Telugu govt jobs   »   APPSC Group 2 Mains Special

APPSC Group 2 Mains Special – Top 20 Questions on Shathavahanas (AP History) | APPSC గ్రూప్ 2 మెయిన్స్ స్పెషల్ – శాతవాహనులపై టాప్ 20 ప్రశ్నలు (AP చరిత్ర)

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జూలై 28న జరుగుతుంది, పరీక్షకు చాలా కొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది, APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఆంధ్ర ప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇది గణనీయమైన వెయిటేజీని కలిగి ఉంటుంది. అధిక స్కోర్‌ని పొందేందుకు అవకాశం ఉన్నందున APPSC గ్రూప్ 2 మెయిన్స్ స్పెషల్ – AP చరిత్రపై మేము అందించే ఈ టాప్ 20 ప్రశ్నలు మీకు APPSC గ్రూప్ 2 మెయిన్స్ అధిక మార్కులు రావడానికి మీకు సహాయం చేస్తుంది. APPSC గ్రూప్ 2 పరీక్షను ఛేదించడం లో అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్రపై సమగ్ర అవగాహన చాలా అవసరం. అందుకే మీ APPSC గ్రూప్ 2 మెయిన్స్ రివిజన్ కోసం AP చరిత్రపై మేము టాప్ 20 ప్రశ్నలను అందిస్తున్నాము. మేము చాప్టర్ వారీగా ప్రశ్నలను అందిస్తాము. తాజా సమాచారం కోసం ఈ పేజీ ని బుక్ మార్క్ చేసుకోండి.

AP History for all APPSC Groups and other Exams eBooks by Adda247

APPSC Group 2 Mains Special – Top 20 Questions on Shathavahanas | APPSC గ్రూప్ 2 మెయిన్స్ స్పెషల్ – శాతవాహనులపై టాప్ 20 ప్రశ్నలు

Q1. క్రింది వాటిని జతపరచండి.

A. V.S. సుక్తంకర్                             1) విధర్బవాదము  

B. V.V. మిరాశి                                 2) మహారాష్ట్రవాదము 

C. P.T. శ్రీనివాస అయ్యంగార్         3) ఆంధ్రవాదము 

D. V.A. స్మిత్                                     4) కర్ణాటక వాదము 

(a)  A-4,B-1,C-2,D-3

(b) A-2,B-1,C-4,D-3

(c) A-4,B-3,C-1,D-2

(d) A-1,B-2,C-3,D-4

Q2.క్రింది వాటిని జతపరచండి.

  A). విశ్వాశామాత్య         1) న్యాయ వివాధాలు పరిష్కరించేవాడు 

B) రాజామాత్య                 2 ) రాజు రాజ ఆజ్ఞలను అమలుపరిచేవాడు

C) నిబంధనకర               3)  కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు                                                         

D). మహాఆర్యక                4 ) రాజు అంతరంగిక  సలహాదారుడు 

(a) A-1,B-౩,C-4,D-2 

(b) A-4,B-2,C-3,D-1

(c) A-1,B-2,C-౩,D-4,

(d) A-2,B-౩,C-4,D-1 

Q3. క్రింది వాటిని జతపరచండి.

                 A                                                     

A. కల్పప్రదీప                         1) గుణాడ్యుడు  

B. కథా సరిత్సాగరం                2) హాలుడు  

C. కాతంత్రవ్యాకరణం             3) జినప్రభసూరి 

D. బృహత్కధ                          4) సోమదేవసూరి  

E. గాధా సప్తశతి                        5) శర్వేవర్మ  

(a)A-3,B-4, C-5,D-1,E-2  

(b) A-4,B-3,C-2,D-1,E-5  

(c)A-1,B-3,C-4,D-5,E-2           

(d) A-5,B-1,C-2,D-3,E-4

Q4. శాతవాహన సామ్రాజ్యం గురించి సరి కానిది.?

1) శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మధ్యప్రదేశ్ శాంతి నుండి దక్షిణాన బళ్ళారి వరకు తూర్పున ఆంధ్రప్రదేశ్లోని ధాన్య కటకం నుండి పశ్చిమాన మహారాష్ట్రలోని కానీ వరకు విస్తరించి ఉండేది. 

2) వీరి తొలి రాజధాని- ప్రతిష్టానపురం. 

3) శాతవాహనుల అధికార భాష -సంస్కృతం. 

4) శాతవాహనుల మాతృభాష – దేశీ భాష, తెలుగు 

5) అధికార చిహ్నం- సింహం.

6) అధికార మతం జైన మతం

(a) అన్ని సరికావు  

(b) 1,2,4 సరైనవి, ౩,5,6 సరికావు  

(c) 1,2,4 సరికావు ,౩,5,6 సరైనవి

(d) అన్ని సరైనవి 

Q5. చుళ్ళ కలింగ జాతకాల ప్రకారం దంతపురము రాజధానిగా పాలిస్తున్న ఖరవెలుడిని  ఓడించి యజ్ఞ    యాగాదులను జరిపిన శాతావాహన రాజు ఎవరు? 

(a) గౌతమీపుత్ర శాతకర్ణి

(b) రెండవ శాతకర్ణి 

(c) వాశిష్ట పుత్రపులోమావి            

(d) మొదటి  శాతకర్ణి

Q6. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి సరియైన సమాధానం ఏమిటి ? 

   1) కుషాణుల రాజులలో గొప్పవాడైన కనిష్కుడి కి సమకాలికుడు.

  2) ఇతని బిరుదులు – ఏక బ్రాహ్మణ, ఏకవీర, క్షహారాటక నిరశేషనకార, ఆగమ నిలయ,ఏక బ్రాహ్మణ  బెనకటక స్వామి, రాజాధిరాజా.

  3) ఇతని మంత్రి -శివగుప్తుడు. 

  4) ఇతని బిరుదులు, విజయాలు, దానధర్మాల గురించి తెలిపే శాసనం -నాసిక్ శాసనం. 

  5) గౌతమీపుత్ర శాతకర్ణి నాణాలను గుర్తించిన ప్రదేశం -నాగార్జునకొండ.

  6)  ఇతను నిర్మించిన పట్నం – బెనకటకం. 

 7) గౌతమీపుత్ర శాతకర్ణి గురించి సముద్ర వ్యాపారం గురించి పెరి ప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో ఉంది.

(a) 1,2,౩,4 సరికావు, 5,6,7 సరైనవి.

(b) అన్ని సరైనవి 

(c) 1,2,౩,4,5 సరైనవి, 6,7, సరికావు

(d) అన్ని సరికావు 

Q7) ఏ శాతవాహన రాజుల కాలంలో రెండు తెరచాపల కొయ్య బొమ్మలు కలిగిన ఓడ బొమ్మ ముద్రించారు?.  

(a) గౌతమీపుత్ర శాతకర్ణి

(b)వాశిష్టపుత్ర పులోమావి 

(c ) యజ్ఞశ్రీ శాతకర్ణి

(d) విజయ శ్రీ శాతకర్ణి

Q8. ఎవరి కాలంలో దక్షిణ భారతదేశంలోని భాగవత మతం ప్రవేశించింది ? 

(a) కృష్ణ

(b) గౌతమి శాతకర్ణి

(c) హాలుడు  

(d) మొదట  శాతకర్ణి

Q9. శక రాజు రుద్రదాముని చేతిలో పరాధితుడై రాజధానిని పైథాన్ నుండి దాన్యకటకానికి మార్చినది ఎవరు?  

(a) శివ శ్రీ శాతకర్ణి

(b) రెండవ పులో మావి

(c) మూడవ కులోమావి

(d) వేదసిరి 

Q10.  ప్రకటన-1 : శాతకర్ణి రాజ్యంపై కలింగపాలకుడు దండెత్తి మూషిక నగరాన్ని ముట్టడించినట్లు హాతిగుంఫా శాసనంలో తెలుపుతుంది. 

ప్రకటన-2 : ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశంలోని వేదలి అనే చోట జన్మించాడని కధాపరిత్సాగరం అనే గ్రంథం తెలుపుతుంది.

(a) 1,2, సరైనవి            

(b) 1 , 2 కి సరైన వివరణ  

(c) 1 సరైనది , 2 సరికాదు

(d) 1,2 సరికాదు 

Q11. ప్రకటన-P:  శాంతి స్థూప దక్షిణ తోరణం పై గల శాసనంలో ప్రస్తావించిన రాజు రెండవ శాతకర్ణి. 

ప్రకటన-Q :  రెండవ శాతకర్ణి ఆస్థాన కవి కుతోహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథం రాశారు. 

ప్రకటన-R:  రెండవ శాతకర్ణి విజయాల గురించి గార్జీ సన్నిధిలో కలదు.

(a) P,Q,R  సరైనవి

(b) P,Q,R  సరికాదు 

(c) P ,R కి సరైన వివరణ , Q సరికాదు 

(d) Q సరైనది , P,Q సరికాదు 

Q12. సరియైన సమాధానాన్ని గుర్తించండి. 

 1) అమరావతి స్థూపాన్ని దర్శించి పూర్ణకుంభాన్ని దిమికుడు అనే చర్మకారుడు పూర్ణకుంభాన్ని కానుకగా ఇచ్చే దృశ్యం అమరావతి స్థుపంపై కనిపిస్తుంది. 

2) సతీ ఆచారం గురించి గాధాసప్తశతి గ్రంధంలో కలదు. 

3) శాతవాహన కాలంలో అతి పురాతనమైన శివలింగం గుడిమల్లం లో కలదు. 

4) అమరావతి స్థుపాన్ని 1797లో కనుగొన్న వ్యక్తి – కల్నర్  మెకంజీ

(a) 1,2 సరియైనది ,౩,4 సరికాదు

(b) అన్ని సరైనవి 

(c) 1,2,౩,సరికాదు, 4 సరైనది  

(d) ఏది  సరికాదు 

Q13) ఈ క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి.

 1)  శాతవాహన కాలంలో పట్టణాల గురించి హాతిగుంప శాసనంలో తెలిపారు. 

2) సైనిక వ్యవస్థను హాతిగుంపా శాసనం అమరావతి శాసనంలో తెలిపారు. 

 3) శాతవాహన కాలంలో పట్టణాలను నిఘమములు అని పిలిచేవారు.

4)  పట్టణాలలో పాలనలకు స్కంద వారాలు గా నిర్వహించేవారు.

(a) 1,2 సరియైనది ,౩,4 సరికాదు

(b) 1,4 సరైనవి, 2,౩ సరికావు 

(c) 2,౩, సరైనది,1,4 సరికావు 

(d) అన్ని సరైనవి  

Q14. 

1) శాతవాహనుల కాలంలో భూమిశిస్తూ 1/6 వ వంతు.

 2)  కొలికా శ్రేణి వారిపై వడ్డీ 14% ఉండేది.

 3) శాతవాహనులు ముఖ్యమైన రేవు పట్టణాలు కళ్యాణి ,కోరింగ. 

 4) రోమ్ – భారతదేశాల మధ్య జరిగిన వ్యాపారం గురించి  ప్లేనీ  తన గ్రంథంలో  వివరించాడు. 

 5) ఎరిత్రియన్ సీ  గ్రంథంలో దక్షిణాదిలోని 20 రేవు పట్టణాల గురించి పేర్కొన్నారు.

(a) అన్ని సరైనవి

(b) 2,౩ సరికావు 

(c) 1,2,౩, సరికావు ,4,5  సరైనవి  

(d) ఏది సరికాదు 

Q15. సరైన సమాధానం ఏది. 

(a ) ఆంధ్ర ప్రాంతంలో 40 సంఘ రామాలుండేవని తెలిపిన వారు హుయాన్ సాంగ్.

(b) శ్రీ పర్వతంపై యజ్ఞశ్రీ కట్టించిన 1500 గదులు గల ఏడు అంతస్తుల మహా విహారం గురించి పాహియాన్ రాశాడు. 

(c) అమరావతి శిల్పరీతి నాగరిక జీవిత లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.

(d)  పైవన్నీ సరైనవే.

Q16. రాధాకృష్ణుల గురించి మొదటిసారిగా ఏ గ్రంథంలో తెలిపారు?

(a)  కదా పరిత్సాగరం           

(b) నానాఘాట్ శాసనం 

(c) గాధా సప్తశతి

(d) అమరావతి శాసనం.

Q17. మ్యాక ధోని  శాసనాన్ని వేయించిన శాతవాహన రాజు?

(a) చంద సిరి శాతకర్ణి

(b) శివశ్రీ 

(c) మూడవ పులోమావి

(d) రెండవ పులోమావి

Q18. బెనకటక స్వామి అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు? 

 (a) ఒకటవ పులోమావి

(b) గౌతమీపుత్ర శాతకర్ణి 

(c) వాశిష్ఠి పులోమావి

(d ) యజ్ఞశ్రీ శాతకర్ణి

Q19) శాతవాహన కాలంలో నర్తకి మనులు  ముఖంపై ఏ పూతను రాసుకునేవారు? 

 1. చందన పూత 
 2.  మైనవదాళం
 3. అరదళం 
 4. చమ్కీ వళం 

Q20. ప్రకటన 1 : శాతవాహనుల కాలంనాటి చిత్రకలను అజంతా గుహలలోని 9 10 నెంబర్ గుహలలో చూడవచ్చు. 

ప్రకటన 2 : పదవ నెంబర్ గుహలలో శ్వేత గజ జాతకథ చిత్రం లేదా పట్టంతు కధ చిత్రం కనిపిస్తుంది

(a) 1 సరైనది, 2 సరికాదు 

(b) 1 , 2 సరికావు 

(c) 1 సరికాదు, 2 సరైనది

(d) 1 , 2 కి సరైన వివరణ 

Solutions:

S1 Ans(a)

Sol:

 • విష్ణు సీతారామ్ సుక్తాంకర్, వి.ఎస్. సుక్తాంకర్ అని కూడా పిలుస్తారు ఇండాలజిస్ట్ మరియు సంస్కృత పండితుడు. ఇతను ఆంధ్రావాధమును ప్రబోధించాడు . 
 • వాసుదేవ్ విష్ణు మిరాషి 20వ రాతి మరియు రాగి శాసనాలు మరియు ప్రాచీన భారతదేశం యొక్క నాణేల నిపుణుడు. 
 • శ్రీనివాస అయ్యంగార్  పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని, మాట్లాడే మాండలికాలను ప్రవేశపెట్టాలని ప్రచారం చేశారు. 1909లో మాతృభాష తెలుగును పెంపొందించేందుకు తెలుగు బోధనా సంస్కరణల సంఘాన్ని సృష్టించాడు.
 • విన్సెంట్ ఆర్థర్ స్మిత్ ఒక ఐరిష్ ఇండాలజిస్ట్, చరిత్రకారుడు, ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు మరియు క్యూరేటర్. బ్రిటీష్ రాజ్ కాలంలో భారతీయ చరిత్ర చరిత్రలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు

S2.Ans.(b)

Sol: 

 • శాతవాహునల  పరిపాలనలో రాజుకు సాయం చేయడానికి నలుగురు మంత్రులు ఉండేవారు . వీరు విశ్వ అమాత్యులు,  రాజామాత్యులు, మహామాత్యులు అమాత్యులు. 
 • వీరు కాకుండా ఇతర అధికారులైన హిరనికుడు, లేఖకుడు ,మహా ధార్మికుడు రాజ్యభాషకుడు ఉండేవారు.

S3.Ans.(a)

sol :

 • కథ సరిత్సాగరం ,కల్ప ప్రదీప, కాతంత్ర వ్యాకరణం, బృహత్కధ ,గాధసత్పత్తి మొదలగు గ్రంథాల ద్వారా శాతవాహనుల కాలంలో సాంఘిక జీవన పరిస్థితులు తెలుస్తాయి.
 • సతీసహగమనం పాటించేవారని, మృదంగం వీణ శంఖం వేణువు లాంటి సంగీత పరికరాలను వినియోగించారని, ఎడ్ల పందాలు, కోడిపందాలు వంటి వినోద క్రీడలు కూడా జరిగాయని తెలుస్తుంది.

S4. Ans(b)

Sol: శాతావాహనుల  అధికారిక భాష ప్రాకృతం. వారి అధికారిక చిహ్నం సూర్యుడు. మరియు వారి యొక్క  మతం హైందవం.

S5 Ans(d) 

Sol: మొదటి శాతకర్ణికి మల్ల కర్ణ మహాన్ అని వివిధ బిరుదులు ఉన్నాయి. కళింగాధిపతి అయిన ఖరవేలుడుతో యుద్ధం గురించి హతి గుంప శాసనం, గుంటుపల్లి శాసనాల్లో పేర్కొన్నారు.

S6. Ans (b)

Sol. శాతవాహనుల్లో 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి . ఇతను తల్లి పేరు అయిన గౌతమీ బాలశ్రీ అనే పదాన్ని తన పేరు మొదట చేర్చుకున్నాడు. తల్లి పేరు మొదట ఉపయోగించడాన్ని మాట్రిమోనిక్స్ అంటారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు .గౌతమీ బాలశ్రీ తన కుమారుడి విజయాల గురించి రెండో పులామావి పాలన కాలంలో వేసిన నాసిక్ శిలాశాసనంలో వివరించింది.

S7. Ans (c)

Sol: యజశ్రీ శాతకర్ణి కాలంలో లంగరు వేయబడిన ఓడ గుర్తులు గల నాణేలను  ముద్రించారు. మత్స్య పురాణం, ఇతని పాలానా కాలంలోనే సంకలనం చేయబడింది. ఇతన సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునడు.

S8.Ans(a)

Sol: కృష్ణుడి పరిపాలనా కాలంలో ఆంధ్రలోనికి భాగవత మతం ఉత్తర భారతం  నుండి ప్రవేశించబడినది. ఈ మతం ఉత్తర భారతంలో ,మొదట పుష్యమిత్ర సుంగుని కాలంలో వెలుగులోకి వచ్చింది.

S9. Ans.(b) 

Sol : శకులలో గొప్పవాడైన రుద్రతాముడు ,శాతవాహన రాజ్యంపై దాడి చేసి రెండో పులామావిని ఓడించాడు. రెండో పూలామావి రుద్రాముడుచే పరాజయం పొంది రాజధాని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగినది. ఇతని యొక్క శాసనాలు నాసిక్ లోను కార్లే లోనూ అమరావతి లోను దొరికాయి. ఇతని కాలంలోనే అమరావతి స్తూపం నిర్మింపబడింది.

S10. Ans(c)

Sol: హతీ గుంఫా  శాసనంలో మూషిక నగరం పై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించి ఆ నగరానికి పితుండా అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ శాసనం చతురుంగబలాలను గురించి ప్రస్తావించింది. కదా సరిత్సాగరం అనే గ్రంథంలో ఆచార్య నాగార్జునుడుని శాతవాహన యువరాజు అంతం అందించాడని  పేర్కొన్నది.

S11. Ans(c)

Sol: శాతవాహనులలో ఆరవరాజు రెండవ శాతకర్ణి .ఇతను శాతవాహనుల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు (56 సంవత్సరాలు). ఇతను సాంచి  స్థూపం కు దక్షిణ తోరణాలు నిర్మించి శాసనాన్ని వేయించాడు. ఇతని పరిపాలన కాలంలోనే సకా శాతవాహన ఘర్షణలు  ప్రారంభమయ్యాయి

S12. Ans(b) 

Sol: అమరావతి స్థూపం లో సుస్పష్టమైన పూర్ణకుంభం మనకు కనబడుతుంది. సతీ అనే మూఢ ఆచారం కోసం గాథసత్పత్తి గ్రంథంలో పేర్కొన్నారు. గుడిమల్లం లో శాతవాహనుల కాలం యొక్క అతి పురాతనమైన శివలింగం కనుగొన్నారు 1797లో అమరావతి స్తూపాన్ని కనిపెట్టిన వ్యక్తి కల్నల్ మెకంజీ

S13. Ans.(c)

Sol. పట్టణాలలో పరిపాలన కోసం మ్యాకోదోని శాసనం వివరిస్తుంది.

శాతవాహనుల కాలంలో నిగమసభలు పట్టణ పరిపాలనను సూచిస్తాయి

S14. Ans.(b)

Sol: శాతవాహనుల ముఖ్యమైన ఓడరేవు అరిక మేడు  .రోమ్ తో వ్యాపారం చేయడానికి ఈ ఓడరేవు ఉపయోగించబడినట్లు గ్రీకు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. కొలికా శ్రేణి వారినుండి వృషభ దత్తుడు 14% వడ్డీ వసూలు చేసినట్లు తెలుస్తుంది.

S 15 Ans(d)

Sol: సి యు కి అనే గ్రంథంలో హుయాన్ సాంగ్ శాతవాహనుల గురించి వివరాలను అందించాడు. సియుకి అనే గ్రంధానికి మరో పేరు బుద్దిస్ట్ రికార్డ్స్: అలాగే శ్రీ పర్వతం గురించి విశేషాలు అన్నీ పాహియాన్ వివరించాడు.

S16. Ans.(c)

Sol: హాలుడు గాధా సప్తశతి  అనే గ్రంధాన్ని రచించాడు ఇది ప్రాకృతి  భాషలో ఉన్న గ్రంథం. గాధలంటే పద్యాలు ఇందులో చక్కటి సాహిత్య విలువలు ఉంటాయి . హాలుడికి కవి వత్సల్యుడు అనే బిరుదు కలదు. గాధా సప్తశతి రచనకు తోడ్పడిన స్త్రీలు అనులక్ష్మి, అనుపలబ్ద, రేవా, మాధవి.

S17.Ans.(c)

Sol: శాతవాహనులలో 30వ రాజు మరియు చివరివాడు మూడో పులోమావి . మూడో పూలమావిని ఓడించి రాజ్యం నుండి వెళ్లగొట్టిన వాడు ఇక్ష్వాకు రాజైన శ్రీ శాంతమూలుడు. మూడో పులామావి తన చివరి దినములను గడిపిన ప్రాంతం మీ మ్యాక ధోని. ఇది బళ్లారి సమీపంలోని గ్రామం .ఇతను బళ్ళారి లో మ్యాక ధోని  శాసనాన్ని వేయించాడు.

S18. Ans(b)

Sol: గౌతమీపుత్ర శాతకర్ణి బెనకటక స్వామి అనే బిరుదుతో సహా ఏకదనుర్ధరుడు, ఏకసురుడు అని బిరుదులు గడించాడు. ఇతడు జయించిన రాజ్యాలు అస్మక ,అనుప ,సౌరాష్ట్ర వింధ్య సాత్పురా ,మూలక ,అపరాంత మరియు నీలగిరి.

S19. Ans.(c)

Sol: శాతవాహనుల కాలంలో నాట్యానికి ఎక్కువ ప్రాధాన్యత లభించేది. పురాణాల్లో నీ గాథలను నర్తకీమణులు సంఘాల వద్ద ప్రదర్శించేవారు. చందనంతో చేయబడిన అరదళం అనే పూతను వీరు ముఖంపై రాసుకునేవారు

S20. Ans.(c) 

Sol: అజంతా గుహలలో 9 ,10 ,12 ,13, 15 గుహలు శాతవాహనుల కాలంనాటి చిత్రకలను ప్రతిబింబిస్తాయి. ఇవి క్రీస్తు పూర్వం 230 – 220 సంవత్సరానికి చెందినవిగా చరిత్రకారులు భావిస్తారు.

AP History Bit Bank for all APPSC Groups and other Exams by Adda247

Sharing is caring!