ఇక డయల్ 100కే ఎస్‌వోఎస్ సందేశం, Dial 100 for SOS message
ఎస్‌వోఎస్ (సేవ్ అవర్ సోల్స్).. అత్యవసర సమయాల్లో తక్షణ సాయం పొందేందుకు సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉండే మీట ఇది. తెలంగాణ పోలీసుల ‘హాక్ ఐ’ అప్లికేషన్ ద్వారా ఇది ప్రజలకు మరింత చేరువైంది. ఈ మీట నొక్కితే వెంటనే ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందేలా ఈ యాప్‌లో సదుపాయం ఉండేది. ఇప్పటికే 29 లక్షల మంది వినియోగిస్తున్న హాక్ ఐ యాప్‌లో త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నేరుగా డయల్ 100 కేంద్రానికే సమాచారం చేరేలా మార్పు చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు వేగంగా సహాయం అందే అవకాశం రానుంది. దిల్లీ పోలీసుల ‘లాస్ట్ రిపోర్ట్’ యాప్ తర్వాత దేశంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న పోలీస్ యాప్ ‘హాక్ ఐ’.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************