించి పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారు?
- గడిచేర్ల హరిసర్వర్టామా రావు
- దుగ్గీరాళ గోపాలక్రిష్ణయ్య
- మదాపతి హనుమంతరావు
- ఎన్ జి రంగా.
Q6. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర OC సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు EBC నేస్తం ద్వారా ఎంత మంది మహిళకు లబ్ది చేకూరనున్నది?
- 93 లక్షల మంది
- 90 లక్షల మంది
- 50 లక్షల మంది
- ఏది కాదు
Q7. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇటివల కేంద్రం రాష్ట్రానికి ఎన్ని ఇళ్ళ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చినది?
- 10 లక్షల ఇల్లు
- 07 లక్షల ఇల్లు
- 5 లక్షల ఇల్లు
- 5 లక్షల ఇల్లు
Q8. అగ్రిటెక్ 2021 లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు?
- మూడు ప్రాంతాలు
- ఐదు ప్రాంతాలు
- పదమూడు ప్రాంతాలు
- ఏడు ప్రాంతాలు
Q9. వార్షిక ప్రణాళికలు లేదా ప్రణాళిక విరామం ఈ క్రింది ఏ సంవత్సరాల మధ్య చోటుచేసుకున్నాయి?
(a) 1966-1968
(b) 1976-1979
(c) 1966-1969
(d) 1965-1968
Q10. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత(చదరపు కిలోమీటరుకు)?
- 384
- 332
- 304
- 982
Solutions:
S1. Ans (d)
Sol. వీరేశలింగం తన సిద్దాంత ప్రచారంకోసం వివేకవర్ధిని అనే పత్రికను 1 874లో రాజమండ్రిలో ప్రారంభిం
చాడు. తన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు 1874 సెప్టెంబరులో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలనుస్థాపించాడు. ఇది ఆంధ్రదేశంలోనే తొలి బాలికల పాఠశాల
S2. Ans (d)
Sol. వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్ బిరుదు ప్రదానం చేసింది. బ్రిటన్ దేశస్తురాలైన మానింగ్ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేలా వీలునామాలో రాసిపె ట్టింది.
S3. Ans (b)
Sol. మద్రాసులో 1898 లో భారత సంఘ సంస్కరణ సభకు అధ్యక్షత వహించి అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు. ఈ సభలో మహాదేవ గోవింద రనడే, వీరేశలింగాన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిగా అభివర్ణించాడు.
S4. Ans (b)
Sol. ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహశీల్దార్ సెబస్టియన్ అతడి కాంట్రాక్టర్ సంతానం పిళ్లె దౌర్దన్యాలకువ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని ప్రారంభించాడు
S5. Ans (b)
Sol. నాలుగు వేల పన్నుభారం 40 వేలకు పెరగడంతో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలోచీరాల-పేరాల ఉద్యమం ప్రారంభమైంది. 1921, ఏప్రిల్ 6న గాంధీజీ చిరాలను సందర్శించి శాంతియుత పన్నుల నిరాకరణ ఉద్యమం చేయమని సలహా ఇచ్చారు.
S6.Ans(c)
Sol. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన ‘YSR EBC నేస్తం’ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర OC సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
S7.Ans(b)
Sol. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇటివల కేంద్రం రాష్ట్రానికి 1.07 లక్షల ఇళ్ళ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చినది.
S8. Ans(a)
Sol. అగ్రిటెక్ 2021 లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.
S9. Ans(c)
sol. 1966 లో ఆర్ధిక సంక్షోభం కారణంగాను, రాజకీయంగా యుద్దాలను ఎదుర్కోవడం కారణంగా ప్రణాళికలను రూపొందించలేకపోయారు. అందుకే ఈ కాలాన్ని ప్రణాళిక సెలవు కాలం లేదా ప్రణాళిక విరామం లేదా వార్షిక ప్రణాళిక కాలం అని అంటారు.
S10. Ans(c)
Sol. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత చదరపు కిలో మీటరుకు 304 గా ఉన్నది. ఇది అఖిల భారత స్థాయిలో 382 గా ఉన్నది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |