Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC New Vacancies 2022

APPSC New Vacancies 2022 | APPSC ద్వారా మరిన్ని కొత్త పోస్టుల భర్తీ

APPSC New Vacancies 2022 :

APPSC Notifications List 2022 As we all know that Andhra Pradesh Public Service Commission (APPSC) officials released  APPSC Group 1, Group 2, Group 3, Group 4 Junior Assistant, Junior Lecturers, Non Gazetted Post Notifications For the year 2021-22. Lakhs of government job aspirants will be waiting for this APPSC Exam Schedule.

 

APPSC New Vacancies 2022 | APPSC ద్వారా మరిన్ని కొత్త పోస్టుల భర్తీ

నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

AP Constable Notification 2022 ,AP కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022APPSC/TSPSC Sure shot Selection Group

 

6 లక్షలకుపైగా పోస్టులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం.

 

నేడు పోస్టులన్నీ భర్తీ..
గత సర్కారు హయాంలో ఎన్నికల ముందు వరకు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు 2018 చివరిలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. కొన్ని న్యాయవివాదాలతో నిలిచిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 3,946 పోస్టులకు సంబంధించిన న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు  చర్యలు తీసుకుంది. రెండున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదురైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పోస్టులు భర్తీ చేసింది.

 

APPSC New Vacancies 2022 | కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు.

  •  కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసింది.
  • ఇవేకాకుండా త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది.
  • వీటిలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్‌-1 లో 31, గ్రూప్‌-2 సర్వీస్‌లో 30 పోస్టులను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది.

 

పోస్టు పేరు  ఖాళీలు
APPSC గ్రూప్‌ 1 31 (ఈ సంఖ్య పెంపుపై ప్రభుత్వ ఆలోచన)
APPSC గ్రూప్‌ 2 30 (ఈ సంఖ్య పెంపుపై ప్రభుత్వ ఆలోచన)
 కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్ 08
AEE 29
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్  17
ఇంగ్లిష్ రిపోర్టర్: లెజిస్లేచర్ 10
ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ 11
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ 08
జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ 10
శాంపిల్ టేకర్స్ మెడికల్ 12
 ఏసీఎఫ్ పోలీసు విభాగం 09
డిస్ట్రిక్ట్ ప్రాబేషన్ ఆఫీసర్ 02
 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 08
టౌన్‌ప్లానింగ్ 02
టెక్నికల్ అసిస్టెంట్ (గ్రౌండ్ వాటర్ 04
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 01
జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ 06
డిస్ట్రిక్ట్ ప్రాబేషన్ ఆఫీసర్ 02
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 240

 

AP Govt Filled Vacancies 

ఈ శాఖలో 39 వేల పోస్టుల భర్తీ:
వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే 27 వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా బోధనాసుపత్రినుంచి విలేజ్‌ క్లినిక్‌ వరకు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

APPSC New Vacancies 2022_4.1

 

Assistant ‌ Professor Posts Recruitment

2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి:

  • రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించినా న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది.
  • వీటన్నిటినీ సరిదిద్దడంతో పాటు పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచి న్యాయవివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా చర్యలు చేపట్టింది. న్యాయవివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు.
  • 10,143 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు.
  • అయితే నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
  • గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీసు విభాగంలో ఏటా 6,500 పోస్టుల భర్తీకి ఇటీవల పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

 

APPSC 2022 నోటిఫికేషన్ కాలెండర్

ఇప్పటి వరకు APPSC విడుదల చేసిన, ఇక పై విడుదల చేయనున్న నోటిఫికేషన్ వివరాలు క్రింది పట్టిక నందు అందించబడింది.

పోస్టు            ఖాళీలు
మెడికల్‌ ఆఫీసర్‌(యునాని)                26 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి)                53 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద)                 72 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(హోమియో)                 24 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయుష్‌)                 3 (విడుదలయ్యింది)
జూ.అసిస్టెంట్, కంప్యూటర్‌ అసిస్టెంట్‌                670(విడుదలయ్యింది)
అసిస్టెంట్‌ ఇంజినీర్లు                190 (విడుదలయ్యింది)
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3
(ఎండోమెంట్‌)
                 60(విడుదలయ్యింది)
హార్టికల్చర్‌ ఆఫీసర్‌                  39 (విడుదలయ్యింది)
తెలుగు రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                  5 (విడుదలయ్యింది)
డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌                  4
ఎక్స్టెన్షన్ అధికారి                  22
ఇంగ్లిష్‌ రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                 10
జూనియర్‌ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                10
డిగ్రీ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                 5
అసిస్టెంట్‌ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్‌                 9
మొత్తం                                                      1,180

 

APPSC Degree Lecturer Recruitment

APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021-22. ఈ నోటిఫికేషన్ A.P కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌లను రిక్రూట్ చేయబోతోంది . తాజాగా  240 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ DL నోటిఫికేషన్‌లో ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్న అభ్యర్థులకు ఇది అనుకూలమైన క్షణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లాల వారీగా భారీ సంఖ్యలో ఖాళీలను రిక్రూట్ చేయబోతోంది. కాబట్టి, వయోపరిమితి, సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితాలు వంటి APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2021 గురించి తాజా తాజా హెచ్చరికలను పొందడానికి తరుచు మా వెబ్సైటులో తనిఖి చెయ్యండి.

 

పోస్టు పేరు  APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్
సంస్థ పేరు  APPSC
నోటిఫికేషన్  తేదీ  త్వరలో 
అప్లికేషను ప్రారంబ తేది త్వరలో 
ఆఖరు తేదీ  త్వరలో 
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
పోస్టుల సంఖ్య
240
అధికారిక వెబ్సైట్
https://psc.ap.gov.in

 

APPSC New Vacancies 2022 Post-wise details

తాజాగా విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నియామకాల లో ఎంపిక కావడానికి నిరుద్యోగ అభ్యర్థులకు ఇదే ఉత్తమ అవకాశం. ఈ సంవత్సరం APPSC  ఖాళీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

APPSC Jobs News

 

***************************************************************************************

AP Constable Notification 2022 ,AP కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Constable Notification 2022 ,AP కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

Sharing is caring!