Telugu govt jobs   »   Latest Job Alert   »   Decoding EMRS Hostel Warden Answer Key

Decoding EMRS Hostel Warden Answer Key | డీకోడింగ్ హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ

హాస్టల్ వార్డెన్ యొక్క 669 ఖాళీల కోసం OMR ఆధారిత పరీక్ష డిసెంబర్ 2023లో  నిర్వహించారు. ఏకలవ్య మోడ్రన్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023ని 03 జనవరి 2024న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఆన్సర్ కీ ని ఉపయోగించుకోవచ్చు. పరీక్షలో వారి పనితీరును విశ్లేషించడానికి మరియు వారి ఫలితాలను అంచనా వేయడానికి EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023 ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కధనం లో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, వర్గాల వారీగా కట్ ఆఫ్ వివరాలు వంటి ఎన్నో అంశాలు తెలుసుకోండి.

EMRS హాస్టల్ వార్డెన్ జవాబు కీ

EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023 సహాయంతో, హాస్టల్ వార్డెన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ యొక్క మొదటి దశ అయిన వ్రాత పరీక్షలో అభ్యర్థులు తమ పనితీరు గురించి తెలుసుకుంటారు. EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ గురించి పూర్తి సమాచారం ఈ కధనంలో తెలుసుకోండి.

EMRS హాస్టల్ వార్డెన్ జవాబు కీ

EMRS హాస్టల్ వార్డెన్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్_30.1APPSC/TSPSC Sure shot Selection Group

EMRS హాస్టల్ వార్డెన్ 2023 కట్ ఆఫ్

EMRS హాస్టల్ వార్డెన్ 2023 పరీక్ష మొదటి దశ ఆన్సర్ కీ విడుదలైంది అభ్యర్ధులు తమ ఆన్సర్ కీ ద్వారా వచ్చిన మార్కులను అంచనా వేసుకుంటారు. ఆన్సర్ కీ లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నిర్ణీత సమయం లోపు తెలపాలి. EMRS హాస్టల్ వార్డెన్ 2023 పరీక్ష కట్ ఆఫ్ వివిధ ప్రమాణాల పై ఆధార పదిడి ఉంటుంది, అవి పరీక్ష రాసిన అభ్యర్ధుల సంఖ్య, పోస్ట్ ల సంఖ్య, అత్యధిక మార్కులు సాధించిన వారి సంఖ్య, విభాగాల వారీగా పరీక్ష రాసిన అభ్యర్ధుల సంఖ్య వంటివి ఉన్నాయి. మా నిపుణుల అంచనా మేరకు వివిధ అభ్యర్ధుల మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని తెలుసుకోండి.

EMRS హాస్టల్ వార్డెన్ 2023 కట్ ఆఫ్ అంచనా

దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్ధులు EMRS హాస్టల్ వార్డెన్ 2023 పరీక్షని రాశారు, పరీక్ష రాసిన అభ్యర్ధులు కట్ ఆఫ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఆన్సర్ కీ విడుదల ద్వారా కట్ ఆఫ్ ని అంచనా వేయవచ్చు. మా నిపుణుల బృందం EMRS పరీక్ష కీ విడుదలైన తర్వాత విభాగాల వారీగా EMRS హాస్టల్ వార్డెన్ 2023 అంచనా కట్ ఆఫ్ ని అంచనా వేశారు. ఈ కింద పట్టిక ద్వారా అంచనా వేయబడిన EMRS హాస్టల్ వార్డెన్ 2023 కట్ ఆఫ్ తెలుసుకోండి

వర్గం పురుషులు  మహిళలు 
UR 89-95 80-84
OBC 84-88 78-82
SC 70-74 67-69
ST 71-76 70-72
EWS 81-84 79-82

EMRS హాస్టల్ వార్డెన్ 2023 అంచనా కట్ ఆఫ్ ఆ విభాగంలో మార్కులు సాధించిన అభ్యర్ధుల ఆధారంగా రూపొందించినది EMRS హాస్టల్ వార్డెన్ తుది కీ విడుదలైన తర్వాత కట్ ఆఫ్ మార్కులలో కొంత వ్యత్యాసం ఉంటుంది.

EMRS క్వాలిఫైయింగ్ మార్కులు 2023

EMRS 2023 పరీక్ష కీ సంభందించి క్వాలిఫైయింగ్ మార్కులు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ EMRS హాస్టల్ వార్డెన్ 2023 పరీక్ష అర్హత మార్కులను త్వరలో విడుదల చేస్తుంది. ఏదేమైనప్పటికీ, EMRS TGT PGT, హాస్టల్ వార్డెన్ పరీక్ష 2023 లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలి అంటే అభ్యర్థులు కనీసం 70% పైన మార్కులను సాధించాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ మార్కులు పరీక్ష తుది ఫలితాల తర్వాత విడుదలవుతాయి.

EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఫైనల్ కీ

EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఆన్సర్ కీ 3 జనవరి 2024 న విడుదలైంది మరియు ఆన్సర్ కీ లో అభ్యర్ధులు తెలిపిన అభ్యంతరాల ఆధారంగా వాటిని అధికారులు పరిశీలించి మార్పులు ఉంటే సరిచేసి EMRS హాస్టల్ వార్డెన్ ఫైనల్ కీని విడుదల చేస్తారు. అంచనా ప్రకారం జనవరి 20న EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఫైనల్ కీ విడుదలయ్యే అవకాశం ఉంది. EMRS హాస్టల్ వార్డెన్ తుది కీ ని ప్రామాణికం చేసుకుని కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. EMRS హాస్టల్ వార్డెన్ తుది కీ లో ప్రశ్నలు మరియు జవాబులలో ఏదైన మార్పులు అభ్యర్ధులు తెలిపిన అభ్యంతరాల ఆధారంగా, తప్పుడు కీ ని సరి చేసి తుది కీ విడుదల చేస్తారు.

EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఫైనల్ కీ (త్వరలో విడుదలవుతుంది)

EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఫలితాలు

EMRS హాస్టల్ వార్డెన్ 2023 పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. తాజాగా EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఆన్సర్ కీ కూడా విడుదలైంది దాని పై ఉన్న అభ్యంతరాలను పరిశీలించి త్వరలోనే ఫలితాలను కూడా విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే మేము కింద లింకు ని అందిస్తాము

EMRS హాస్టల్ వార్డెన్ 2023 ఫలితాలు (త్వరలో విడుదలవుతుంది)

EMRS కట్ ఆఫ్ 2023ని ఎలా తనిఖీ చేయాలి?

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS)కి బాధ్యత వహిస్తుంది, EMRS అధికారిక కట్ ఆఫ్ 2023ని ఇంకా విడుదల చేయలేదు. తాజాగా ఆన్సర్ కీ విడుదలైంది దీని తర్వాత EMRS కట్ ఆఫ్ 2023 ప్రకటన చేస్తుంది. EMRS కట్ ఆఫ్ మార్క్స్ 2023ని ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి అభ్యర్థులు కింది దశలను పాటించండి.

  • EMRS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://emrs.tribal.gov.in/.
  • వెబ్‌సైట్‌లో “ఫలితాలు” విభాగం కోసం చూడండి. ఈ విభాగం హోమ్‌పేజీలో లేదా నిర్దిష్ట మెనులో ఉండవచ్చు.
  • మీరు “ఫలితాలు” విభాగంలోకి వచ్చిన తర్వాత, “EMRS కట్ ఆఫ్ 2023″కి సంబంధించిన నిర్దిష్ట లింక్ లేదా నోటిఫికేషన్ కోసం చూడండి.
  • వెబ్‌సైట్ మీ వర్గం (జనరల్, SC, ST, OBC, EWS) మరియు ప్రాంతాన్ని ఎంచుకోమని మిమ్మల్ని అడగవచ్చు.
  • సంబంధిత కట్-ఆఫ్ మార్కులను యాక్సెస్ చేయడానికి తగిన ఎంపికలను ఎంచుకోండి.
  • వెబ్‌సైట్ వివిధ వర్గాలు మరియు ప్రాంతాల కోసం కట్-ఆఫ్ మార్కులను ప్రదర్శిస్తుంది.
  • మీరు భవిష్యత్తు సూచన కోసం కట్-ఆఫ్ మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా వాటిని నేరుగా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 

AP and TS Mega Pack (Validity 12 Months)

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023 విడుదలైందా?

EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023 03 జనవరి 2023న emrs.tribal.gov.inలో విడుదల చేయబడింది.

EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023కి పై అభ్యంతరాలు తెలపవచ్చా?

అవును, అభ్యర్థులు EMRS హాస్టల్ వార్డెన్ ఆన్సర్ కీ 2023పై అభ్యర్థనలను తెలిపే అవకాశం ఉంది కానీ నిర్ధిష్ట సమయ వ్యవధిలోగా దీనిని వినియోగించుకోవాలి.

EMRS హాస్టల్ వార్డెన్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు?

EMRS హాస్టల్ వార్డెన్ కట్ ఆఫ్ అనేది వివిధ ప్రమాణాల మీద ఆధార పడి ఉంటుంది కావున అభ్యర్ధుల అంచనా కోసం కట్ ఆఫ్ వివరాలు ఈ కధనం లో అందించాము.