Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్   »   APPSC Group 2 Exam 2024 Last...

APPSC Group 2 Exam 2024 Last Week Preparation Strategy | APPSC గ్రూప్ 2 పరీక్ష చివరి వారం ప్రిపరేషన్ వ్యూహం

APPSC గ్రూప్ 2 పరీక్ష 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తుంది. APPSC గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ పరీక్ష 25 ఫిబ్రవరి 2024న షెడ్యూల్ చేయబడుతుంది. APPSC గ్రూప్ 2 పరీక్ష 2024కి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్‌ను 14 ఫిబ్రవరి 2024న తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అందరూ పరీక్షకు బాగా సిద్ధమయ్యారు. పరీక్షల కోణం నుండి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దే విధానాన్ని తెలుసుకుందాం.

APPSC GROUP-2 Prelims Subject Wise MCQS Download Free PDF in Telugu and English_30.1

Adda247 APP

APPSC Group 2 Exam 2024 | APPSC గ్రూప్ 2 పరీక్ష 2024

ఆంధ్రప్రదేశ్  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షా కఠినత్వ స్థాయి, పరిధి ఎలా ఉంటుంది అనే ఆందోళన సీరియస్ గా సిద్దమైన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ప్రకటించిన పోస్టులు 899 కాబట్టి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. దాదాపుగా సీరియస్ అభ్యర్థులందరూ మెయిన్స్కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే సగం విజయం సాదించినట్లే.

Click Here: APPSC Group 2 Admit Card 2024

APPSC Group 2 Prelims Exam Pattern 2024 (APPSC గ్రూప్ 2 పరీక్ష సరళి 2024)

APPSC గ్రూప్ 2 అనేది రెండు దశల పరీక్ష. అభ్యర్థి మొదట  ప్రిలిమ్స్‌కు హాజరు కావాలి, తర్వాత ప్రధాన పరీక్ష  ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు (మెయిన్స్) హాజరు కావాలి.

  • 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  • ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30).
  • ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  •  పరీక్షకు 150 నిమిషాలు కేటాయిస్తారు.
  • గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
సమయం 150 నిమిషాలు

APPSC Group 2 Exam 2024 Last Week Preparation | APPSC గ్రూప్ 2 పరీక్ష చివరి వారం ప్రిపరేషన్

  • కొంతమంది అభ్యర్థులు చివరిరోజు వరకు ‘అది చదవాలి. ఇది చదవాలి’ అని ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ పరీక్షల్లో..
  • అబ్జెక్టివ్ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కనీసం వారం రోజులు ముందు నుంచీ తగినంత నిద్ర ద్వారా మెదడుకు ప్రశాంతతను అందించాలి. తద్వారా అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే విషయాన్ని అన్వయించుకుని కనీసం 10 గంటల సమయమైనా మెదడుకు విశ్రాంతినివ్వాలి.
  • సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి దూరంగా ఉంటూ ప్రశాం తంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి.
  • కొత్త కొత్త విషయాలను చదివే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి. చదివిన పుస్తకాల్లో కూడా కొన్ని సబ్జెక్టులను ఇక చదవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకుని వాటిని పక్కన పెట్టేసేయాలి.
  •  కరెంట్ అఫైర్స్, గణాంకాలు, ఆర్థిక గణాంకాలు మొదలైనవాటి పునశ్చరణ (రివిజన్) కు మాత్రమే ఇప్పటి సమయాన్ని కేటాయించాలి.
  • ఆంధ్రప్రదేశ్ విధానాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు, ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర అంశాలు, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు), మెంటల్ ఎబిలిటీ మొదలైన విభాగాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఈ కొద్ది రోజుల్లో విహంగ వీక్షణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పరీక్షకు 24 గంటల ముందు ఏదీ చదవకుండా ప్రశాంతంగా ఉండటం మేలు. దీనివల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

Instructions in Examination Hall | పరీక్ష హాలులో సూచనలు

  • పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  • అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి తప్పులు రాస్తూ చాలా సందర్బాల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే.
  • సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
  • తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.

APPSC Group 2 Admit Card 2024 Out

APPSC GROUP-2 Prelims Subject Wise MCQS Download Free PDF in Telugu and English_40.1

Sharing is caring!