Telugu govt jobs   »   Article   »   AP ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ 2024

AP Vote on Account Budget 2024 Key Hilighlights | AP ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ 2024 ముఖ్య అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ ని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన 7 వ తారీఖున శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరంతో ఆంధ్రప్రదేశ్ కి బుగ్గన శాసనసభలో బడ్జెట్ 5 సార్లు ప్రవేశపెట్టారు. 2024-2025 సంవత్సరానికి 2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో పొందుపరచిన ముఖ్యఅంశాలు, కేటాయింపులు, పురోగతి వంటి అంశాల పై రాష్ట్ర స్థాయిలో జరిగే అన్నీ పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. అభ్యర్ధుల సౌలభ్యం కోసం ఈ కధనం లో ముఖ్య అంశాలు అందించాము.

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ ఫలితాలు 2023, ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేయండి_70.1APPSC/TSPSC Sure shot Selection Group

ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ 2024 ముఖ్య అంశాలు

ఈ ఆర్ధిక సంవత్సరం ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ మొత్తం రూ.2 లక్షల 86వేల 389కోట్లు, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. ఈ ఆర్ధిక సంవత్సరానికి ద్రవ్య లోటు రూ.55వేల 817కోట్లు మరియు రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3.51శాతం, జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56శాతంగా ఉంది. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు, మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు.

ఈ సంవత్సరం బడ్జెట్ ని ప్రధానం గా ఏడు అంశాల ఆధారంగా తయారుచేశారు, అవి:

  1. సుపరిపాలన
  2. సామర్థ్య ఆంధ్ర
  3. మన మహిళా మహారాణుల ఆంధ్ర
  4. సంపన్నుల ఆంధ్ర
  5. సంక్షేమ ఆంధ్ర
  6. భూభద్ర ఆంధ్ర
  7. అన్నపూర్ణ ఆంధ్ర

బడ్జెట్ ప్రసంగం లో మంత్రి గత సంవత్సరం వివిధ పధకాలకు కేటాయించిన మొత్తం మరియు సాధించిన పురోగతి గురించి వివరించారు.

  • ఇప్పటివరకు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు కల్పించి యువతకు వృద్ధి మరియు ప్రజలకు పాలనను చేరువయ్యేలా చేశారు.
  • గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో 2.6లక్షల మంది వలంటీర్లు ప్రజల వద్దకు పాలనని అందిస్తున్నారు.
  • రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు, ప్రతీ జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
  • పాలన వికేంద్రీకరణ కోసం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచారు
  • విధ్య కోసం పెద్ద పీట వేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మరియు 1000 పాఠశాలల్లోCBSE సిలబస్ తో పాటు ఎంపిక చేసిన పాఠశాలల్లో IB సిలబస్ ని కూడా ప్రవేశ పెట్టనున్నారు.
  • పాఠశాల విధ్యార్ధులకు రూ.3367కోట్లతో 47 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందిస్తున్నారు మరియు జగన్నన గోరుముద్ద పధకం కింద రూ.1910కోట్లు ఖర్చు చేశారు తద్వారా పాఠశాలల్లో డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింది
  • 9.52,925 ట్యాబ్స్ ని ఉచితంగా 8,9 తరగతి విద్యార్థులకు అందించారు.
  • రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన, రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ద్వారా ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి
  • విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి విదేశాలల్లో ఉన్నత విద్యని అందిస్తున్నారు.

ఆరోగ్యం

  • బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు చేసి మెరుగైన వసతులు కల్పించాము మరియు ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో ఉండేలా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ది చేశాము.
  • ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఒక నూతన వోరవడి సృష్టించారు. YSR ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25లక్షలకు పెంచడమే కాకుండా వ్యాధులను 3257కు పెంచి ఆరోగ్యాన్ని ప్రజలకు చేరువచ్చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద రాష్ట్రం మొత్తం మీద 10,754 శిబిరాలు నిర్వహించి కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మరియు మందులు అందజేశారు.
  • 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధిపొందారు, ఆరోగ్య శాఖ లో ఉన్న  53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకం
  • కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తూ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, ఉద్దానం లో మంచినీటి సదుపాయాలు మెరుగుపరిచారు.
  • కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు కూడా పంట పెట్టుబడి సాయం రూ.13500 సాయం అందుతొంది. రైతులకి ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు కేటాయించాము. రైతులకి అన్నీ సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి.
  • వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ అందిస్తూ అవసరమైన విధ్యుత్ సంస్కరణలు తీసుకున్నారు మరియు స్మార్ట్ మీటర్ల ను అమర్చెఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • రాష్ట్రం లో ముఖ్య పట్టణాలలో వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసి రైతులకి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు
  • పంట నిల్వల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి.
  • తలసరి ఆదాయంలో ఏపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 4వ స్థానం లో ఉన్నాము.
  • పెన్షన్లకు ఐదు సంవత్సరాలలో 84731 కోట్లు ఖర్చు చేశాం.
  • రాష్ట్రంలో 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిణీ జరుగుతోంది.

వివిధ పధకాలకింద ఖర్చు చేసిన మొత్తం

  • వైఎస్సార్ బీమాకి రూ.650 కోట్లు
  • కల్యాణమస్తు, షాదీ తోఫాకి రూ.350 కోట్లు
  • ఈబీసీ నేస్తంకి రూ.1257 కోట్లు
  • కాపునేస్తంకి రూ.39,247 కోట్లు
  • నేతన్ననేస్తంకి రూ.983 కోట్లు
  • జగనన్న తోడుకి రూ.3374 కోట్లు
  • జగనన్న చేదోడుకి రూ.1268 కోట్లు
  • వాహనమిత్రకి రూ.1305 కోట్లు
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు
  • గత నాలుగు సంవత్సరాలలో ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు
  • DBT ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం.
  • నాన్ DBT ద్వారా రూ.1.68 కోట్లు అందించాం.

ఆంధ్రప్రదేశ్ కి అందిన అవార్డులు

  • ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్లానీ చీరకు బంగారు బహుమతి
  • జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది.
  • చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు.
  • అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం.
  • సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం.

Download vote on account budget

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!