Election Results 2022: The BJP has retained all four states it ruled, with a sparkling victory in the politically crucial Uttar Pradesh, ensuring a boost in the coming Rajya Sabha polls and the 2024 national elections. AAP swept Punjab, wiping out the ruling Congress.
Election Results 2022 , ఐదు రాష్ట్రాలలోని ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో యూపీ ప్రభుత్వం విజయవంతం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ కారణాల్లో ఒకటి. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఎస్పీ విఫలమైంది. ఇక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది.
Election Results 2022 , ఐదు రాష్ట్రాలలోని ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిని గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సాను కూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగ్గానే అంచనా వేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు ఎందుకు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
APPSC/TSPSC Sure shot Selection Group
Uttar Pradesh Election Results 2022
ఉత్తరప్రదేశ్ ( 403 ) | |||
---|---|---|---|
Party | Won | ||
బీజేపీ + | 273 | ||
ఎస్ పీ | 125 | ||
కాంగ్రెస్ | 2 | ||
ఇతరులు | 2 | ||
బీఎస్‌పీ | 1 |
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయానికి మోడీ–యోగీ ద్వయం కారణ మన్నది నిర్వివాదాంశం. మొత్తం 403 స్థానాల్లో 255 బీజేపీకి దక్కడం, అది కూడా 41 శాతం ఓటుషేరుతో కావడం భారీ విజయం గానే చెప్పుకోవాలి. 2017 ఎన్నికలతో పోలిస్తే 57 సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేసిన అప్నాదళ్ (సోనేలాల్) పన్నెండు స్థానాలు గెలుచుకోగా, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్ ఇంకో ఆరు సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల కంటే 73 స్థానాలు ఎక్కువగా, మొత్తం 111 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. సైకిల్ గుర్తుకు పడ్డ ఓట్లూ 32 శాతానికి చేరాయి. ఎన్నిక లకు ముందు ఎస్పీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డీ 8, ఎస్‌బీఎస్‌పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 13 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏతావాతా యూపీ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుంది.
Punjab Election Results 2022
పంజాబ్ ( 117 ) | |||
---|---|---|---|
Party | Won | ||
ఆప్ | 92 | ||
కాంగ్రెస్ | 18 | ||
అకాలీదళ్ | 4 | ||
బీజేపీ + | 2 | ||
ఇతరులు | 1 |
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చేసిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ స్థానాలు 117లో ఏకంగా 92 గెలుచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్లు 22 శాతమే అయి నప్పటికీ సాధించిన అదనపు సీట్లు మాత్రం 72. కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లతో 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.
Uttarakhand Election Results 2022
ఉత్తరాఖండ్ ( 70 ) | ||
---|---|---|
Party | Won | |
బీజేపీ | 47 | |
కాంగ్రెస్ | 19 | |
ఇతరులు | 3 | |
బీఎస్‌పీ | 1 | |
ఆప్ | 0 |
మోడీ హవాతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి విజయం దక్కింది. ఉన్న డెబ్భై స్థానాల్లో 47 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మును పటి కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ దక్కించుకున్నా అధికారం మాత్రం అందని మానిపండుగానే మిగిలింది. కొత్త ఉద్యోగాల కల్పన, ఏడాది పొడవునా చార్‌ధామ్ యాత్రకు ఉయోగపడేలా రహదారుల నిర్మాణం, కర్ణ ప్రయాగ్, రిషికేశ్‌ల మధ్య రైల్వే లైను వంటి బీజేపీ ఎన్నికల హామీలు పని చేశాయి.
Manipur Election Results 2022
మణిపూర్ ( 60 ) | ||
---|---|---|
Party | Won | |
బీజేపీ | 32 | |
ఇతరులు | 11 | |
ఎన్‌పీపీ | 7 | |
కాంగ్రెస్ + | 5 | |
ఎన్‌పీఎఫ్ | 5 |
మణిపూర్‌లో బీరేన్ సింగ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై సీట్లలో విజయం లక్ష్యంగా అరవై స్థానాలున్న అసెంబ్లీకి పోటీ పడింది. దక్కింది 32 స్థానాలు మాత్రమే అయినప్పటికీ… సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, జేడీ(ఎస్), ఫార్వర్డ్ బ్లాక్‌లతో కూడిన కాంగ్రెస్ కూటమికి ఐదు స్థానాలు మాత్రమే లభించాయి. కేంద్రంలో బీజేపీ భాగస్వామి అయిన ఎన్‌పీపీ ఒంటరిగానే పోటీకి దిగి ఏడు స్థానాలు, జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్‌పీఎఫ్ ఇంకో ఐదు స్థానాలు గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సుస్థిర, శాంతియుతమైన ప్రభుత్వం అందించినందుకుగానూ మణిపూర్ ప్రజలు మరోసారి బీజేíపీకి పట్టం కట్టినట్లుగా చెప్పాలి.
Goa Election Results 2022
గోవా ( 40 ) | ||
---|---|---|
Party | Won | |
బీజేపీ | 20 | |
కాంగ్రెస్ + | 12 | |
ఇతరులు | 4 | |
ఆప్ | 2 | |
ఎంజీపీ | 2 |
నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బహుముఖ పోటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహా రాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోయి ఉండటం కలిసి వచ్చింది. మోజారిటీకి ఒక స్థానం తక్కువగా 20 స్థానాలు గెలుచు కుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 12, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోగా తృణమూల్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. బీజేపీయేతర పార్టీల్లో అనైక్యత ఫలితాలు ఎలా ఉంటాయో గోవా ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |