యాసంగిలో వంద శాతం సాగు, తెలంగాణ వ్యవసాయ శాఖ తాజా నివేదిక, 100 percent cultivation in Yasangi, latest report of Telangana Agriculture Department :
• సాగు లక్ష్యం 46 లక్షల ఎకరాలు… వ్యవసాయ శాఖ తాజా నివేదిక
ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్లో పంటల సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరింది. అన్ని రకాల పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 46.19 లక్షల ఎకరాలకు గాను బుధవారానికి 46.26 లక్షల ఎకరాల్లో వేశారని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభు త్వానికి తాజాగా నివేదించింది. ఈ సీజన్ గడువు ముగిసే నాటికి పంటలు సాగు సాధా రణ విస్తీర్ణానికి మించిపోవచ్చని అంచనా. ఈ సీజన్లో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పినా రైతులు 30.87 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి వరి 48.88 లక్షల ఎకరాల్లో సాగు అయిందని, ఈ సారి 17 లక్షల ఎకరాల వరకు తగ్గిందని వ్యవసాయ శాఖ తెలిపింది. మొక్కజొన్న, పెసర తప్ప మిగి లిన పంటలన్నీ సాధారణంకన్నా ఎక్కువ విస్తీ ర్ధంలో వేయడం గమనార్హం. పప్పుధాన్యాలు. సాధారణంకన్నా 41 శాతం, ఆహారధాన్యాలు 3, నూనెగింజలు 17 శాతం అదనపు విస్తీర్ణంలో వేశారు. వరికి బదులు మొక్కజొన్న చాలా ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టినా రైతులు పట్టించుకోలేదు.
మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 4.22 లక్షలకు గాను 4.02 లక్షల ఎకరాల్లో వేయడం గమ నార్హం. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నందున వాటి కింద ఎక్కువగా వరి నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాజధాని: హైదరాబాద్;
- తెలంగాణ గవర్నర్: తమిళిసై సౌందరరాజన్;
- తెలంగాణ ముఖ్యమంత్రి: కె. చంద్రశేఖర రావు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************