Telugu govt jobs   »   Current Affairs   »   AP stood second in Health and...

AP stood second in Health and Wellness Centers | హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

AP stood second in Health and Wellness Centers | హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి  జాతీయ స్థాయిలో రాష్ట్రా నికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లోమొత్తంగా 1,60,480 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు పని చేస్తున్నట్టు ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 21,891 ఆరోగ్య కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయి. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో ఎక్కువ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసం ధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆర్బన్ హెల్త్ క్లినిక్స్ గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకి  ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్సు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది.

2nd National Spices Conference at Hyderabad_70.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!