AP Tops Ground Water Conservation: CGWB Report | CGWB నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూగర్బ జలాల పరిరక్షణ లో ముందు నిలిచింది
ఈ సంవత్సరం రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రాష్ట్రం లో భూగర్భజలాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి అని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి నివేదిక తెలిపింది. భూగర్భ జలాల పరిరక్షణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా రెండవ సంవత్సరం కూడా మొదటి స్థానం లో నిలిచింది.
నివేదికలో ముఖ్యాంశాలు:
- CGWB నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 6553 మండలాలలో 667 మండలాలలో అధ్యయనం చేసింది. దేశంలో 2 నుంచి 5 మీటర్లలో నీరు లభించే ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, అసోం, UP (ఉత్తర ప్రాంతం), బీహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. 20-40 మీటర్లకి పడిపోయిన రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి.
- భారతదేశంలో భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్న మండలాలు 4,793 (73.1%) అలాగే ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలు 736(11.2%)గా ఉన్నాయి.
- భారతదేశంలో కొంతమేర సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 698 (10.7%). సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 199 (3%)గా ఉన్నాయి.
- భారతదేశంలో ఉప్పునీళ్లుగా మారిన మండలాలు 127(1.9%), అదే రాష్ట్రంలో 39 (5.85%)మండలాలు ఉన్నాయి.
- రాష్ట్రంలో సురక్షితంగా ఉన్న మండలాలు 597(89.5%), ఆందోళనకరంగా ఉన్న మండలాలు 10(1.5%), సమస్యాత్మకంగా ఉన్నవి 3(0.45), ఉప్పునీళ్లుగా మారినవి 39(5.85%).
- రాష్ట్రంలో భూగర్భజలాలు ఆందోళనకరంగా ఉన్న మండలాలు వెల్దుర్తి (పల్నాడు), రణస్థలం(శ్రీకాకుళం), పులివెందుల(వైఎస్ఆర్), రాచర్ల, పెద్దారవీడు, కంభం (ప్రకాశం), తనకళ్ళు, హిందూపురం, రోళ్ళ, గాండ్లపెంట (సత్యసాయి).
- రాష్ట్రంలో ఈ ఏడాది 835.03కి గాను 714.88 మీటర్లు వర్షపాతం నమోదైంది అని తెలిపింది.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |