EMRS పరీక్ష తేదీకి సంబంధించి ఒక ఫేక్ నోటీస్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా చక్కర్లు కొడుతోంది. 2023 అక్టోబర్ 13న EMRS రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు ప్రక్రియని పునఃప్రారంభించినప్పటి నుంచి 2023 అక్టోబర్ 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. EMRS పరీక్ష తేదీ 2023కు సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఆన్లైన్ లో కనిపిస్తున్న నోటిఫికేషన్ పట్ల అభ్యర్ధులు జాగ్రత్తగా ఉండాలి.
నకిలీ EMRS పరీక్ష తేదీ ప్రకటన
EMRS పరీక్ష తేదీ వెలువడింది మరియు పరీక్ష ఖరారు అయినట్టు తెలుపుతున్న ఒక కొత్త ఫేక్ నోటిఫికేషన్ వివిధ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది. ఫేక్ EMRS నోటిఫికేషన్ ప్రకారం EMRS పరీక్ష తేదీ 2023 డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది అని ఉంది.
ఫేక్ EMRS నోటిఫికేషన్ ఏం చెబుతోంది?
EMRS పరీక్ష డిసెంబర్ 16, 17, 23 మరియు 24, 2023 తేదీలలో దేశవ్యాప్తంగా 43 నగరాల్లో నిర్వహించబడుతుందని నకిలీ EMRS నోటిఫికేషన్ లో ఉంది. మరియు పరీక్షని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుందని కూడా తప్పుగా పేర్కొంది. ఈ నకిలీ నోటిఫికేషన్ 2023 డిసెంబర్ 17 మరియు 24 తేదీల్లో EMRS నిర్వహించబడుతుందని పేర్కొంది కానీ అది వాస్తవం కాదు.
EMRS పరీక్ష తేదీ నకిలీ అని ఎలా గుర్తించాలి?
EMRS పరీక్షను నిర్వహించేది CBSE అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు కానీ నిజానికి CBSE కి EMRS పరీక్షకి ఎటువంటి సంభందం లేదు. అయితే, గిరిజన విద్యార్థుల కోసం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ (NESTS) అనేది EMRS పరీక్షను నిర్వహిస్తుంది అని అభ్యర్ధులు గమనించగలరు ఇదే విషయాన్ని నోటిఫికేషన్ సమయంలో కూడా తెలిపారు. ఈ నకిలీ నోటిఫికేషన్ పై KVS అధికారిక సంతకం కూడా ఉంది కానీ EMRS పరీక్ష కి KVS కి ఎటువంటి సంభందం లేదు. కాబట్టి KVS అధికారి అసిస్టెంట్ కమీషనర్ (Acad) దేవేందర్ కుమార్ సంతకం చేసిన ప్రకటన తప్పు అని నిర్ధారించవచ్చు.
గమనిక: అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని మరియు అధికారికంగా ధృవీకరించని ఎలాంటి సమాచారంపై ఆధారపడకూడదని సూచిస్తున్నాము.
EMRS పరీక్ష తేదీ 2023 తాజా సమాచారం
EMRS పరీక్ష తేదీ 2023ని 16, 17, 23, మరియు 24 డిసెంబర్ 2023గా నిర్ణయించినట్లు ఒక నకిలీ నోటీసులో పేర్కొన్నారు మరియు CBSE పరీక్షను నిర్వహిస్తుంది అని తెలిపారు. అయితే, ఈ నోటీసు పూర్తిగా అవాస్తవం. EMRS పరీక్ష 2023పై అధికారం లేని CTET డైరెక్టర్ J. K. యాదవ్, దాని తప్పు అని నిర్ధారిస్తూ నోటీసుపై సంతకం చేశారు. అధికారిక ప్రకటన అనంతరం మేము EMRS పరీక్ష తేదీని తెలియజేస్తాము. మీ ప్రిపరేషన్ ని ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగించండి.