Telugu govt jobs   »   Economy   »   Important committees and Commissions in telugu

ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు | Important Committees and Commissions (In Telugu )

ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు | Important Committees and Commissions : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ఆర్ధిక శాస్త్రం పై అవగాహన తప్పనిసరి. అందులోను స్వాతంత్ర్యానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ | Indian Economy Before Independence ముఖ్యమైనది  కాబట్టి Adda247 తెలుగు లో ఆర్ధిక శాస్త్రం విభాగం లో కొన్ని అంశాలను ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ఆర్ధిక శాస్త్రం ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా  ఆర్ధిక శాస్త్రం లో ఉన్న ప్రతి అంశాలను మేము మీకు అందిస్తాము.  ముఖ్యమైన కమిటీలు గురించి తెలుసుకోడానికి పూర్తి ఆర్టికల్ ను చదవండి.

 

Economy – important Committees and Commissions- Introduction : ఆర్థిక రంగ కమిటీలు 

APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఎకానమీ విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.

 

Important Committees and their Chairman’s Complete list : 

దేశంలోని ‘భిన్నమైన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో, పారిశ్రామిక లైసెన్సింగ్, వర్తక వాణిజ్య విధానాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటికి పరిష్కారాన్ని సూచించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా కమిటీలను నియమించాయి. ఈ కమిటీలు సంబంధిత రంగాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. ప్రభుత్వం ఈ సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

Read more : India’s Ranks in Different Indices

భారతదేశంలో ఆర్ధిక రంగానికి సంబంధించి ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, వాటి చైర్మన్లు

  1. బంగారం దిగుమతులపై ఆర్బిఐ ఎసిండ్ – కె. యు.బి. రావు కమిటి
  2. రత్లో వాల్మార్ట్ పైరవీలపై దర్యాప్తు జరిపింది – ముకుల్ ముద్గల్ కమిటీ
  3. బీపీఎల్ కుటుంబాల గుర్తింపు కోసం ప్రణాళికా సంఘం నియమించింది – ప్రొఫెసర్ హషీం
  4. అవస్థాపన ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉద్దేశించింది – దీపక్ పరేఖ్ కమిటీ
  5. పెట్రోలియం సబ్సిడీలు – కేల్కర్ కమిటీ
  6. చక్కెర రంగం రంగరాజన్ కమిటీ
  7. పీఎస్ూల స్థితిగతులు – మోహన్ కమిటీ
  8. వ్యవసాయ కమతాల పన్ను- రాజ్ కమిటీ
  9. సంయుక్త రంగం ప్రతిపాదించింది – దత్ కమిటీ
  10. లీడ్ బ్యాంకును సిఫారసు చేసింది – నారీమన్ కమిటీ (1969)
  11. పన్నుల సంస్కరణలపై నియమించింది – రాజా చెల్లయ్య కమిటీ
  12. వ్యవసాయ ఆదాయంపై పన్ను రాజ్ కమిటీ (1972)
  13. వ్యాట్ను ప్రతిపాదించింది – రాజా చెల్లయ్య కమిటీ
  14. ఆర్ఆర్బీలను సిఫారసు చేసింది సరయు కమిటీ
  15. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ తారాపోర్
  16. చక్కెర ధరల డీరెగ్యులేషన్ – మహాజన్ కమిటీ
  17. బీమా సంస్కరణలు – మల్హోత్రా కమిటీ
  18. ఐఆర్డీఏ ఏర్పాటు – మల్హోత్రా కమిటీ
  19. బ్యాంకింగ్ రంగం- నరసింహం కమిటీ
  20. బొగ్గు రంగం – చారి కమిటీ
  21. సహకార రంగం బ్రహ్మప్రకాష్ కమిటీ
  22. జనాభా సమస్య – కరుణాకరన్
  23. మౌలిక సదుపాయాలు- రాకేష్ మోహన్
  24. చిన్న తరహా పరిశ్రమలు – అబిద్ హుస్సేన్ కమిటీ
  25. పారిశ్రామిక ఖాయిలా -మాలెగావ్ కమిటీ
  26. నేషనల్ షిప్పింగ్ పాలసీ -పింటో
  27. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిటీ – రంగరాజన్ (1992)
  28. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ – జి.వి. రామకృష్ణ (1996)
  29. పరోక్ష పన్నులపై కమిటీ – రేఖీ కమిటీ
  30. రైల్వేల ఆధునికీకరణ – శ్యాం పిట్రోడా
  31. ఎఫ్ఎఐ పరిమితులు అరవింద్ మయారాం
  32.  పట్టణ రవాణా – శ్రీధరన్ కమిటీ
  33. పీడీఎస్ ప్రక్షాళన నందన్ నీలేకని కమిటీ
  34.  సంస్థాగత వ్యవసాయ రుణాలు – సారంగి కమిటీ
  35.  రైల్వే భద్రత – అనిల్ కకోద్కర్ కమిటీ
  36.  అటవీ సంరక్షణ బి.ఎన్. కృపాల్ కమిటీ (2003)
  37. ఎంజీఎస్ఆర్ఆజీపీ ప్రాధాన్యతల మార్పు – మిహిర్ షా కమిటీ
  38. ఆధార్లో చెల్లింపులు – నందన్ నీలేకని కమిటీ
  39. వ్యవసాయ రుణ విధానం – ఆర్.వి. గుప్తా.
  40. చక్కెర పరిశ్రమ పునరుజ్జీవ పథకంపై కమిటీ – ఎస్.కె. టుటేజా
  41. సంపద పన్ను సిఫారసు కాల్డర్వ్య
  42. యం పన్ను – కాల్డర్, కృష్ణమాచారి
  43. పౌర విమానయానం నరేష్ చంద్ర
  44. వ్యవసాయ పరపతి – ఖుస్రో (1986)
  45. దిగుమతి కాల సంస్కరణలపై కమిటీ వీరమణి
  46. చమురు కంపెనీల పునర్వ్యవస్థీకరణ – వి.కృష్ణమూర్తి
  47. ఎంఓయూ – అర్జున్సేన్ గుప్తా
  48. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు – వాసుదేవన్ (1998)
  49. జౌళి చేనేత రంగం – సత్యం కమిటి
  50. కార్పొరేషన్ టాక్స్ – జాన్ మతాయ్ (1953-54)

Read more : Indian Economy Study Material

 

other Important Committees and their Chairman’s Complete list : 

భారతదేశంలో వివిధ వర్గాల వారికి అలాగా వివిధ సంస్థల పనితీరు మరియు వారి స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం నిత్యం అనేక సంస్థలను నియమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్ధిక, చట్టపరమైన అంశాలపై సూచనలకు వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఇలాంటి అనేక కమిటీలు మరియు కమీషన్లు ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైన వాటి వివరాలు మీకు క్రింది పట్టికలో అందించడం జరిగింది.

కమిటీ (లేదా) కమీషన్   చైర్మన్  కమిటీ ఏర్పడడానికి గల కారణం 
బల్వంతరాయి మెహతా కమిటీ బల్వంతరాయి మెహతా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
రాజమన్నార్ కమిటీ రాజమన్నార్ కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు
నరేష్ చంద్ర కమిటీ నరేష్ చంద్ర 49% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సూచన
జెఠ్మలానీ కమిటీ జెఠ్మలానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపన
వరదరాజన్ కమిటీ వరదరాజన్ తాజ్మహల్ పరిసర ప్రాంతాలలో కాలుష్యం పై కమిటీ
గుప్తా కమిటీ ఇంద్రజీత్ గుప్తా రాజకీయనాయకుల ఎన్నికల వ్యయాలపై కమిటీ
మషేల్కర్ కమిటీ మషేల్కర్ మేధో సంపత్తి హక్కుల అధ్యయన కమిటీ
ఖుస్రో కమిటీ ఎం. ఎం. ఖుస్రో వ్యవసాయ రుణాల పై కమిటీ
భేనర్జీ కమిటీ జస్టిస్ ఉమేష్ చంద్ర బెనర్జీ గోద్రా రైలు దుర్గటన
నరసింహం కమిటీ నరసింహం ఆర్ధిక రంగ సంస్కరణలు
ఎంపీ లాడ్స్ కమిటీ వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ఎంపీ లాడ్స్అవకతవకలపై విచారణ
మల్హోత్రా కమిటీ మల్హోత్రా భీమా రంగంలో సంస్కరణలు
ఖోస్లా కమిటీ కే.ఎన్. ఖోస్లా నాగార్జున సాగర్ నిర్మాణం
లిబర్హాన్ కమిటీ లిబర్హాన్ బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ
సోమశేఖర్ కమిటీ సోమశేఖర్ ఏలేరు రిసర్వాయర్ భూసేకరణ అవకతవకపై కమిటీ
నరసింహం కమిటీ నరసింహం upsc పరీక్ష విధానం పై కమిటీ
మోహన్ చందా కమిటీ మోహన్ చందా సహకార రంగంలో సంస్కరణలు
లక్డావాల కమిటీ లక్దావాలా పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికపై సూచనలు
అబిద్ హుస్సేన్ కమిటీ అబిద్ హుస్సేన్ చిన్నతరహా పరిశ్రమల స్థితి గతులపై విచారణ
ఎం.బీ.ఎన్.రావు కమిటీ ఎం.బీ.ఎన్.రావు దేశంలో మొదటి సారి మహిళల బ్యాంకు ఏర్పాటు పై సూచన
సురేష్ టెండూల్కర్ కమిటీ సురేష్ టెండూల్కర్ దేశంలోని పేదరిక అంచనా
శ్రీ కృష్ణ కమిటీ శ్రీ కృష్ణ సంయుక్త అంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోబం పై కమిటీ
ఎన్.కే.సింగ్ కమిటీ ఎన్.కే.సింగ్ FDI లపై సూచనలు
కే.సి.పంత్ కమిటీ కే.సి.పంత్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు
రంగరాజన్ కమిటీ రంగ రాజన్ జాతీయ భద్రతా బిల్లుపై సలహా కమిటీ
కేల్కర్ కమిటీ కేల్కర్ పన్నుల సంస్కరణ
రాజ్యంగ సమీక్ష కమీషన్ వెంకట చలమయ్య మనదేశ రాజ్యంగ సమీక్ష
కొఠారి కమీషన్ దౌలత్ సింగ్ కొఠారి ఉన్నత విద్యా ప్రమాణాలపై
ఫజల్ అలీ కమీషన్ ఫజల్ అలీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై కమీషన్
మండల కమీషన్ జస్టిస్. బి.పి. మండల్ వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్
సర్కారీయ కమీషన్ జస్టిస్ ఆర్. ఎన్. సర్కార్ కేంద్ర రాష్ట్ర సంబంధాల కమీషన్
పునర్విభజన కమీషన్ జస్టిస్ కుల్దీప్ సింగ్ అసెంబ్లీ , లోక్సభ నియోజక వర్గాల పునర్విభజన
ఎరాడి కమీషన్ ఎరాడి రావి, బియాస్ నదీ జలాల పంపిణీ
హంటర్ కమీషన్ హంటర్ జలియన్ వాలభాగ్ ఉదంతం పై అధ్యయనం

 

Economy Study Material in Telugu- Conclusion

పోటీ పరిక్షలలో ప్రతి అంశము చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆర్ధిక రంగం లో ప్రభుత్వం ఒక నిర్ణయం తెసుకోడానికి లేదా ఏదైనా ఒక విషయం గురిచి చర్చించడానికి కమిటీల ను ప్రభుత్వం నియమిస్తుంది. కావున పరిక్షలలో కమిటీలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ వ్యాసం లో మీకోసం మేము కొన్ని ముఖ్యమైన కమిటీలు అందించాము. మరిన్ని స్టడీ మెటీరియల్స్ కొరకు adda.com/te ను చూడండి.

Economy Study Material PDF in Telugu : FAQs

Q 1. Economy కోసం ఉత్తమమైన సమాచారం ఏమిటి?

జ. Adda247 అందించే Economy సమాచారం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో కూడా మీకు లభిస్తుంది.

Q 2. Economy కు సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

. ఆర్ధిక అంశాలకు సంబంధించిన ఇటివల సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి పరీక్షలోను తప్పనిసరిగా అడిగే కొన్ని అంశాలు, భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికలు, దేశంలో ఇప్పటికి వరకు జరిగిన వివిధ ఆర్ధిక సంస్కరణలు, నీతి ఆయోగ్, రాజ్యాంగంలో ఉన్న వివిధ ప్రభుత్వ ఆర్ధిక సంస్థల వివరాలు, జాతీయ ఆర్ధిక సర్వే యొక్క పుటం, రాష్ట్ర ఆర్ధిక సర్వే మరియు జాతీయ, రాష్ట్రీయ బడ్జెట్ పై పూర్తి అవగాహనా ఉండాలి.

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు | Important Committees and Commissions (In Telugu )_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు | Important Committees and Commissions (In Telugu )_60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.