Telugu govt jobs   »   Article   »   AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలు...

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలు 2023 విడుదల, PET షెడ్యూల్ తనిఖీ చేయండి

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలు 2023 విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలను అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం 411 ఖాళీలను విడుదల చేసింది. AP పోలీస్ SI ప్రిలిమ్స్ లో అర్హత పొందిన అభ్యర్ధుల నుండి స్టేజ్ – II PMT / PET కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 21 జూలై 2023న ఉదయం 10.00 నుండి 03 ఆగస్టు 2023న సాయంత్రం 05.00 గంటల వరకు స్వీకరించింది. ఇప్పుడు అధికారిక వెబ్సైట్ లో పరీక్షా తేదీని విడుదల చేసింది. AP పోలీస్ SI PET/PMT పరీక్షలు 25 ఆగష్టు 2023 నుండి జరుగుతాయి. AP పోలీస్ SI PET/PMT పరీక్షలు 4 కేంద్రాలు (విశాఖపట్నం,ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు)లలో జరగనున్నాయి. AP పోలీస్ SI PET/PMT పరీక్ష కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ 2023 అవలోకనం

AP పోలీస్ SI PET/PMT పరీక్షలు 25 ఆగష్టు 2023 నుండి 4 కేంద్రాలు (విశాఖపట్నం,ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు)లలో జరగనున్నాయి. AP పోలీస్ SI PET/PMT పరీక్ష అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

AP పోలీస్ SI PET/PMT పరీక్ష  తేదీ అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్
పోస్ట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)
వర్గం పరీక్షా తేదీ
AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ  25 ఆగష్టు 2023 నుండి
AP పోలీస్ SI PET/PMT పరీక్ష కేంద్రాలు  విశాఖపట్నం,ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు
AP పోలీస్ SI PET/PMT పరీక్ష హాల్ టికెట్ విడుదల తేదీ 14 ఆగష్టు 2023
ఎంపిక పక్రియ ప్రిలిమ్స్, PMT & PET, మెయిన్స్
అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలను తెలియజేస్తూ అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో వెబ్ నోట్ ను విడుదల చేసింది. AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ 25 ఆగష్టు 2023 నుండి జరగనున్నాయి. 19 ఫిబ్రవరి 2023 న జరిగిన AP పోలీస్ SI  ప్రిలిమినరీ పరీక్షలో 57,293 అభ్యర్ధులు అర్హత పొందగా 56,116 మంది అభ్యర్ధులు AP పోలీస్ SI స్టేజ్ – II PMT / PET కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు. AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ వెబ్ నోట్ 

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ 2023

AP పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు మాత్రమే AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ లో పాల్గొనడానికి అర్హులు. అలానే AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ కు హాజరు కావడానికి అభ్యర్ధులు ముందుగా AP పోలీస్ SI స్టేజ్ – II PMT / PET కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుని ఉండాలి. AP పోలీస్ SI PET/PMT పరీక్ష 25 ఆగష్టు 2023 నుండి జరగనున్నాయి మరియు AP పోలీస్ SI PET/PMT పరీక్షలు  విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియు కర్నూలులలో జరగనున్నాయి. AP పోలీస్ SI PET/PMT పరీక్ష కు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు స్టేజ్ II ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ తీసుకువెళ్లాలి.

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీ వెబ్ నోట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

AP పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ PET/PMT పరీక్ష తేదీ వెబ్ నోట్ ను చేయడానికి క్రింది దశలను అనుసరించండి.

  • అభ్యర్థులు https://slprb.ap.gov.in/కి వెళ్లండి.
  • హోమ్ పేజీలో AP పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ PET/PMT పరీక్ష తేదీ వెబ్ నోట్ ను లింక్‌ను తనిఖీ చేయండి.
  • AP పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ PET/PMT పరీక్ష తేదీ లింక్ పై క్లిక్ చేయండి
  • AP పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ PET/PMT పరీక్ష తేదీ ని తనిఖీ చేయండి
  • AP పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ PET/PMT పరీక్ష తేదీని డౌన్‌లోడ్ చేసి, సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ కి తీసుకు వెళ్ళవలసిన పత్రాలు

AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ అభ్యర్ధులు వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే వారికి ఎలాంటి వ్యవధి ఇవ్వబడదు మరియు AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ పాల్గొనడానికి అర్హులు కారు. AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ కి తీసుకు వెళ్ళవలసిన పత్రాల వివరాలు దిగువన అందించాము.

  • SSC సర్టిఫికేట్
  • విద్యా అర్హత సర్టిఫికేట్ (డిగ్రీ)
  • కమ్యూనిటి సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • నేటివిటి సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • ఎక్స్ సర్విస్ మ్యాన్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • వయో సడలింపు సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్
  • AP పోలీస్ SI PET/PMT స్టేజ్ II ఆన్లైన్ దరఖాస్తు ఫామ్

AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ 2023

AP పోలీస్ SI PET/PMT ఈవెంట్స్ లో పాల్గొనే అభ్యర్ధులు SI PET/PMT  హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు స్టేజ్ II ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ తీసుకువెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్  SI PET/PMT హాల్ టికెట్ 14 ఆగష్టు 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేయనున్నారు. AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ విడదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ 2023 ను డౌన్లోడ్ చేసుకోగలరు.

AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ 2023 లింక్ (ఇన్ ఆక్టివ్)

AP Sub Inspector Related Articles :

AP Police SI
AP Police SI Notification AP Police SI Previous Year Cut off
AP Police SI Exam Pattern AP Police SI Syllabus
AP Police SI Salary AP Police Constable Stage-II online application

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

AP పోలీస్ SI PET/PMT పరీక్ష తేదీలు 2023 ఏమిటి?

AP పోలీస్ SI PET/PMT పరీక్ష 25 ఆగష్టు 2023 నుండి జరుగుతాయి

AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుంది?

AP పోలీస్ SI PET/PMT హాల్ టికెట్ 14 ఆగష్టు 2023 న విడుదల చేయబడుతుంది

AP పోలీస్ SI PET/PMT పరీక్ష కు ఏమేమి తీసుకువెళ్లాలి?

AP పోలీస్ SI PET/PMT పరీక్ష కు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు స్టేజ్ II ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ తీసుకువెళ్లాలి.