APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బోటనీ, హిస్టరీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, ఎకనామిక్స్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వ్రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు, వారిని చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. APPSC డిగ్రీలెక్చరర్ రాత పరీక్షలో 450 మార్కులకు 2 పేపర్లు ఉంటాయి. లెక్చరర్ ఉద్యోగం సాదించాలి అనుకునే అభ్యర్ధులకు ఇది సరైన అవకాశం, పక్కా ప్రణాళికా తో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం సాదించవచ్చు, అందుకు ముందుగా డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం, సిలబస్ పై పట్టు సాదించాలి. ఈ కథనంలో మేము APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం గురించిన పూర్తి సమాచారం అందించాము.
APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2024
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం 2024 అవలోకనం
వివిధ విభాగాల్లో అధ్యాపకులు కావాలనుకునే ఔత్సాహిక అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టును అర్థం చేసుకోవడమే కాకుండా పరీక్ష సరళిపై పట్టు సాధించి విజయం సాధించాలి. పరీక్ష విధానం అర్థం చేసుకోవడం కీలకం. డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ (DL) పరీక్ష వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం 2024 అవలోకనం | |
పోస్టు పేరు | APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ |
సంస్థ పేరు | APPSC |
నోటిఫికేషన్ తేదీ | 30 డిసెంబర్ 2023 |
మొత్తం ఖాళీలు | 240 |
ఎంపిక ప్రక్రియ |
|
టెస్ట్ మోడ్ | కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) |
మొత్తం మార్కులు | 450 |
నెగెటివ్ మార్కింగ్ | 1/3 |
అధికారిక వెబ్సైట్ | https://psc.ap.gov.in |
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ
కమీషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా పోస్ట్‌కు ఎంపిక చేయబడుతుంది. వ్రాత పరీక్ష ఏప్రిల్/మే, 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు.
- వ్రాత పరీక్ష (CBRT)
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం
APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ లిస్ట్‌లో జరుగుతుంది.
- APPSC డిగ్రీలెక్చరర్ రాత పరీక్షలో 450 మార్కులకు 2 పేపర్లు ఉంటాయి.
- APPSC డిగ్రీ లెక్చరర్ వ్రాత పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీలో డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహించబడుతుంది.
- APPSC డిగ్రీ లెక్చరర్ రాత పరీక్ష పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్‌లో PG డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 300 మార్కులకు నిర్వహించబడుతుంది.
- ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు నిర్దేశించిన మార్కులలో 1/3వ వంతు జరిమానా విధించబడుతుంది.
APPSC డిగ్రీ లెక్చరర్ రాత పరీక్షకు సంబంధించిన వివరాలు క్రింద పేర్కొనబడ్డాయి.
Written Examination (Objective Type) | |||
Papers | No. of Questions |
Duration (Minutes) |
Maximum Marks |
Paper-1: General Studies & Mental Ability (Degree Standard ) | 150 | 150 | 150 |
Paper-2: Concerned Subject (One only) (PG Standard) | 150 | 150 | 300 |
TOTAL | 450 |
డౌన్‌లోడ్ APPSC డిగ్రీ లెక్చరర్ సిలబస్ 2024 PDF
APPSC డిగ్రీ లెక్చరర్ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) పరీక్ష విధానం
Scheme of the examination (Practical Type) | |||||
Test | Duration (Minutes) |
Maximum Marks |
Minimum Qualifying Marks | ||
SC/ST/PH | BC’S | OC’S | |||
Proficiency in Office Automation with usage of Computers and Associated Software. | 60 | 100 | 30 | 35 | 40 |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |