Telugu govt jobs   »   AP Industrial Policy 2023-27 Key Highlights

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-27 ముఖ్యాంశాలు | APPSC గ్రూప్ 1& 2 పరీక్షల ప్రత్యేకం

APPSC గ్రూప్1,2 మరియు ఇతర పోటీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు వంటి అంశాల పై కరెంట్ అఫ్ఫైర్స్ విభాగంలో లేదా ఎకానమీ& డెవలప్మెంట్ అంశంపై తరచూ ప్రశ్నలు వస్తాయి కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం 2023-27 గురించిన ముఖ్యాంశాలు ఈ కధనం లో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 8వ పెద్ద రాష్ట్రం మరియు దేశ జనాభాలో దాదాపు 4%, జాతీయ ఆదాయం లో 7వ స్థానంలో ఉంటూ దేశ పురోగతికి ఎంతో సహకరిస్తోంది. పారిశ్రామిక రంగం రాష్ట్ర జి.డి.పిలో దాదాపు 21% వాటాను కలిగి ఉంది. 974కిలోమీటర్ల తీర ప్రాంతం రాష్ట్రానికి ఒక ప్రధాన వనరుగా ఉపయోగపడుతోంది. రాష్ట్ర అభివృద్ది లో పారిశ్రామిక అభివృద్ది కూడా కీలకమే, అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఉపాధి, ఆదాయం వంటివి జీవన విధానాలని ఎంతో మెరుగుపరుస్తాయి. ప్రభుత్వం ఏప్రిల్ 2020లో తీసుకుని వచ్చిన పారిశ్రామిక విధానం 31 మార్చి 2023తో ముగుస్తోంది కావున నూతన పారిశ్రామిక విధానంని 2023-27కి అమలు పరచడానికి తీసుకుని వచ్చింది.నూతన పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది తద్వారా తొమ్మిది మిషన్లను నిర్దేశించుకుని పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికా సిద్దం చేస్తోంది. పరిశ్రమలకి అవసరమైన వసతులు, రాయితీలు కూడా అందించే ఏర్పాటు చేస్తోంది.

నూతన పారిశ్రామిక విధానం 2023 సంస్కరణల దిశగా అడుగులువేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్లు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రత్యేక వ్యవస్థను ప్రోత్సహించనున్నారు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

సింగిల్ విండో విధానం

రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు ప్రతిపాదనల దగ్గరనుంచి వాటి ఉత్పత్తికి అవసరమైన అన్నీ అనుమతులు అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సింగిల్ విండో విధానం తీసుకునివచ్చింది. పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే APIIC భూమిని కేటాయించే వెసులుబాటు కల్పించారు. అవసరమైన పరిశ్రమలకు 33-66 ఏళ్ల కాలానికి లీజు విధానంలో భూమిని కేటాయించనున్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించే విధంగా YSR AP ONE వ్యవస్థను అందుబాటులో ఉంచారు. MSME, SC, STలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు.

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

ప్రాజెక్టు అమలులో ఒక అధికారిని అంబాసిడర్ గా నియమిస్తారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలను త్వరితగతిన అమలయ్యేలా CS అధ్యక్షతన కమిటీనికూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆరునెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే సంస్థలకు ఎర్లీ బర్డ్ కింద ప్రోత్సాహకాలు అందిస్తారు.

అభివృద్దికి 9 మూలస్తంభాలు

ప్రభుత్వం ఆర్ధికాభివృద్దిని పొందడానికి ప్రణాళికను ఈ క్రింది తొమ్మిది భాగాలుగా విభజించింది:

ఆర్ధిక వృద్ది: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం. ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు లాజిస్టిక్ కల్పన, సులభతర వాణిజ్యం, MSMEలను ప్రోత్సహించనున్నారు. కనీసం పారిశ్రామిక అభివృద్ది రాష్ట్ర జి.డి.పి లో 30% వాటా ఉండేడట్టు చేయనున్నారు.

పోర్టు ఆధారిత అభివృద్ధి: ఆంధ్రప్రదేశ్ కి ఉన్న తీర ప్రాంతాన్ని సువర్ణవకాశం గా మాలచుకొని పోర్టు ప్రాంతాలు అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నారు. VCIC, CBIC, HBIC కారిడార్లతో పాటు రైలు, రోడ్డు, అంతర్గత జలరవాణా మార్గాలను అనుసంధానిస్తారు. నూతనంగా రాష్ట్రంలో పోర్టు లను ఏర్పాటు చేసి జల రవాణా ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించనున్నారు.

రవాణా వ్యవస్థను మెరుగుపరచడం: సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా రోడ్-రైల్ మార్గాలను అనుసంధానించడం మరియు తీర ప్రాంత షిప్పింగ్, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రోత్సహించడం. లాజిస్టిక్ పార్కుల అభివృద్ధితో పాటు నిల్వ సమర్ధ్యాలను పెంచడానికి  గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచ స్థాయి రెడీ టు బిల్డ్ పార్కులు: పరిశ్రమలు అనుమతులు పొందిన వెంటనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రస్తుత పారిశ్రామిక పార్కులతో పాటు కొత్తగా వచ్చే పార్కుల్లో రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీస్(SDF) ను అభివృద్ధి చేయడం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక, MSME పార్కులను నెలకొల్పడం. ప్లగ్ అండ్ ప్లే విధానం లో అన్నీ వసతులను అందించనున్నారు.

YSR AP ONE: ప్రభుత్వ విభాగాలకు చెందిన సేవలు, అనుమతులన్నీ ఒకేచోట లభించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ అనే పోర్టల్ని అభివృద్ధి చేయనున్నారు. తద్వారా పరిశ్రమ అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి వాటి ఏర్పాటులో జాప్యాన్ని తొలగించనున్నారు. YSR AP ONE ద్వారా కేవలం 21 రోజులలో అన్నీ అనుమతులు అందించే వెసులుబాటు కల్పించారు.

ఉద్యోగాలు సృష్టించడం: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా MSME రంగానికి ప్రోత్సహించడంతోపాటు ఇబ్బందుల్లో ఉన్న MSMEలకు చేయూతనివ్వడం.

మానవ వనరులు: పరిశ్రమలోని అన్ని వృద్ధి విభాగాలకు ఉపాధి కల్పించగల మానవశక్తిని సృష్టించడం, వాస్తవ అనుకరణ పరిశ్రమ పరిసరాల్లో శిక్షణలు ఇవ్వడం మరియు సాఫ్ట్-స్కిల్/ నైపుణ్య శిక్షణని అందించడం. యజమానులు మరియు శిక్షణ పొందిన అభ్యర్థులు ఇంటర్‌ఫేస్ చేయగల నైపుణ్యం కలిగిన మానవశక్తి యొక్క ఇంటరాక్టివ్ స్టేట్ పోర్టల్ ఆన్‌లైన్ జాబ్ మార్కెట్‌ని అభివృద్ధి చేయనున్నారు.

వ్యవస్థాపకత అభివృద్ధి మరియు స్టార్ట్అప్ సంస్కృతిని బలోపేతం చేయడం: యువతను నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే విధంగా మెంటారింగ్ కార్యక్రమాలు, స్టార్టప్ జోన్స్, స్టార్టప్లకు రాయితీలు, స్టార్టప్ ఫైనాన్సింగ్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్‌లను అభివృద్ధి చేసి స్టార్ట్ అప్ కల్చర్ ని ప్రోత్సహించనున్నారు.

మహిళలు, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చేయూత అందించడం: మహిళలు, SC, ST, మైనార్టీ వర్గాల వారిని కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. వారికి తగిన ప్రోత్సాహకాలు అందించి వారిని కూడా వ్యాపార అభివృద్ది లో పాలుపంచుకునేలా చేయడం.

RRB ALP CBT-I 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

ఇండస్ట్రియల్ కారిడార్ లను అభివృద్ది చేయడం

విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ది చేపట్టనున్నారు. ఈ మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 15 జిల్లాల మీదుగా పయనించనున్నాయి.

పెట్టుబడుల ఆకర్షణకు దృష్టిసారించిన ప్రధాన రంగాలు

  • కెమికల్స్-పెట్రోకెమికల్స్
  • ఫార్మాస్యూటికల్స్-బల్క్ డ్రగ్స్
  • టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్
  • ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ
  • ఆగ్రో, ఫుడ్ ప్రోసెసింగ్
  • ఇంజనీరింగ్ అండ్ మెడికల్ డివైసెస్
  • డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్
  •  మెషినరీ అండ్ ఎక్విప్మెంట్భ
  • విష్యత్తు నాల్గవ తర్గతి పరిశ్రమలు తయారీ రంగం, బయోటెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వెహికల్స్
  • రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించిన పరికరాల తయారీ

ప్రాంతీయ వర్గీకరణ మరియు సమతుల్య పారిశ్రామిక అభివృద్ధి

నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-28 ప్రాంతీయంగా, అన్ని వర్గాలలో సమతుల్య వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక మద్దతు ప్యాకేజీలు ఇచ్చి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూడనున్నారు.

పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతీయ సమతుల్యత కోసం, రాష్ట్రాన్ని తక్కువ పారిశ్రామికీకరణ, మధ్యస్థ పారిశ్రామికీకరణ మరియు అధిక పారిశ్రామికీకరణ ప్రాంతాలు అనే మూడు వర్గాలుగా విభజించారు. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని జిల్లాలకు పెట్టుబడులను మళ్లించడానికి ఈ విధానం ప్రాధాన్యత ఇస్తుంది.

కేటగిరి  పారిశ్రామికీకరణ జిల్లాలు
I తక్కువ పారిశ్రామికీకరణ అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, కోనసీమ, కుర్నూల్, కృష్ణ, నంద్యాల, మన్యం, శ్రీకాకుళం, కడప, పాడేరు
II మధ్యస్థ పారిశ్రామికీకరణ చిత్తూర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కాకినాడ, N.T.R, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, సత్య సాయి, విజయనగరం
III ఎక్కువ పారిశ్రామికీకరణ అనకాపల్లి, తిరుపతి, విశాఖపట్నం

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు మరియు టౌన్షిప్ లు

ప్రభుత్వం ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రోత్సహించి మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలు మరియు పట్టణ సౌకర్యాలతో స్వీయ-నియంత్రణ పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్‌ల వెంట ఉన్న పది గ్రీన్‌ఫీల్డ్ నోడ్‌లలో ఐదు PPP పద్ధతిలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.

ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు మార్గదర్శకాలు

  • ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కనీస పెట్టుబడి రూ. 200 కోట్లు.
  • ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ పరిమాణం ప్రైవేట్ డెవలపర్లు కలిగి ఉన్న భూమి విషయంలో కనీసం 50 ఎకరాలు మరియు APIIC/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూమి విషయంలో 100 ఎకరాలు ఉండాలి.
  • ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేయబడిన నివాస/వాణిజ్య జోన్ (ఏదైనా ఉంటే) మొత్తం అభివృద్ధి చెందిన భూమిలో 33% కంటే ఎక్కువ ఆక్రమించకూడదు.
  •  మొత్తం భూభాగంలో కనీసం 33% పచ్చదనం కోసం విడిచిపెట్టాలి.

లార్జ్, మెగా, అల్ట్రా-మెగా సంస్థల వర్గీకరణ

విభాగం పెట్టుబడి పెట్టుబడి కాలం
లార్జ్ 50Cr- 1000Cr 3 సంవత్సరాలు
మెగా >1000Cr- 3000Cr 4 సంవత్సరాలు
అల్ట్రా-మెగా >3000Cr 5 సంవత్సరాలు

pdpCourseImg

Read MOre
Difference between APPSC Group-2 Old Syllabus and New Syllabus How to Prepare Indian Society for APPSC Group 2 Prelims?
How to prepare for Mental Ability and Reasoning for APPSC Group 2? How to prepare for Quantitative Aptitude for APPSC Group 2 Exam?
How to prepare History for APPSC Group 2 Prelims and Mains? How to prepare Geography for APPSC Group 2 and other exams?
How to prepare for APPSC Group 2 Exam with New Syllabus? How to stay motivated while preparing for APPSC Group 2 Exam?
How should housewives and employees prepare for APPSC Group 2 Exam? 2 How To Prepare Notes For APPSC Group 2 Prelims And Mains Exams?
Strategies to get motivated and conquer exam stress in APPSC Group 2 preparation APPSC Group 2 Free Notes PDF Download (Adda247 Studymate Notes)
Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu Adda’s Study Mate APPSC Group 2 Prelims Special

Sharing is caring!