రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత, పర్యావరణవేత్త డాక్టర్ తాళ్లవజ్జుల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ-2023 జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. చిన్న కధల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈయన రచించిన రామేశ్వరం కాకులు కి ఈ సాహిత్య అవార్డు లభించింది. 2024 మార్చి 12న న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్లోని కమానీ ఆడిటోరియంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద తామ్ర పతకం, లక్ష నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
పతంజలి శాస్త్రికి 9 కవితా సంకలనాలు, 6 నవలలు, 5 చిన్న కథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనం అవార్డు లభించాయి. ఆంధ్రప్రదేశ్ మడ అడవుల పరిరక్షణ కోసం ఈయన ఎంతో శ్రమించారు జనవరి 2017 నుంచి డిసెంబర్ 2021 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి పరిగణనలోకి తీసుకున్నారు, ఈ ఏడాది సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన 24 మందిలో పతంజలి శాస్త్రి ఒక్కరే తెలుగువారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |