Telugu govt jobs   »   Latest Job Alert   »   ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆగస్టు 10,...

ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆగస్టు 10, 11న, హైదరాబాద్ లో

ECIL లేదా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది షెడ్యూల్ A కేటగిరిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ, ECIL టెక్నికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని తన అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. ECIL 2023-24 టెక్నికల్ ఆఫీసర్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకి ECIL టెక్నికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అనేది ఒక మంచి శుభవార్త.  ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్ కి JTO అనేది ECIL నుంచి ఒక మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు సరిగ్గా సరిపోయే అభ్యర్థులు ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 కోసం తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించండి.

ఆగష్టు 2023 యొక్క ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ తేదీల జాబితా_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 అవలోకనం

ECIL నుంచి టెక్నికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆశక్తి గల అభ్యర్ధులు పూర్తి వివరాలను ఈ కధనం లో తెలుసుకుని ECIL రిక్రూట్మెంట్ 2023 నుండి వచ్చిన ECIL వాకిన్ ఇంటర్వ్యూ అవకాశాన్ని వదులుకోకండి.

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 అవలోకనం

రిక్రూట్‌మెంట్ అథారిటీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం ఖాళీలు 100
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం తేదీలు 07 ఆగస్టు 2023 నుండి 11 ఆగస్టు 2023 వరకు
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ద్వారా
అధికారిక వెబ్‌సైట్ https://www.ecil.co.in/
ఇంటర్వ్యూ ప్రదేశం కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ – 500062

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 ముఖ్యమైన తేదీలు

అన్ని ముఖ్యమైన ఈవెంట్‌ల తేదీలు దిగువ పట్టికలో ఉన్నాయి. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలను తప్పక గమనించాలి, తద్వారా వారు మౌఖిక పరీక్ష కి బాగా సన్నద్దమవ్వగలరు.

కార్యాచరణ ముఖ్యమైన తేదీలు
ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 07 ఆగస్టు 2023
ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ తేదీలు 10,11 ఆగస్టు 2023 (అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు)

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 నోటిఫికేషన్

ECIL లో గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీగా, ఇంజనీర్ల కోసం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL రిక్రూట్మెంట్ 2023 ని విడుదల చేసింది. అభ్యర్ధులు https://www.ecil.co.in/ కి వెళ్ళి నోటిఫికేషన్ ను తనిఖీ చేయవచ్చు, అభ్యర్ధుల సౌకర్యార్ధం నోటిఫికేషన్ pdf ను ఇక్కడ అందిస్తున్నాము. నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తేదీ, ప్రదేశం వంటివి పరిశీలించుకోవచ్చు.

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 నోటిఫికేషన్ PDF 

 

ECIL టెక్నికల్ ఆఫీసర్ 2023 ఇంటర్వ్యూ ప్రదేశం

ECIL టెక్నికల్ ఆఫీసర్ 2023 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం అభ్యర్ధులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రదేశానికి వాళ్ళు చెప్పిన సమయం ఉదయం 9 గంటలు దీని కంటే కనీసం ఒక గంట ముందుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి చేరుకోవాలి. ఇది మీ మనసు మరియు మిమ్మల్ని ఆ కొత్త ప్రదేశానికి అలవాటు పడేలా చేస్తుంది. ఇంటర్వ్యూ జరిగే చోటు ఈ దిగువన తెలియజేస్తున్నాము.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం  Interview held at 
కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ – 500062 Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062

ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అప్లికేషన్

ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ కి వెళ్ళే అభ్యర్ధులు తప్పని సరిగా ECIL రిక్రూట్మెంట్ 2023 లో ఇచ్చిన అప్లికేషన్ ను పూర్తిచేసి పట్టుకుని వెళ్ళాలి.  ECIL టెక్నికల్ ఆఫీసర్ అప్లికేషన్ లో అభ్యర్ధుల పూర్తి వివరాలు పూరించాలి ఇది వారి ఇంటర్వ్యూ లో సహాయపడుతుంది. మీ కోసం ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అప్లికేషన్ PDF ను ఇక్కడ అందిస్తున్నాము.

ECIL టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అప్లికేషన్ PDF

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 ఎంపిక విధానం

రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అభ్యర్ధుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఇది పూర్తయిన తర్వాతే అభ్యర్థులను ఇంటర్వ్యూ కి అనుమతిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మూల్యాంకనం చేస్తారు మరియు ఈ క్రింది ప్రమాణాల ప్రకారం తుది సిఫార్సులు విడుదలచేస్తారు.

వెయిటేజ్  మార్కులు 
విద్యార్హత ఇంజనీరింగ్‌లో మొత్తంలో 20% శాతం
అనుభవం 30 (సంవత్సరానికి 10 మార్కులు చొప్పున గరిష్టం గా 30 మార్కులు)
ఇంటర్వ్యూ 50 మార్కులు

ECIL టెక్నికల్ ఆఫీసర్ 2023 జీతం

మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, 3, 4వ సంవత్సరానికి నెలకు రూ.31,000 కన్సాలిడేటెడ్ మొత్తాన్ని పొందవచ్చు. ఎంపికైన అభ్యర్థి మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పీఎఫ్, టీఏ/డీఏ (అధికారిక విధుల్లో ఉన్నప్పుడు) మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం పెయిడ్ లీవ్ వంటి ఇతర ప్రయోజనాలకు కూడా పొందుతారు.

TS TET 2023 Paper-1 online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ECIL మౌఖిక పరీక్ష ఎక్కడ జరగనుంది?

ఆగస్టు 10, 11న, హైదరాబాద్ లో ECIL ఇంటర్వ్యూ జరగనుంది