Telugu govt jobs   »   Latest Job Alert   »   AP యూనివర్సిటీ నోటిఫికేషన్‌
Top Performing

AP విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 విడుదల

Table of Contents

AP విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్ పోస్టులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో  ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 30 అక్టోబర్ 2023 న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో 278 బ్యాక్ లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టులు అంటే మొత్తం 3,220 ప్రొఫెసర్ పోస్టులకు ఆయా వర్సిటీలు వేటికవే నోటిఫికేషన్ లు విడుదల చేశాయి. ఆన్లైన్ దరఖాస్తులను నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. స్క్రీనింగ్ పరీక్షను APPSC నిర్వహిస్తుంది. వర్సిటీ యూనిట్ గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు.

APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ లు ఆయా యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు లో ప్రచురించబడింది. అర్హత ఉన్న మరియు ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తి APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. ఏదైనా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్ట్ నియామకం కావడానికి కోసం నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఉన్న అన్నీ వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ మేము అన్నీ APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023  నోటిఫికేషన్ PDF ల డౌన్లోడ్ లింక్ ఇచ్చాము. ఆ లింకు పై క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేయాలి అనుకుంటున్నా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF 

APPSC యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 అవలోకనం

APPSC 30 అక్టోబర్ 2023న యూనివర్సిటీలు 3,220 లెక్చరర్ల పోస్టులను విడుదల చేసింది. APPSC యూనివర్సిటీలు లెక్చరర్ల పోస్టుల నోటిఫికేషన్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 అవలోకనం 
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్
పోస్ట్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీలు 3,220
నోటిఫికేషన్ విడుదల 30 అక్టోబర్ 2023
పరీక్షా విధానం ఆన్ లైన్
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ 2023, 38000 టీచర్ పోస్టుల నోటిఫికేషన్_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను దిగువ పట్టికలో అందించాము.

Details Date & Time
నోటిఫికేషన్ విడుదల తేదీ 30 అక్టోబర్ 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ 31 అక్టోబర్ 2023
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ & సమయం 20 నవంబరు 2023 5:00 PM
పోస్ట్/కొరియర్ ద్వారా అన్ని ఎన్‌క్లోజర్‌లతో పాటు అప్లికేషన్ హార్డ్‌కాపీని స్వీకరించడానికి చివరి తేదీ & సమయం: 27 నవంబరు 2023 5:00 PM
అసిస్టెంట్ ప్రొఫెసర్లు & లెక్చరర్ల స్క్రీనింగ్ పరీక్ష కోసం ప్రాథమికంగా అర్హత మరియు అనర్హుల దరఖాస్తుదారుల జాబితా 30 నవంబరు 2023
అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల కోసం ప్రాథమిక అర్హతపై ఫిర్యాదులను స్వీకరించడానికి చివరి తేదీ & సమయం 7 డిసెంబర్ 2023 5:00 PM
అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్క్రీనింగ్ పరీక్ష కోసం ప్రాథమిక అర్హత గల అభ్యర్థుల తుది జాబితా 8 డిసెంబర్ 2023
APPSC ద్వారా స్క్రీనింగ్/వ్రాత పరీక్ష కోసం నోటిఫికేషన్ తర్వాత తెలియజేయబడుతుంది
APPSC నిర్వహించే సబ్జెక్ట్ వారీగా స్క్రీనింగ్/వ్రాత పరీక్షల షెడ్యూల్ తర్వాత తెలియజేయబడుతుంది
APPSC ద్వారా పరీక్ష కేంద్రాల కేటాయింపు మరియు హాల్ టిక్కెట్ల జారీ తర్వాత తెలియజేయబడుతుంది
APPSC ద్వారా ఫలితాల ప్రకటన తర్వాత తెలియజేయబడుతుంది

 

AP యూనివర్సిటీలలో భర్తీ చేయనున్న ఖాళీలు

AP యూనివర్సిటీలలో భర్తీ చేయనున్న ఖాళీలు 
పోస్ట్ పేరు ఖాళీలు
ప్రొఫెసర్లు 418
అసోసియేట్ ప్రొఫెసర్ 801
అసిస్టెంట్ ప్రొఫెసర్ 2001
మొత్తం 3220

AP రాష్ట్ర విశ్వవిద్యాలయాల వారీగా  ఫ్యాకల్టీ ఖాళీల వివరాలు

Sl NO విశ్వవిద్యాలయాల పేర్లు ఖాళీలు
1 డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ 63
2 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 106
3 ఆంధ్రా యూనివర్సిటీ 523
4 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 265
5 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) 660
6 ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 99
7 డా. YSR ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 138
8 కృష్ణా యూనివర్సిటీ 86
9 డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ 99
10 జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU – గురజాడ విజయనగరం & గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, కురుపాం) 138
11 జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU-K) 98
12 జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU – అనంతపురం) 203
13 రాయలసీమ యూనివర్సిటీ 103
14 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 103
15 శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం 219
16 ద్రావిడ విశ్వవిద్యాలయం 24
17 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 175
18 యోగి వేమన విశ్వవిద్యాలయం 118
మొత్తం  3220 Posts

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు లింక్

మొత్తంగా 3220 ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 30 అక్టోబర్ 2023న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్ధులు 31 అక్టోబర్ 2023 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 20 నవంబర్ 2023 సాయంత్రం 05:00. స్వీయ-ధృవీకరించబడిన సంబంధిత డాక్యుమెంట్‌లతో పాటు అప్లికేషన్ హార్డ్‌కాపీని సమర్పించడానికి చివరి తేదీ 27 నవంబర్ 2023 సాయంత్రం 05:00 గంటలు. అభ్యర్థుల http://recruitments.universities.ap.gov.in వెబ్ సైటు నుండి లేదా దిగువ ఇచ్చిన లింక్ నుండి తమ దరఖాస్తు లను సమర్పించవచ్చు.

దరఖాస్తు చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు :

  • వెబ్‌సైట్‌లో నమోదు తప్పనిసరి.
  • అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/అసిస్టెంట్ లైబ్రేరియన్/అసిస్టెంట్ డైరెక్టర్/అసోసియేట్ ప్రొఫెసర్లు/డిప్యూటీ లైబ్రేరియన్/డిప్యూటీ డైరెక్టర్/ప్రొఫెసర్లు/లైబ్రేరియన్/డైరెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవాలి.
  • ఒక దరఖాస్తుదారు కోసం బహుళ వినియోగదారు IDలు నిషేధించబడ్డాయి.
  • మరిన్ని పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అదే రిజిస్ట్రేషన్/లాగిన్ ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. వారు ప్రతి పరీక్షకు ప్రత్యేక రుసుము చెల్లించాలి.

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు లింక్

ప్రొఫెసర్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు

  • దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌https://recruitments.universities.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి
  • అభ్యర్థి అందించిన లింక్‌పై క్లిక్ చేసి, ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు, రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అతను/ఆమె రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించాలి.
  • అభ్యర్థి నమోదు ధృవీకరించబడిన తర్వాత, అభ్యర్థి ఆధారాలను ఉపయోగించి అప్లికేషన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి మరియు విద్యార్హతలు, అనుభవం, విద్యా/పరిశోధన వివరాలు మొదలైన అన్ని అవసరమైన సమాచారాన్ని పూరించాలి మరియు సమర్పించాలి.
  • అభ్యర్థులు విజయవంతంగా సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకొని, రిజిస్టర్డ్ పోస్ట్/ కొరియర్/ స్పీడ్ పోస్ట్ ద్వారా అభ్యర్థి ఎంపిక చేసిన సంబంధిత విశ్వవిద్యాలయాలకు క్లెయిమ్ చేసిన ధ్రువపత్రాలకు మద్దతుగా స్వీయ ధృవీకరించిన సర్టిఫికెట్లు మరియు ఇతర డాక్యుమెంట్ల యొక్క స్వీయ ధృవీకరించిన హార్డ్ కాపీలను నిర్ణీత తేదీలోగా సమర్పించాలి.
  • దరఖాస్తుల హార్డ్ కాపీని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు యూనివర్సిటీలకు సమర్పించడం తప్పనిసరి. దరఖాస్తుదారులు పోస్టల్ జాప్యాలు లేదా ఏవైనా ఇతర ఊహించని సమస్యలను నివారించడానికి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే సమర్పించాలని సూచించారు. ఏ దశలోనూ పోస్టల్ జాప్యానికి విశ్వవిద్యాలయం బాధ్యత వహించదు

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు రుసుము

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్‌రిజర్వ్డ్/ BC/ EWS: రూ.2500/-
  • ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్ బెంచ్ మార్క్ విత్ డిజేబిలిటీ) :రూ.2 వేలు
  • ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్లైన్ దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లిం చాల్సి ఉంటుంది.
  • ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ టి విభాగాల్లో రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి.
  • ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు  150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
వర్గం ఒక్కో పరీక్షకు మొత్తం రుసుము
అన్‌రిజర్వ్డ్/ BC/ EWS రూ.2500/-
SC/ ST/ PBDలు రూ.2000/-
ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIలు) USD 50 సమానమైన మొత్తం రూపాయిలలో చెల్లించాలి (అంటే, రూ.4200/-)

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు విద్యా అర్హత & అనుభవం

  • AP స్టేట్ యూనివర్శిటీల ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి (లేదా గ్రేడింగ్ విధానాన్ని అనుసరించిన చోట పాయింట్-స్కేల్‌లో సమానమైన గ్రేడ్) లేదా సమానమైన డిగ్రీ, Ph. D. డిగ్రీ
  • కనీసం 8 సంవత్సరాల అనుభవంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.

గమనిక: పోస్ట్ వారీగా విద్యా అర్హత & అనుభవ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.

AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు జీతం

పోస్ట్ పేరు పే స్కేలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ Rs.57,700 – Rs. 1,82,400 (Level 10)
అసోసియేట్ ప్రొఫెసర్ Rs.1,31,400 – Rs. 2,17,100 (Level 13A)
RGUKTలో ప్రొఫెసర్లు Rs.1,44,200 – Rs. 2,18,200 (Level 14)

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్‌ 

విశ్వవిద్యాలయాల్లో  కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 వెయిటేజీ మార్కులు లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు వ్రాత పరీక్షా నిర్వహించి ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తామన్నారు. వారి నుండి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పోస్టుల భర్తీకి రేషనలైజేషన్ పక్రియ జరుగుతుందన్నారు.

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

AP విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ 2023 విడుదల_5.1

FAQs

APPSC యూనివర్సిటీ ల్లో ఎన్ని ప్రొఫెసర్ పోస్టులను విడుదల చేయనుంది?

AP యూనివర్సిటీల్లో 3220 ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది .

AP రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ ఉద్యోగాలు 2023 కోసం అర్హత గల అభ్యర్థులు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత గల అభ్యర్థులు 31 అక్టోబర్ 2023 నుండి 20 నవంబర్ 2023 వరకు AP రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

AP రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు హార్డ్‌కాపీని పంపడానికి చివరి తేదీ ఏది?

AP స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు హార్డ్‌కాపీని పంపడానికి చివరి తేదీ 27 నవంబర్ 2023.

About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!