Telugu govt jobs   »   Latest Job Alert   »   1663 Vacancies in Telangana in various...

Finance Department approved 1663 posts in Telangana | తెలంగాణలో 1663 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది

Engineering Jobs in Telangana: Good news for the unemployed who studied engineering in Telangana. The State government has speeded up the recruitment of jobs in various government departments. Special Chief Secretary of Finance Department K. Ramakrishna Rao has issued an order to this extent. It is noteworthy that 90 percent of the newly approved posts are related to the engineering category.

Engineering Jobs in Telangana: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 1663 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022APPSC/TSPSC Sure shot Selection Group

 

1663 Engineering Jobs In Telangana | తెలంగాణలో 1663 ఇంజినీరింగ్ ఉద్యోగాలు

రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్‌ పోస్టులు సహా 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటిలో నీటిపారుదలశాఖలోని 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 95 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భూగర్భ జలశాఖలో 88 పోస్టులు, ఆర్‌అండ్‌బీ శాఖలోని 38 సివిల్‌ ఏఈ పోస్టులు, 145 సివిల్‌ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్‌ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 27 టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు, ఆర్థిక శాఖలోని 53 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

Telangana Finance Ministry approved Vacancies (ఖాళీల వివరాలు)

Department Name Posts
Irrigation & CAD Department 1238
Road & Buildings Department 284
Finance Department 53
Ground Water Department 88
Total 1663

 

Telangana Irrigation & CAD Department Vacancies | నీటిపారుదల & CAD శాఖ ఖాళీలు

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ 704
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ 227
జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ 212
టెక్నికల్‌ అసిస్టెంట్‌ 95
మొత్తం 1238

Telangana Ground Water Department Vacancies | భూగర్భ జల శాఖ ఖాళీలు

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్‌ కెమిస్ట్‌ 04
అసిస్టెంట్‌ డ్రిల్లర్‌ 04
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 12
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) 03
అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్‌ 06
అసిస్టెంట్‌ హైడ్రోజియాలాజిస్ట్‌ 15
అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌ 05
అసిస్టెంట్‌ హైడ్రోమెటాలజిస్ట్‌ 01
డ్రిల్లింగ్‌ సూపర్‌వైజర్‌ 04
జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ 04
ల్యాబ్‌ అసిస్టెంట్‌ 01
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోజియోలజీ) 07
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్‌) 08
ట్రేసర్‌ (డిస్ట్రిక్ట్‌) 08
ట్రేసర్‌ (హెచ్‌వోడీ) 01
మొత్తం 88

Telangana Road & Buildings Department Vacancies | తెలంగాణ రోడ్ & భవనాల శాఖ ఖాళీలు

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 38
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(సివిల్‌) 145
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) 13
జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ 60
సీనియర్‌ ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌ 01
టెక్నికల్‌ అసిస్టెంట్‌ 27
మొత్తం 284

Telangana Finance Department vacancies | తెలంగాణ ఆర్థిక శాఖ ఖాళీలు

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (Gr -II)  53
మొత్తం  53

Notifications issued by the Government of Telangana in 2022

తాజా పోస్టులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేందుకు కసరత్తును ఆర్థికశాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వనుంది.వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

Finance Department approved 1663 posts in Telangana | తెలంగాణలో 1663 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది_4.1

*******************************************************************************************

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

New Vacancies Released by Telangana Government, 3,334

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!