Gayatri Bank Honored with Prestigious Awards | ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో గాయత్రీ బ్యాంకు గుర్తింపు పొందింది
కరీంనగర్ కు చెందిన గాయత్రీ బ్యాంక్, ‘బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ఇన్ కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ – 2023’లో ‘బెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్’ మరియు ‘బెస్ట్ ఇ-పేమెంట్స్ ఇనిషియేటివ్స్’ అవార్డులను గెలుచుకుంది. దీంతో జాతీయ స్థాయిలో గాయత్రీ బ్యాంక్ వరుసగా 15వ సారి విజయం సాధించింది.
మధ్యస్థ బ్యాంకుల విభాగంలో జాతీయ స్థాయిలో ఈ అవార్డులు లభించింది. అన్ని రంగాలలో సాధించిన ప్రగతికి గాను బెస్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ విభాగానికి మరియు బ్యాంక్ అందిస్తున్న వివిధ డిజిటల్ చెల్లింపు సేవలకు గాను బెస్ట్ ఇ-పేమెంట్స్ ఇనిషియేటివ్ విభాగానికి అవార్డులు లభించాయి.
గోవా రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖ మంత్రి గోవింద్ గౌడే, ఆర్‌బీఐ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాస్ ఈ అవార్డులను అందజేశారు. బ్యాంకు అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ తెలిపారు. రూ.1369.57 కోట్ల డిపాజిట్లు, రూ.977.86 కోట్ల రుణ మిగులుతో మొత్తం రూ.2347.43 కోట్ల వ్యాపారాన్ని సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గాయత్రి బ్యాంకుకు మొత్తం 24 శాఖలు ఉన్నాయి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |