AP Justice Lakshmana Reddy holds a great record by dealing 9141 cases | ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి 9141 కేసులను డీల్ చేసి గొప్ప రికార్డు సృష్టించారు
ఆంధ్రప్రదేశ్ కుర్నూల్ లోకాయుక్త న్యాయమూర్తిగా 2019 లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లక్ష్మారెడ్డి కేవలం నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన 9,141 ఫిర్యాదులపై విచారణ జరిపి తీర్పులు వెలువరించి రికార్డు సృష్టించారు. మరియు ఆయన నియామకం తో పాటు ప్రభుత్వం జాప్యం కారణంగా డిప్యూటీ లోకాయుక్త బాధ్యతలను కూడా తానే స్వయంగా చేపట్టారు. దేశం లోని ఏ లోకాయుక్త కూడా ఇన్ని తీర్పులు వెలువరించలేదు కావున ఆ ఘనత జస్టిస్ లక్ష్మారెడ్డి గారికే చెందుతుంది.
2020లో 1,928, 2021లో 2,307, 2022లో 2,874, 2023లో 2,032 కేసుల్లో జస్టిస్ రెడ్డి తీర్పులు వెలువరించారు. కేసుల పరిష్కారానికి ఈ అసాధారణ అంకితభావం దేశంలో అపూర్వం. లోకాయుక్త కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదులను సాంకేతికంగా లోకాయుక్త మరియు ఉపలోకాయుక్త రెండు రకాలుగా విభజించగా, జస్టిస్ రెడ్డి వాటన్నింటిపై శ్రద్ధగా తీర్పులు అందించారు. ఈ అసాధారణ విజయం అతని నిబద్ధతను ప్రతిబింబించడమే కాకుండా ఫిర్యాదుదారులు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేలా చేస్తుంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |