Telugu govt jobs   »   Article   »   APPSC DyEO Online Application

APPSC Deputy Educational Officer Online Application 2024 Last Date | APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2024 చివరి తేదీ, దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ విద్యా అధికారి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను 9 జనవరి 2024 నుండి స్వీకరిస్తుంది. ఆన్లైన్ లోదరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధలు అధికారిక వెబ్ సైటు psc.ap.gov.inను సందర్శించడం ద్వారా లేదా ఈ కథనంలో ఇవ్వబడిన డైరెక్ట్ అప్లికేషన్ లింక్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పోస్టులకు దరఖాస్తులను 29 జనవరి 2024 వరకు సమర్పించవచ్చు.  APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్, దరఖాస్తు రుసుము మరియు ఇతర వివరాల కోసం ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 చివరి తేదీ

ఆంధ్ర ప్రదేశ్ DyEO ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం జనవరి 9 నుండి 29, 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అంగీకరించబడతాయి. ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు లో అన్ని సంబంధిత కాలమ్‌లను తప్పనిసరిగా పూరించాలి మరియు వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తును సమర్పించాలి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన వివరాలు కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి మరియు నోటిఫికేషన్ పరంగా అర్హత నిర్ణయించబడతాయి.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 అవలోకనం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్  డిప్యూటీ విద్యా అధికారి 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) ఆన్‌లైన్ దరఖాస్తు 2024 అవలోకనం దిగువ పట్టిక రూపంలో అందించాము.

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 అవలోకనం 
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్
డిపార్ట్మెంట్ విద్యా శాఖ
పోస్ట్ డిప్యూటీ విద్యా అధికారి (DyEO)
ఖాళీల సంఖ్య 38
APPSC DyEO దరఖాస్తు పక్రియ ప్రారంభ తేదీ 09 జనవరి 2024 
APPSC DyEO  దరఖాస్తు పక్రియ చివరి తేదీ 29 జనవరి 2024 
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ //psc.ap.gov.in//

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 లింక్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుకు 38 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు 9 జనవరి 2024 నుండి 29 జనవరి 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  అభ్యర్థులు యూజర్ గైడ్‌ను పరిశీలించి, దరఖాస్తు చేయడానికి ముందు జాగ్రత్తగా ఈ రిక్రూట్‌మెంట్‌కు తమ అర్హతను గురించి పూర్తి వివరాయలు తెలుసుకోవాలి మరియు వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తును సమర్పించాలి మరి ఏ ఇతర పద్దతిలో పంపిన దరఖాస్తు స్వీయకరించబడదు. అభ్యర్థుల సౌలభ్యం కొరకు ఇక్కడ మేము APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 యొక్క డైరెక్ట్ లింక్ ను అందిస్తున్నాము. దిగువ ఇచ్చిన APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 లింక్  పై క్లిక్ చేసి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 లింక్

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు

APPSC DyEO దశ 1: వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(One Time Profile Registration) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • NEW OTPR కొరకు Home లోని Modify OTPR ID మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.

APPSC Group 2 Free History Notes PDF Download (Adda247 Studymate Notes)

APPSC DyEO దశ 2: దరఖాస్తు ఫారమ్ పూరించండి

  • APPSC రిజిస్ట్రేషన్ ID మరియు పాస్‌వర్డ్‌తో మళ్లీ లాగిన్ చేయండి.
  • అభ్యర్థి ” Online Application submission for APPSC DyEO“ని ఎంచుకుని, ఆపై అధికారిక ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి సిస్టమ్‌ను యాక్సెస్ చేయాలి.
  • తదనంతరం, విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, అభ్యర్థి మిగిలిన విభాగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలి.
  • వ్యక్తిగత వివరాలు: పేరు, పుట్టిన తేదీ, లింగం, వర్గం మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయండి. కొనసాగడానికి ముందు ఏవైనా లోపాల కోసం ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
  • విద్యా అర్హతలు: హైస్కూల్ నుండి అత్యున్నత డిగ్రీ వరకు మీ విద్యా వివరాలను పూరించండి. మీ అర్హతలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని నిర్ధారించుకోండి.
  • పత్రాలను అప్‌లోడ్ చేయండి: మార్గదర్శకాలలో పేర్కొన్న నిర్దిష్ట పరిమాణం ప్రకారం మీ ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
  • దీనిని అనుసరించి, అభ్యర్థి తప్పనిసరిగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి మరియు సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత సమర్పించు బటన్‌ను క్లిక్ చేయాలి.
  • ఈ దశలు పూర్తయిన తర్వాత, APPSC DyEO దరఖాస్తు ఫారమ్ విజయవంతంగా సమర్పించబడుతుంది మరియు భవిష్యత్తు సూచన కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ID మరియు పాస్‌వర్డ్ రూపొందించబడుతుంది మరియు అధికారిక ఇమెయిల్ చిరునామా మరియు మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అప్లికేషన్ ఫీజు 2023

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసేటప్పుడు చెల్లించాల్సిన కేటగిరీ వారీగా దరఖాస్తు రుసుము ఇవ్వబడిన పట్టికలో ఇవ్వబడింది.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అప్లికేషన్ ఫీజు 2023
కేటగిరీ దరఖాస్తు రుసుము పరీక్ష రుసుము
  • SC, ST, BC, PBDలు & మాజీ సైనికులు
  • పౌర సరఫరాల శాఖ, A.P. ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్ నివాసితులు) జారీ చేసిన గృహ సరఫరా వైట్ కార్డ్ కలిగి ఉన్న కుటుంబాలు.
  • G.O.Ms.No.439, G.A (Ser-A) Dept., తేదీ: 18/10/1996 ప్రకారం నిరుద్యోగ యువత
రుసుము లేదు  రూ.120
ఇతరులు రూ. 250 రూ.120

APPSC DyEO సిలబస్ 2023

GS & Mental Ability (Paper I) Live Batch 2024 for JL, DL and Polytechnic Lecturer Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

APPSC DyEO ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 కోసం దరఖాస్తు వ్యవధి ఎంత?

APPSC DyEO ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 కోసం దరఖాస్తు వ్యవధి 9 జనవరి 2024 నుండి 29 జనవరి 2024 వరకు.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఎన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయి?

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) నోటిఫికేషన్ 2023లో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి.

APPSC DyEO ఉద్యోగాలు 2023 కోసం నేను ఎక్కడ దరఖాస్తు చేసుకోగలను?

APPSC DyEO ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.