Telugu govt jobs   »   జీవ శాస్త్రం- విటమిన్లు

Biology- Vitamins Study Material for TSPSC, TS DSC & SSC Exams | జీవశాస్త్రం విటమిన్లు స్టడీ మెటీరీయల్ TSPSC గ్రూప్స్, TS DSC మరియు ఇతర పోటీ పరీక్షల కోసం

మనిషి నిర్మాణంలో విటమిన్లకి చాలా ప్రాధాన్యత ఉంది, విటమిన్లని తరచూ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడి అని పిలుస్తారు. 1912లో, కాసిమిర్ ఫంక్ శాస్త్రవేత్త “విటమిన్” అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించాడు. మనిషి ఆహారంలో అతి తక్కువ మోతాదులో అవసరమయ్యే కర్బన పోషకాలు విటమిన్లు. విటమిన్ల వలన శక్తి విడుదలవ్వదు.

మానవ శరీరానికి ప్రాధమికంగా నిర్మాణనంలో 13 విటమిన్లు ఉపయోగపడతాయి. విటమిన్లు రెండు రకాలుగా వర్గీకరించారు అవి: నీటిలో కరిగేవి, మరియు కొవ్వు లో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E, మరియు K) కొవ్వు పదార్ధాలలో కరిగిపోతాయి మరియు మానవ శరీరంలో నిల్వ చేయబడతాయి. నీటిలో కరిగే విటమిన్లు C మరియు B-కాంప్లెక్స్ విటమిన్లు (విటమిన్లు B6, B12, నియాసిన్, రిబోఫ్లావిన్ మరియు ఫోలేట్ వంటివి) శరీరం వీటిని గ్రహించే ముందు నీటిలో కరిగిపోతాయి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

జీవశాస్త్రం విటమిన్లు

మానవ శరీరానికి విటమిన్లు శరీర నిర్మాణంలో ఉపయోగపడతాయి. మొత్తం 13 విటమిన్ల గురించి అనగా విటమిన్ ఎ, డి, ఇ, కె, బి కాంప్లెక్స్ మరియు సి మరియు వాటి లోపాల గురించి ఈ కధనం లో పూర్తి సమాచారం తెలుసుకొండి. TSPSC నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు లేదా DSC, TET, తో పాటు ఇతర రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పరీక్షలకి ఉపయోగపడే సమగ్ర సమాచారం ఈ కధనంలో అందించాము.

విటమిన్ – ఎ

విటమిన్-ఎ యొక్క రసాయన నామం రెటినాల్ మరియు సాధారణ నామం జీరాఫ్తాల్మియా. విటమిన్ ఎ వలన ఆరోగ్యకరమైన దృష్టికి తోడ్పడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే కంటిలోని కార్నియా దెబ్బతిని జీరాఫాల్మియా సంభవిస్తుంది. మరియు విటమిన్ ఎ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన కళ్ళకి సంభందించిన వ్యాదులు రాకుండా ఉంటాయి. విటమిన్ ఎలభించే పదార్ధాలు: క్యారెట్, పసుపు రంగులో ఉన్న పండ్లు, నారింజ, సొరచేప కాలేయం నూనె, ఆకుకూరలు, జంతువుల కాలేయంలో ఎక్కువగా లభిస్తుంది. శాకాహారంలో ఇది బీటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది. పేగులోని సూక్ష్మజీవులు దీన్ని రెటినాల్ గా మారుస్తాయి.

విటమిన్ ఎ లోపిస్తే కనిపించే లక్షణాలు:

  • నైట్ బ్లైండ్ నెస్, కళ్లు పొడిబారడం
  • పొడి చర్మం
  • కడుపు అసౌకర్యం
  • పేలవమైన వృద్ధి
  • బలహీనమైన ఎముకలు మరియు దంతాలు.

విటమిన్ బి లో వివిధ రకాలు ఉన్నాయి అవి బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 మరియు బి17

విటమిన్ – బి1

విటమిన్ బి1 యొక్క రసాయన నామం థయమిన్. దీనినే బెరిబెరి నిరోధక విటమిన్ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా శక్తి విడుదల, నాడీవ్యవస్థ, రక్తప్రసరణ అభివృద్ధి వ్యవస్థకు తోడ్పడుతుంది. దీనిలోపం వలన బెరిబెరి వ్యాధి కలుగుతుంది. విటమిన్ బి1 లభించే పదార్ధాలు పొట్టు తీయని అన్ని రకాల ధాన్యాలు, మాంసంలో లభిస్తుంది.

విటమిన్ – బి2

విటమిన్ బి2కి మరో పేరు ఎల్లో ఎంజైమ్. ఇది ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాల జీవక్రియలో పాల్గొంటుంది. ఇది లోపించడం వలన అరిబోఫ్లెవినోసిస్ అనే వ్యాధికి గురవుతారు. నోటి అంచున పగుళ్లు ఏర్పడటం నాలుక వాపు (గ్లోసైటిస్) ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. విటమిన్ బి2 లభించే పదార్ధాలు:  పాలు, పాల ఉత్పత్తులు, గుడ్ల పచ్చసొన ఎండు ఫలాలు, కూరగాయలు, మాంసంలో లభిస్తుంది.

విటమిన్ – బి3

విటమిన్ బి3 యొక్క రసాయన నామం నియాసిన్. నికోటినిక్ యాసిడ్ లేదా నికోటినమైడ్ అని కూడా పిలుస్తారు. ఇది పెల్లగ్రా నిరోధక విటమిన్. ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ, చర్మం, జీర్ణక్రియలో ఇది సహాయపడుతుంది. దీని లోపం వలన పెల్లగ్రా అనే వ్యాధి సంభవిస్తుంది. చర్మం ఎర్రగా కందడం(డెర్మటైటిస్), నీళ్ల విరేచనాలు (డయేరియా), మతిమరుపు (డెమెన్షియా) ఈ వ్యాధి లక్షణాలు.  విటమిన్ బి3 లభించే పదార్ధాలు: మాంసం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు.

విటమిన్ – బి5

విటమిన్ బి5 శాస్త్రీయ నామం పాంటోథెనిక్ యాసిడ్ అని పిలుస్తారు. కో ఎంజైమ్-ఎ గా వ్యవహరిస్తుంది. కొలెస్ట్రాల్, న్యూరోట్రాన్సమీటర్ల ఉత్త- విడుదలకు విటమిన్-బి5 ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే అరికాళ్లలో మంటలు లేదా బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ బి5 లభించే పదార్ధాలు: మాంసం, గుడ్లు, బ్రెడ్.

విటమిన్ – బి6

విటమిన్ బి6 ని పైరిడాక్సిన్ లేదా పైర్డాక్సల్ ఫాస్ఫేట్ అని పిలుస్తారు. ఈ విటమిన్ల వలన ప్రొటీన్  జీవక్రియ మెరుగవుతుంది. ఇది లోపిస్తే చర్మం పొడిబారిపోతుంది మరియు నీరసానికి గురవుతారు. మార్నింగ్ డిసీజ్ అనే వ్యాధి సంభవిస్తుంది. ఈ విటమిన్ లభించే పదార్ధాలు: మాంసం, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, బాదం.

విటమిన్-బి7

విటమిన్ బి7 ని విటమిన్ -హెచ్ లేదా బయోటిన్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా శక్తి విడుదల, అమైనో ఆమ్లాలు, గ్లైకోజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ విటమిన్ ని పేగులోని సూక్ష్మజీవులు అందిస్తాయి. ఉడికించని గుడ్డు తెల్లసొనలో ఎవిడిన్ అనే పదార్థం బయోటిన్ వినియోగాన్ని అడ్డుకుంటుంది.

విటమిన్ బి9

విటమిన్ బి9 కి మరో పేరు ఫోలిక్ యాసిడ్.  ఇది ఎర్రరక్తకణాల పరిపక్వత, హీమోగ్లోబిన్ తయారీలో ఉపయోగపడుతుంది. గర్భాశయంలో పిండం అభివృద్ధికి, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే మెగాలో బ్లాస్టిక్ లేదా మ్యాకోస్టిక్ అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భిణుల్లో ఇది తీవ్రంగా లోపిస్తే పుట్టబోయే పిల్లల్లో స్పెనా బిఫిడా అనే మానసిక వైకల్యంతో జన్మిస్తారు. ఈ విటమిన్ లభించే పదార్ధాలు: స్ట్రాబెర్రీ, టమాట, కాలిఫ్లవర్, అరటి, క్యాబేజి, పాలకూర, నారింజ.

విటమిన్-బి12

ఈ విటమిన్ ని సైనోకోబాలమిన్ అని కూడా అంటారు. ఎర్రరక్తకణాల పరిపక్వత, హీమోగ్లోబిన్ తయారీలో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే పెర్నిసియస్ అనీమియాకి గురవుతారు. ఈ విటమిన్ లభించే పదార్ధాలు: మాంసాహారం, గుడ్లు, పాలు, మాంసాహారం మరియు ఇది మొక్కల్లో లభించని విటమిన్.

విటమిన్-బి17

బి17 అనేది విటమిన్ కాదు కానీ దీనిని యాంటీ కాన్సర్ విటమిన్ అని అంటారు. మొక్కలలో కాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్న రసాయనాన్ని బి17 అని అంటారు.

విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆమ్లం)

విటమిన్ సి అనేది స్కర్వి వ్యాధి నిరోధక విటమిన్. బలమైన చిగుళ్లకు, నోటి ఆరోగ్యానికి ఇది అవసరం. సిట్రస్ పండ్లు(నారింజ, ద్రాక్షపండు, నిమ్మ), స్ట్రాబెర్రీ, నల్ల ఎండుద్రాక్ష, కివి పండు, టమోటా, ఆకుపచ్చ ఆకు కూరలు, పచ్చి మిరియాలు.

ఈ విటమిన్ లోపించడం వలన కలిగే వ్యాదులు:

  • స్కర్వి
  • చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం, దంతాలు పడిపోవడం
  • చర్మ రక్తస్రావం, కేశనాళిక నాళాల పేలుడుకు గ్రహణశీలత
  • బలహీనత, అలసట
  • ఎముక నొప్పి, వాపు మరియు నొప్పి కీళ్ళు

విటమిన్-డి

దీని రసాయన నామం కాల్సిఫెరాల్. దీన్నే రికెట్స్ నిరోధక విటమిన్/ సన్ లైన్ విటమిన్ అని కూడా అంటారు. బలమైన ఎముకలు, దంతాలకు ఇది ఎంతో సహాయపడుతుంది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫరస్, జీవక్రియలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్ వ్యాధి సంభవిస్తుంది. ఎముకలు బలహీనపడి, వంకరలు తిరిగడం రికెట్స్ వ్యాధి లక్షణం. పెద్దల్లో ఆస్టియోమలేసియా వ్యాధికి గురవుతారు. ఈ విటమిన్ లభించే పదార్ధాలు: శాకాహారంలో ఇది లభించదు. పాలు, గుడ్లు, కాడ్ చేప కాలేయం నూనె, జంతువుల కాలేయం, పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఆభిస్తుంది.

విటమిన్ – ఇ

విటమిన్ ఇ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. దీన్ని బ్యూటీ విటమిన్ లేదా వంధ్యత్వ నిరోధక విటమిన్ అంటారు. స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై ఇది ప్రభావం చూపుతుంది. దీని వలన ప్రకాశవంతమైన చర్మం లభిస్తుంది. ఇది లోపిస్తే పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది, మహిళల్లో గర్భస్రావం జరుగుతుంది. ఇది లభించే పదార్ధాలు: పండ్లు, కూరగాయలు, బాదం, పిస్తా, చేపలు, మాంసం, చేప నూనె, కాలేయం.

విటమిన్ – కె

విటమిన్ కె యొక్క రసాయన నామం ఫిలోక్వినోన్ లేదా మెనాక్వినోన్. ఇది రక్తస్రావం ని నిరోధిస్తుంది అందుకే దీనిని రక్త నిరోధక విటమిన్ అని కూడా అంటారు. రక్తంగడ్డ కట్టే ప్రక్రియలో అనుబంధ రక్తస్కంధన కారకంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడం లో సమయం పడుతుంది. ఇది లభించే ఆహార పదార్ధాలు: కాలిఫ్లవర్, క్యాబేజి, ఆకుకూరలు, కాలేయం, మూత్రపిండాలు దీనిని తయారు చేస్తాయి.

ఒక విటమిన్ లేదా విటమిన్ లోని ఒక భాగం లేదా విటమిన్ నుంచి ఏర్పడిన ఉత్పాదకం సహ ఎంజైమ్ గా  వ్యవహరిస్తూ రసాయనిక చర్యలో పలు పంచుకుని ఎంజైమ్ కి దాని ప్రక్రియలో సహాయపడతాయి.

విటమిన్లు వాటి శాస్త్రీయ నామం మరియు లోపం

విటమిన్లు వాటి శాస్త్రీయ నామం మరియు అవి లోపిస్తే సంభవించే వ్యాదులు గురించి ఈ దిగువన పట్టికలో అందించాము

విటమిన్ శాస్త్రీయ నామం  లోపం 
రేటినోల్ రే చీకటి,

నేత్ర శుష్కత (కంటి శుక్లపటలములో తడి తగ్గిపోవుట)
బి1 థయామిన్ (బెరీ బెరీ ) పాలీన్యూరిటిస్, (పిల్లల్లో) ఛాతీ లో నీరు నిండటం, (పెద్దల్లో) చర్మం పొడి బారటం
బి2 రైబోఫ్లావిన్ అరిబోఫ్లావినోసిస్‌, పెదాలు, చర్మం పగలడం
బి3 నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ లేదా నికోటినమైడ్ పేలగ్రా, మతిమరపు, డయేరియా డెర్మటైటిస్
బి5 పాంటోథెనిక్ యాసిడ్ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్
బి6 పైరిడాక్సిన్/ పైర్దాక్సల్ ఫాస్ఫేట్ చర్మ సంభందిత వ్యాదులు, మార్నింగ్ డీసీజ్
బి7 బయోటిన్, విటమిన్ హెచ్ జుట్టు రాలడం, మతిమరపు రక్త హీనత
బి12 సైనో కోబాలమిన్, రక్త హీనత, పేర్నిసియస్
సి ఆస్కార్బిక్ ఆమ్లం చిగుళ్ళ నుండి రక్తం కారడం, వాయడం,  స్కర్వీ
D కాల్సిఫెరాల్ 1. పిల్లల్లో → రిక్కెట్స్ 2. పురుషుల్లో Osteomalacia → ఆస్టియోమలాసియా

3. స్త్రీలలో → ఆస్టియోపొరొసిస్

టోకోఫెరోల్

 

 

]పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం

 

కె ఫైలోక్వినోన్

 

రక్తం గడ్డకట్టకపోవడం

Mission RRB 2024 | Complete Live Batch for RRB Technician (Gr1 & Gr3) & ALP (CBT -1 & CBT2) | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!