AP Higher Education Department Has Entered Into An MoU With edX | ఈడీఎక్స్ సంస్థతో ఏపీ ఉన్నత విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అగ్రశ్రేణి ఆన్‌లైన్ కోర్సులకు ప్రవేశం పొందే అద్భుతమైన చొరవను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కోర్సుల సర్టిఫికెట్ల ద్వారా ఉపాధి అవకాశాలను మరియు ఉద్యోగ అవకాశాలను మెరుగుపడతాయని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆగష్టు 17 న ఎడెక్స్ సంస్థతో ఏపీ ఉన్నత విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై ఎడెక్స్ వ్యవస్థాపకుడు, CEO అనంత్ అగర్వాల్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు సంతకాలు చేశారు.
ఈ సహకారం కింద, ఎడెక్స్ రాష్ట్ర విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులను అందించడం కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది. దీన్ని కరిక్యులమ్ లో భాగం చేయనున్నారు. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలతో కలిసి ఎడెక్స్ సంయుక్తంగా సర్టిఫికెట్ ఇస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవడం చాలామందికి కష్టమైన విషయం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు రూపొందించిన కోర్సులను ఇక్కడే ఉంటూ నేర్చుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుంది ఆయా కోర్సులకు బోధనా సిబ్బంది కొరతనూ అధిగమించవచ్చు.
ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు, ఆర్ట్స్, కామర్స్ ల్లోనూ పలు సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి’ అని వివరించారు. ఉన్నత విద్య సిలబస్ ను పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలని, ఆధునికతను అందిపుచ్చుకోవడం, నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా కోర్సులను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులు తమ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడంలో సాధికారత కల్పించేందుకు బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |