Cannes Semiconductors to invest Rs 2800 crore in Telangana | కేన్స్ సెమీ కండక్టర్స్ తెలంగాణా లో 2800కోట్లు పెట్టుబడి పెట్టనుంది
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కార్నింగ్, ఫాక్స్కాన్ వంటివి ఇప్పటికే తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాయి ఆ కోవలోనే ఇప్పుడు కేన్స్ టెక్నాలజీస్ రంగారెడ్డి జిల్లాలో కొంగరకలాన్ ప్రాంతంలో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. 2800 కోట్లతో ఏర్పాటు అయ్యే ఈ పరిశ్రమ తెలంగాణ లో ఏర్పాటు కావడం విశేషం అని మంత్రులు తెలిపారు. మంత్రి KTR సమక్షంలో కంపెనీ ఎండి రమేశ్కన్నన్ మరియు IT ముఖ్య కార్యదర్శి ఒప్పందం పై సంతకాలు చేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ తో తెలంగాణ లో ఏర్పాటు అయ్యే పరిశ్రమ యువతకి 2000 పైగా ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వచ్చే మూడేళ్లలో ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులను ఇతర దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి పరిశ్రమని అభివృద్ధి చేస్తాము అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశం లోనే అతి పెద్ద పరిశ్రమ తెలంగాణ లో ఏర్పాటు చేశామని దానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకరించింది అని తెలిపారు. అలాగే ప్యాకేజీ పరిశోధన కోసం IIT బాంబే సహకారంతో కేన్స్ సెమికాన్ పరిశోధన కూడా ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు వలన దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు భారతదేశంలో సెమీకండక్టర్ తయారీకి తెలంగాణను ప్రధాన కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఇది నిదర్శనం.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |