Biliti Electric to set up world’s largest electric 3-wheeler Manufacturing Facility in Telangana : The California-based Biliti Electric company will set up the factory with a production capacity of 2,40,000 electric vehicles each year in India’s Telangana state.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న యూఎస్ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ తెలంగాణ రాష్టంలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తొలి దశ వచ్చే ఏడాది, రెండవ దశ 2024 నాటికి పూర్తి కానుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లు. ఇది కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన తయారీలో ప్రపంచంలో అతి పెద్ద ప్లాంటు కానుంది. 200 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ కేంద్రం కోసం సుమారు రూ.1,144 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఏప్రిల్ 19న కంపెనీ తెలిపింది. టాస్క్‌మన్ కార్గో, అర్బన్ ప్యాసింజర్ వాహనాలను ప్లాంటులో తయారు చేస్తారు. బిలిటీ వాహనాల తయారీ భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన గయమ్ మోటార్ వర్క్స్ వ్యవహరిస్తోంది.
భారత్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు:
వచ్చే మూడేళ్లలో భారత్‌లో 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు టెస్లా పవర్ యూఎస్‌ఏ వెల్లడించింది. పవర్ యాజ్ ఏ సర్వీస్ (పాస్) కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ఏప్రిల్ 18న సంస్థ చైర్మన్ జాన్ హెచ్ రట్సినస్ తెలిపారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
