ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (AP SLPRB) 15 అక్టోబర్ 2023న AP పోలీస్ SI మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు AP పోలీస్ SI పరీక్ష విశ్లేషణను తనిఖీ ఇక్కడ తెలుసుకోవచ్చు. పరీక్షలో అడిగే ప్రశ్నల స్థాయిని తెలుసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. మేము మీకు సవివరమైన AP పోలీస్ SI మెయిన్స్ విశ్లేషణ 2023ని అందించబోతున్నాము.
AP పోలీస్ SI పరీక్ష విశ్లేషణ 2023
ఏపీ పోలీస్ SI మెయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగిన పరీక్షలో రెండు పేపర్లు నిర్వహించారు ఇవి కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే ఇందులో కనీస అర్హత మార్కులు సాధిస్తే రాత పరీక్ష కి అర్హులవుతారు. AP పోలీస్ SI పరీక్ష పేపర్లు(I,II) ఒక్కొక్కటి 100 మార్కులకు నిర్వహిస్తారు. మేము మీకోసం అత్యంత విశ్వసనీయమైన మరియు పరీక్ష విశ్లేషణతో మీ ముందుకు వచ్చాము. కాబట్టి, హాజరైన అభ్యర్థులు మరియు ఇంకా హాజరుకాని అభ్యర్థులు పరీక్షపై కొంత అవగాహన పొందవచ్చు. పేపర్ III యొక్క ప్రశ్నలు అరిథ్మెటిక్ (SSLC) మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ & మెంటల్ ఎబిలిటీ నుండి ఉంటాయి మరియు పేపర్ IV జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ టైప్) నుండి ప్రశ్నలు ఉంటాయి. AP పోలీస్ SI ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రతి పేపర్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఉంటుంది.
APPSC/TSPSC Sure Shot Selection Group
AP పోలీస్ SI మెయిన్స్ పరీక్ష విశ్లేషణ 2023
ఏపీ పోలీస్ SI మెయిన్స్ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తంగా 600 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ I ఇంగ్షీషు, పేపర్ 2 తెలుగు, పేపర్ 3 యొక్క ప్రశ్నలు అరిథ్మెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ /మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) మరియు పేపర్ 4 జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ టైప్) నుండి ప్రశ్నలు ఉంటాయి. AP పోలీస్ SI ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రతి పేపర్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఉంటుంది.
AP పోలీస్ SI మెయిన్స్ పరీక్ష 2023
AP పోలీస్ SI మెయిన్స్ పరీక్ష విశ్లేషణ 2023 | |
పరీక్ష | AP పోలీస్ SI |
నిర్వహించే సంస్థ | AP SLPRB |
అదికరిక వెబ్ సైటు | slprb.ap.gov.in |
AP పోలీస్ SI మెయిన్స్ ఎక్సామ్ తేదీ | 15 అక్టోబర్ 2023 |
AP పోలీస్ SI పరీక్ష సమయం | ౩ గంటలు |
AP SI మెయిన్స్ పరీక్షా సరళి 2023
(పోస్ట్ కోడ్ నం. 11 మరియు 13 కోసం: పైన పేర్కొన్న వాటిలో అర్హత సాధించిన అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన విధంగా నాలుగు పేపర్లలో (ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధిలో) చివరి వ్రాత పరీక్షకు హాజరు కావాలి.
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు | |
పోస్ట్ కోడ్ నెం.11, 14, 15 మరియు 16 | పోస్ట్ కోడ్ నెం. 12 మరియు 13 | ||
పేపర్ I | ఇంగ్షీషు | 100 | 100 |
పేపర్ II | తెలుగు | 100 | 100 |
పేపర్ III | అరిథ్మెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ /మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | 100 |
పేపర్ IV | జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | 100 |
మొత్తం | 600 | 400 |
వ్రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస మార్కులు
- OCS – 40%
- BCS – 35%
- SC/ST/Ex-servicemen – 30%
AP SI మెయిన్స్ పరీక్ష క్లిష్టత స్థాయి
ప్రతి పరీక్షా విభాగం యొక్క క్లిష్టత స్థాయిని తెలియజేయడానికి మా నిపుణుల బృందం SI మెయిన్స్ పరీక్ష విశ్లేషణ 2023ను మీకు అందిస్తున్నారు. పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి SI మెయిన్స్ పరీక్ష 2023 విభాగాలపై ఆధారపడి ఉంటుంది. SI మెయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉన్నాయి: ఇంగ్లీష్, తెలుగు, రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. SI మెయిన్స్ పరీక్ష విశ్లేషణ 2023 ప్రకారం, అభ్యర్థుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా, SI మెయిన్స్ పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి సులభం-మధ్యస్థంగా ఉంది. SI మెయిన్స్ పరీక్ష విశ్లేషణ 2023, మొదటి రోజున అడిగిన ప్రశ్నల ఆధారంగా క్లిష్ట స్థాయికి సంబంధించిన విభాగాల విశ్లేషణను ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు | క్లిష్టత స్థాయి |
పేపర్ I | ఇంగ్షీషు | 100 | సులభం |
పేపర్ II | తెలుగు | 100 | సులభం |
పేపర్ III | అరిథ్మెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ /మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | మధ్యస్థం- క్లిష్టం |
పేపర్ IV | జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | సులభం- మధ్యస్థం |
AP SI మెయిన్స్ పరీక్షా సరళి 2023 ఇంగ్షీషు
ఇంగ్షీషు విభాగం లో సిలబస్ లో చప్పిన విధంగానే రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో వివిధ సమస్యలకు సంభందించి లెటర్ రాయడం లేదా వ్యాసం, ఇలా ఏదైనా ఒక సందర్భం గురించి వివరించి రాయమని అడిగారు. డిస్క్రిప్టివ్ పరీక్ష కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
AP SI మెయిన్స్ పరీక్షా సరళి 2023 తెలుగు
తెలుగు విభాగం లో సిలబస్ లో చప్పిన విధంగానే రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో వివిధ విభాగాలకు సంభందించిన ప్రశ్నలను అడిగారు. డిస్క్రిప్టివ్ పరీక్ష సులభంగానే ఉంది అని పరీక్షకి సన్నద్దమై రాసిన అభ్యర్ధులు తెలిపారు. డిస్క్రిప్టివ్ పరీక్ష కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
AP SI మెయిన్స్ పరీక్షా సరళి 2023 అరిథ్మెటిక్
అరిథ్మెటిక్ విభాగంలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయి. మునుపటి సంవత్సరం తో పోలిస్తే అరిథ్మెటిక్ ప్రశ్నలు కొంచం క్లిష్టంగా ఉన్నాయి. సరియన ప్రాక్టీస్ మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అభ్యర్ధులు ఎక్కువ ప్రశ్నలను సమాధానం చేశారు.
పేపర్ | సబ్జెక్టు | గరిష్ట మార్కులు | ప్రశ్నల సంఖ్య | ప్రయత్నాలు |
పేపర్ III | అరిథ్మెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ /మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | 100 | 110-130 మార్కులు |
AP SI మెయిన్స్ పరీక్షా సరళి 2023 జనరల్ స్టడీస్
జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫ్ఫైర్స్ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి దాదాపుగా 50-60 ప్రశ్నలు కేవలం కరెంట్ అఫ్ఫైర్స్ మరియు స్టాటిక్ అవరేనేసస్ నుంచి ప్రశ్నలు అడిగారు. పొలిటీ నుంచి వచ్చిన ప్రశ్నలు సులభంగా సమాధానం చేసేలా ఉన్నాయి. ఎకానమీ పై దృష్టి సాధించిన అభ్యర్ధులు ఈ పేపర్ లో ఎక్కువ మార్కులు సాధించగలరు.
పేపర్ | సబ్జెక్టు | గరిష్ట మార్కులు | ప్రశ్నల సంఖ్య | ప్రయత్నాలు |
పేపర్ IV | జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ టైప్) | 200 | 100 | 120-140 మార్కులు |
AP SI మెయిన్స్ పరీక్షా పేపర్లు
అక్టోబర్ 14, 15 తేదీన జరిగిన పరీక్ష పేపర్లు అధికారిక వెబ్ సైటు లో APSPLRB ఉంచింది అభ్యర్ధులు కోసం ఈ కింద పేపర్ III మరియు పేపర్ IV వివిధ సెట్లను ఇక్కడ అందించాము.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |