AP Government Approved Developmental Works worth 19,037crs | 19,037 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB) సమావేశం తాడేపల్లిలోని సీఎం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో 19,037 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారు. ఈ పెట్టుబడులు మొత్తం 10 ప్రాజెక్టులకు సంభందించినవి ఇందులో 7 కొత్త ప్రాజెక్టులు మరియు 3 ప్రాజెక్టు విస్తరణలు ఉన్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు.
పెట్టుబడుల వివరాలు:
- ఏలూరు జిల్లా కొమ్మూరు లో శ్రీ వేంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్ 114 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
- విశాఖ జిల్లాలో మద్ది వద్ద ఓరిల్ ఫూడ్స్ లిమిటెడ్ 50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
- చిత్తూరు జిల్లాలో 4,640 కోట్ల పెట్టుబడితో విద్యుత్ తో నడిచే బస్లను తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు కానుంది.
- అనకాపల్లి జిల్లా SEZ లో 166 కోట్లు పెట్టుబడితో SMILE (సబ్స్ట్రెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైస్ ) ఏర్పాటు కానుంది.
- విజయనగరం జిల్లా లో 531 కోట్లతో JSW ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది.
- శ్రీకాకుళం జిల్లా లో 1750 కోట్లతో శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
- నెల్లూరు జిల్లా లో ఆంధ్ర పవర్ లిమిటెడ్ తో (రిలయన్స్ పవర్) కంపెనీ పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ 6,174 కోట్లతో ఏర్పాటు కానుంది.
- విశాఖ జిల్లా SEZ లో ATC టైర్స్ లిమిటెడ్ 679 కోట్లతో విస్తరించనున్నారు.
- శ్రీకాళహస్తి లో ఎలెక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ 993 కోట్లతో విస్తరించనున్నారు .
- తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న ఆంధ్ర పేపర్ ఇమిటెడ్ 4,000కోట్లతో సంస్థను విస్తరించనున్నారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |