Table of Contents
Andhra Pradesh Geography -Soil types of Andhra Pradesh (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) : స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం PDF తెలుగులో)
APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్ద
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎక్కువ భాగం వాయవ్య భాగాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలిఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులన్నీ సాధారణంగా వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తున్నాయి.
ముఖ్యమైన నదులు – కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న మంజీర, నాగావళి, వంశధార.
గోదావరి నది
- దక్షిణ భారత దేశ నదులన్నింటిలో పెద్ద నది. అందుకనే దీన్ని ‘దక్షిణ గంగ’ అని కూడా పిలుస్తారు.
- గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల వద్ద ఉండే నాసికా త్రయంబక్ దగ్గర పుట్టింది
- ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలో ప్రవేశించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా పయనించి పాపికొండల సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
- గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ. కాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 770 కి.మీ. దూరం పయనిస్తుంది.
గోదావరి నది ఉపనదులు – మంజీర ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని ముఖ్యమైనవి.
- రాజమండ్రికి ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీనిని సప్త గోదావరి అని పిలుస్తారు
గోదావరి ఏడు పాయలు:
- గౌతమి
- వశిష్ట
- వైనతేయ
- కౌశిక
- ఆత్రేయ
- తుల్య
- భరద్వాజ
గోదావరి డెల్ద్టా రాజమండ్రి వద్ద ప్రారంభమవుతుంది
Also Read: Famous Tourist places And Heritage Sites In India
- ఈ సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.
- గోదావరి లోయ పొడవునా మంచి కలపనిచ్చే దట్టమైన మన్యం అడవులు ఉన్నాయి.
- పాపికొండల ప్రాంతంలో మనోహర దృశ్యాల వల్ల గోదావరికి ‘భారత దేశ రైన్ నది (The Rhine Of India)’ అని పేరు వచ్చింది. సప్త గోదావరి ప్రాంతాన్ని కోనసీమ అని కూడా పిలుస్తారు.
- కోనసీమను ‘ఆంధ్రప్రదేశ్ ఉద్యాన వనం’గా పిలుస్తారు.
కృష్ణా నది
పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద కృష్ణా నది పుట్టింది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మీదుగా పయనిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ముక్తల్ తంగడి అనే ప్రాంతం వద్ద ప్రవేశించి, కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద తుంగభద్ర నదిని తనలో కలుపుకుంటుంది
- కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తూ కృష్ణా జిల్లాలోని విజయవాడకు 64 కి.మీ.దూరంలోని పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, ‘హంసలదీవి’ అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
- ఈ రెండు శాఖల మధ్య ఉన్న సారవంతమైన మైదానాన్ని ‘దివి సీమ‘ అంటారు.
- కృష్ణా నది మొత్తం పొడవు 1400 కి.మీ. కాగా తెలుగు రాష్ట్రాల్లో 720 కి.మీ.ల దూరం పయనిస్తుంది
కృష్ణా నది ఉప నదులు: మూసి, మున్నేరు, దిండి, పాలేరు, కొయన, వర్ణ, పంచగంగ్య భీమ, ఘటప్రభ,తుంగభద్ర.
కృష్ణా నది అతి ముఖ్యమైన ఉపనది – తుంగభద్ర
తుంగభద్ర నది
పశ్చిమ కనుమల్లోని దక్షిణ కెనరా, మైసూరు జిల్లాల సరిహద్దున ఉన్న వరాహ పర్వతాల్లో పుట్టి కర్ణాటక రాష్ట్రం ద్వారా పయనించి కర్నూలు జిల్లాలో సంగం/సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
- తుంగభద్ర ఉపనదుల్లో పెద్దది – హగరి
పెన్నా నది
పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లోని ‘చెన్న కేశవగిరి’ వద్ద పుట్టి,అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ప్రవేశిస్తుంది.
- ఇది అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల ద్వారా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
- పెన్నా నది పొడవు సుమారు 600 కి.మీ
- రాష్ట్రంలో పెన్నా నది పరివాహక శాతం – 18.3%
ఉపనదులు: జయమంగళి, చిత్రావతి, చెయ్యేరు, సగిలేరు, పాపమ్ని, కుందేరు
- పెన్నా నదిని పినాకిని, పెన్నేరు అని కూడా పిలుస్తారు.
వంశధార
తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది.
- ఒడిశాలోని జయపూరు కొండల్లో పుట్టి సుమారు 96 కి.మీ. ప్రవహించి, పాతపట్నం వద్ద శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తుంది.
- శ్రీకాకుళం జిల్లాలో 130 కి.మీ. దూరం ప్రవహించి చివరకు కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF
నాగావళి నది
- నాగావళి నదికి మరొక పేరు లాంగుల్యా నది.
- ఈ నది ఒడిశాలోని రాయ్‌గఢ్ కొండల్లో జన్మించి ఆ రాష్ట్రం మీదుగా ప్రవహించి శ్రీకాకుళంలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
- ఈ నది ఒడిశాలో 96 కి.మీ.ల దూరం, ఆంధ్రప్రదేశ్‌లో 110 కి.మీ. దూరం ప్రవహిస్తుంది.
ముఖ్య ఉపనదులు: స్వర్ణముఖి, జంరూవతి, వేదవతి, ఒట్టిగడ్డ
మాచ్‌ఖండ్
మాచ్‌ఖండ్ నది విశాఖపట్నం జిల్లాలోని మాడుగ కొండల్లో జన్మిస్తుంది. ఒడిశాలో ఉత్తర దిశగా పయనించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
- మాచ్‌ఖండ్‌కు మరొక పేరు – ‘ముచికుంద’
- మాచ్‌ఖండ్ నదిపై ఉన్న జలపాతం – ‘డుడుమా జలపాతం”
గుండ్లకమ్మ
కర్నూలు జిల్లాలోని నల్లమల కొండల్లో పుట్టి గుంటూరు, ప్రకాశం జిల్లాల ద్వారా 235 కి.మీ. ప్రవహించి ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
- ప్రాచీనకాలంలో దీన్ని ‘గుండిక’, బ్రహ్మకుండి అని పిలిచేవారు.
సువర్ణముఖి నది: ఇది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గుట్టల్లో జన్మించి నెల్లూరు జిల్లా ద్వారా ప్రవహిస్తూ, ఆ జిల్లాలోని ‘అందాల మాల’ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.
జిల్లాలు – నదులు
- శ్రీకాకుళం – బహుదా, వరహాలుగడ్డ, ఉత్తర మహేంద్ర
- విశాఖపట్నం – చంపావతి, గోస్తని, శారద, తాండవ
- తూర్పు గోదావరి – ఏలేరు
- పశ్చిమ గోదావరి – ఎర్రకాలువ, తమ్మిలేరు, జిల్లేరు
- కృష్ణా – బుడమేరు
- గుంటూరు – నాగులేరు
- నెల్లూరు – మున్నేరు, ఉప్పులేరు
- చిత్తూరు – స్వర్ణముఖి
- కర్నూలు – హంద్రీ, కుందేరు, సగిలేరు
- కడప – పాపాఘ్బీ, చిత్రావతి, చేయ్యేరు
Download: Climate Of Telangana Telugu PDF
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల వివరాలు
విషయం | కోస్తా (ఎకరాలు) | రాయలసీమ (ఎకరాలు) |
సేద్యయోగ్యమైన భూమి | 1,15,73,891 | 98,95,226 |
వివిధ నీటివనరుల కింద సాగవుతోన్న భూమి (బోర్లుమినహా) | 70,24,287 (60.7%) | 16,96,404 (17.2%) |
జలయబ్దంలో అదనంగా నీరు అందే భూమి | 26,63,002 (23.00%) | 19,22,344 (19.4%) |
ఆ భూమికి ఇవ్వబోయే నీరు (టీఎమ్సీ) | 485 (32.3%) | 182 (50.3%) |
జలయజ్ఞం తర్వాత మొత్తం మీద సాగులోకి వచ్చేభూమి | 96,87,599 (83.72%) | 36,18,748 (36.6%) |
సేద్యయోగ్య భూమిలో ఇంకా నీటి వసతి లేకుండా మిగిలేప్రాంతం | 18,86,892 (16.3%) | 62,76,478 (6.4%) |
Download :AP Geography(ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్ద )PDF
********************************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |