తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్ కౌన్సిల్ ఒప్పందం ,British Council Agreement with the Government of Telangana :
- నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, సాంస్కృతిక మార్పిడిపై పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్ కౌన్సిల్ హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్‌లు దీనిపై సంతకాలు చేశారు.
- హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, హైదరాబాద్ ఆవిష్కరణ, పరిశోధన మండలి (రిచ్) డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
- జయేశ్‌రంజన్ మాట్లాడుతూ యువత, ఆవిష్కర్తలు, విద్యార్థులు, నిపుణులు, వ్యవస్థాపకులు, కళాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్రిటిష్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి : కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ : తమిళిసై సౌందరరాజన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
