Telugu govt jobs   »   Current Affairs   »   CM to Inaugurate Horti' University in...

CM to Inaugurate Horti’ University in Rayalaseema | రాయలసీమలో ఉద్యాన యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం

CM to Inaugurate Horti’ University in Rayalaseema | రాయలసీమలో ఉద్యాన యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం
రాయలసీమ జిల్లా లో సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు వై.ఎస్.ఆర్ ఉద్యాన వర్సిటీ పరిధిలో వెంకటరామన్న గూడెం, పార్వతిపురం, ఆనంతరాజుపేట, చిన్నాలతరపి ఊర్లల్లో నాలుగు ప్రభుత్వ కళాశాలను ప్రారంభించనున్నారు, అనంతరం అనంతపురం, తాడిపత్రి, విఎస్ పురం, మార్కాపురంలలో  నాలుగు అనుబంధ కళాశాలలను కూడా ప్రారంభిస్తారు అన్నీ కళాశాలల్లో బీఎస్సి హర్టీకల్చర్ కోర్సు ఉంటుంది. ఈ నూతన కళాశాలల వలన 520 ప్రభత్వ కళాశాల సీట్లు, 200 ప్రైవేట్ కళాశాల సీట్లు అందుబాటులోకి వస్తాయి. నూతనంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ కళాశాలల కోసం ప్రభత్వం నుంచి 110కోట్లు నిధులు మంజూరు చేశారు వీటితో లేబొరేటరి, హాస్టల్ భవనాలు, సిబ్బంది వసతి గృహాలు వంటివి నిర్మించనున్నారు. కళాశాల సిబ్బంది కోసం త్వరలోనే APPSC ద్వారా నియామక సిబ్బందిని భర్తీ చేయనున్నారు. పులివెందులలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (APCARL) కళాశాల ని కూడా ప్రారంభించనున్నారు.
వై.ఎస్.ఆర్ జిల్లాలో ఇప్పటికే ఉన్న ఉద్యాన కళాశాలకి అదనంగా పులివెందులలో మరొక ఉద్యాన కళాశాలని ప్రభుత్వం మంజూరు చేసింది ఈ చర్యలతో ఉద్యాన పంటల హబ్ గా పులివెందుల రూపుదిద్దుకోనుంది.

Sharing is caring!