Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC OTPR Complete Registration Process &...

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password | APPSC OTPR రిజిస్ట్రేషన్ మరియు పాస్వర్డ్ పొందే ప్రక్రియ తెలుసుకోండి

APPSC OTPR రిజిస్ట్రేషన్ 2024: APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో నియామక ప్రక్రియ కోసం వివిధ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ (APPSC OTPR)ని అందిస్తుంది. ఈ APPSC OTPRతో, అభ్యర్ధులు APPSC విడుదల చేసే వివిధ నియమకాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పరీక్ష తేదీలు, ఉద్యోగ నోటిఫికేషన్‌లు మరియు ఇతర సాధారణ నవీకరణలను అధికారిక వెబ్ సైటు నుండి తనిఖీ చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లు అప్‌డేట్ అయిన వెంటనే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ కధనం లో APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే విధానం తెలుసుకోండి.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC OTPR Registration procedure for new user

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరిక్ష లకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్ధులు ఈ కింద తెలిపిన దశలను పాటించి OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. APPSC పరీక్షలకి OTPR రిజిస్ట్రేషన్ చేసుకోడానికి అభ్యర్ధుల కోసం దిగువన చిత్రాల ద్వారా రిజిస్ట్రేషన్ విధానాన్ని అందించాము.

దశ1: ముందుగా అభ్యర్ధులు APPSC అధికారిక వెబ్సైటు https://appsc.aptonline.in/Default.aspx ని తనిఖీ చేయండి. మొదటి పేజీ లో ONE TIME PROFILE REGISTRATION పై క్లిక్ చేయండి. కింద దిగువన చిత్రం లో చూపించిన యారో మార్క్ చూపిన దగ్గర క్లిక్ చేయండి.  మీరు తదుపరి పేజీ కీ మళ్లించబడతారు.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_4.1

దశ2: అభ్యర్ధులు APPSC OTPR రిజిస్ట్రేషన్ లో రెండవ భాగానికి లేదా నియామక ప్రక్రియ కీ దరఖాస్తు చేసుకోడానికి ఈ పేజీ లో DIRECT RECRUITMENT అనే చేవతే PLEASE CLICK HERE FOR REGISTRATION దగ్గర క్లిక్ చేయండి. ఈ దిగువన చూపించిన పేజీ లో యారో మార్క్ చూపించిన చోట క్లిక్ చేయండి.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_5.1

దశ3: దశ 2 లో చూపిన దాని పై క్లిక్ చేస్తే అభ్యర్ధులు వేరొక పేజీ కీ మళ్లించబడతారు. అభ్యర్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే NEW DIRECT RECRUITMENT OTPR పై క్లిక్ చేయాలి. లేదా మునుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధులు MODIFY DIRECT RECRUITMENT OTPR పై క్లిక్ చేయాలి. కింద చూపిన విధంగా అభ్యర్ధులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే యారో చూపించిన చోట క్లిక్ చేయాలి.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_6.1

దశ4: APPSC పరీక్షలకి దరఖాస్తు లో ఇది ముఖ్యమైన దశ ఈ దశ లో అభ్యర్ధులు OTPR రిజిస్ట్రేషన్ లో తమ వివరాలు అన్నీ సరైనవి పోనుపరచాలి. ఇక్కడ అభ్యర్ధులు తప్పులు చేయకుండా చూసుకోవాలి, తప్పులు నమోదుచేస్తే మళ్ళీ దరఖాస్తు లో ముందు పేజీ లో చూపించిన MODIFY REGISTRATION చేసుకోవాల్సి ఉంటుంది కావున అభ్యర్ధులు అన్నీ వివరాలను ఎంటర్ చేసే ముందే సరిచూసుకోవాలి. అన్నీ వివరాలు పొందుపరచిన తర్వాత SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_7.1

APPSC RECOVER OTPR REGISTRATION

అభ్యర్ధులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి మరియు తమ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ లేదా OTPR ID కోల్పోయినట్లైతే APPSC వెబ్సైటు లో RECOVER OTPR అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. RECOVER OTPR క్లిక్ చేసిన తర్వాత అభ్యర్ధులు తమ OTPR విధాన్ని అనగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ని క్లిక్ చేసి తమ పుట్టిన తేదీ మొబైలు నెంబర్ మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని అందించి చివరిగా చూపించిన క్యాప్ఛ ని ఎంటర్ చేయాలి.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_8.1

APPSC OTPR రిజిస్ట్రేషన్ లేదా పాస్వర్డ్ ని మర్చిపోయిన అభ్యర్ధులు ఈ పైన తెలిపిన దశ ద్వారా తమ వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్ధులు తమ OTPR రిజిస్ట్రేషన్ ID మరియు పాస్వర్డ్ పొందిన తర్వాత వారు లాగిన్ అయ్యి వివిధ నియమకాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC OTPR Complete Registration Process & Steps to Retrieve Password_9.1

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!